తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pesarapappu Vada: ప్రోటీన్ నిండిన పెసరపప్పు గారెలు, ఇలా చేశారంటే అందరికీ నచ్చుతాయి

Pesarapappu Vada: ప్రోటీన్ నిండిన పెసరపప్పు గారెలు, ఇలా చేశారంటే అందరికీ నచ్చుతాయి

Haritha Chappa HT Telugu

22 October 2024, 17:30 IST

google News
    • Pesarapappu Vada: పెసరపప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. సాయంత్రం పూట స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా పెసరపప్పు గారెలు చేసుకొని తినండి, రెసిపీ చాలా సులువు.
పెసరపప్పు గారెలు
పెసరపప్పు గారెలు (Youtube)

పెసరపప్పు గారెలు

సాయంత్రం అయితే చాలు ఏదైనా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా బయట వండే ఆహారాల కన్నా ఇంట్లో వండే పదార్థాల్ని తినడం మంచిది. ఇక్కడ మేము ప్రోటీన్ నిండిన పెసరపప్పు గారెలు రెసిపీ ఇచ్చాము. పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని గారెల్లా చేసుకుని తింటే క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉంటాయి. వీటిని వండడం కూడా చాలా సులువు. కొందరు వీటిని సాధారణ పెసరపప్పుతో వండుకుంటారు. మరికొందరు మొలకెత్తిన పెసళ్లతో వండుతారు. ఎలా వండినా ఇవి రుచిలో అదిరిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం పెసరపప్పు గారెలు ఎలా చేయాలో తెలుసుకోండి. మీ ఇంటికి అతిధులు వచ్చినప్పుడు చేసి పెట్టండి. కచ్చితంగా మీకు ప్రశంసలు దక్కుతాయి. పెసరపప్పు రెసిపీ కింద ఇచ్చాము.

పెసరపప్పు గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు

పెసరపప్పు - ఒక కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

మిరియాలు - అర స్పూను

సోంపు - ఒక స్పూను

పుదీనా తరుగు - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

వెల్లుల్లి రెబ్బలు - నాలుగు

అల్లం - చిన్న ముక్క

జీలకర్ర - అర స్పూను

శెనగపిండి - రెండు స్పూన్లు

బేకింగ్ సోడా - అర స్పూను

నూనె - సరిపడినంత

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - రెండు

కసూరి మేతి - ఒక స్పూను

పెసరపప్పు గారెలు రెసిపీ

1. పెసరపప్పును ముందుగానే నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొత్తిమీర, ఇంగువ, జీలకర్ర, మిరియాలు వేసి వేయించుకోవాలి.

3. వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పును మిక్సీలో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

5. వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

6. ఈ పెసరపప్పు పిండిలో ముందుగా పొడిచేసి పెట్టుకున్న మిశ్రమాన్ని, రుచికి సరిపడా ఉప్పును, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, కసూరి మేతి తరుగు, శెనగపిండి, బేకింగ్ సోడా, మిరియాల పొడి, సోంపు అన్ని వేసి బాగా కలుపుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.

8. పెసరపప్పు మిశ్రమం నుంచి కొంత ముద్దను తీసుకొని చేత్తోనే ఒత్తుకొని గారెల్లా చేసి నూనెలో వేయించుకోవాలి.

9. రెండువైపులా బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే టేస్టీ పెసరపప్పు గారెలు రెడీ అయిపోయినట్టే.

10. దీన్ని తినడానికి పక్కన ఎలాంటి చట్నీ అవసరం లేదు.

పెసరపప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ పెసరపప్పు గారెలను చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పిల్లలకి కూడా ఇవి చాలా నచ్చుతాయి. ఇవి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి, చట్నీ అవసరం లేదు.

టాపిక్

తదుపరి వ్యాసం