Pesarla halwa: పెసరపప్పు ఉంటే చాలు, చిటికెలో రెడీ అయ్యే మూంగ్ హల్వా రెసిపీ-make moong halwa or pesarla halwa recipe with these measurements ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pesarla Halwa: పెసరపప్పు ఉంటే చాలు, చిటికెలో రెడీ అయ్యే మూంగ్ హల్వా రెసిపీ

Pesarla halwa: పెసరపప్పు ఉంటే చాలు, చిటికెలో రెడీ అయ్యే మూంగ్ హల్వా రెసిపీ

Pesarla Halwa: పెసర్లతో హల్వా ఎవరైనా చేయగల సింపుల్, రుచికరమైన స్వీట్. ఇంట్లో పెసర్లుంటే చాలు. కాస్త కష్టపడితే ఈ టేస్టీ డిష్ రెడీ అవుతుంది. పండగరోజు తక్కువ టైంలో చేసుకోదగ్గ సింపుల్ స్వీట్ మూంగ్ హల్వా.

పెసరపప్పు హల్వా (shutterstock)

పెసరపప్పుతో చేసే మూంగ్ హల్వా ఎక్కువగా ఫంక్షన్లలో తింటుంటాం. పెసరపప్పు హల్వా తినడానికి చాలా రుచికరంగా ఉండటమే కాకుండా తయారు చేయడం కూడా చాలా సులభం. హల్వా పూర్తయ్యాక పెసరపప్పుతో చేశారన్నా నమ్మలేరు. అందరూ ఆస్వాదిస్తూ తినే ఈ స్వీట్ రెసిపీ తయారీ ఎలాగో చూసేద్దాం.

పెసరపప్పు హల్వా కోసం కావాల్సిన పదార్థాలు:

1 కప్పు పాలు

1/2 టీస్పూన్ యాలకుల పొడి

1/2 కప్పు దేశీ నెయ్యి

1 కప్పు పంచదార

చిటికెడు కుంకుమపువ్వు (ఆప్షనల్)

పెసరపప్పు హల్వా తయారీ విధానం:

  1. ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి నీటితో 3 గంటలు నానబెట్టాలి.
  2. ఆ తర్వాత పప్పును జల్లెడలో వేసి నీరంతా తీసేసి మిక్సీలో కాస్త బరకగానే రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా గోరువెచ్చని పాలు తీసుకుని అందులో కుంకుమపువ్వు వేసి బాగా కరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు కాస్త లోతు ఎక్కువున్న పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. అందులో నెయ్యి వేసి మీడియం మంట మీద వేడి చేయాలి.
  5. నెయ్యి కరిగిన తర్వాత కాస్త బరకగా రుబ్బిన పెసరపప్పు వేసుకోవాలి. అడుగంటకుండా ముద్దను కలుపుతూనే ఉండాలి. కాసేపటికి అది బంగారు రంగులోకి మారి మంచి వాసన వస్తుంది. దీనికి 20 నిమిషాల దాకా సమయం పడుతుంది.
  6. పప్పు వేయించేటప్పుడు కలియబెడుతూనే ఉండాలి.
  7. పప్పు బాగా వేగిపోయాక ఒక కప్పు పాలు, ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు పోసి బాగా కలిపి పప్పును మీడియం మంట మీద 10 నిమిషాలు ఉడికించాలి.
  8. ఆ తర్వాత ఒక కప్పు పంచదార, కుంకుమపువ్వు పాలు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
  9. ఈ మిశ్రమం మరో 5 నిమిషాలు ఉడికించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. పెసర పప్పు హల్వా సిద్ధం అయినట్లే. బాదం పప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.