తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Anjeer: ఈ వ్యాధులతో బాధపడేవారు నానబెట్టిన అంజీర్‌లను ఖాళీ పొట్టతో తినడం చాలా అవసరం

Anjeer: ఈ వ్యాధులతో బాధపడేవారు నానబెట్టిన అంజీర్‌లను ఖాళీ పొట్టతో తినడం చాలా అవసరం

Haritha Chappa HT Telugu

08 September 2024, 9:30 IST

google News
  • Anjeer: అంజీర్ పండ్లు డ్రైఫ్రూట్స్ జాబితాలోకే వస్తాయి. వీటిని ఒకసారి కొంటే ఎన్నో రోజులు నిల్వ ఉంటాయి. వీటిని రోజూ పరగడుపున తింటే అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఏ వ్యాధులు ఉన్నవారు అంజీర్ తినాలో తెలుసుకోండి.

అంజీర్ తింటే వచ్చే లాభాలు
అంజీర్ తింటే వచ్చే లాభాలు

అంజీర్ తింటే వచ్చే లాభాలు

ఆధునిక కాలంలోని ఆహారపు అలవాట్లు, కాలుష్యం వల్ల తరచూ రోగాలకు గురవుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వాటిని ఎదుర్కోవడానికి కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను ఆహారంలో చేర్చుకుంటే రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు. అత్తి పండ్లను ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ గా మారుస్తారు. వాటినే అంజీర్ అంటారు. వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని మీరు తినే విధానం అనేక వ్యాధులపై మంచి ప్రభావం చూపుతుంది. అంజీర్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఖాళీ పొట్టతో తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

ఒకటి లేదా రెండు అంజీర్లను రాత్రి నీటి నానబెట్టాలి. వాటిలో బాదం, వాల్ నట్స్ కూడా వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాటిని తినాలి. ఇలా రోజూ తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

మలబద్ధకం సమస్య ఉన్నవారు

మలబద్ధకం సమస్యతో బాధపడేవారు మూత్ర విసర్జనకు ఇబ్బంది పడుతుంటారు. వీరు రోజూ ఉదయాన్నే పరగడుపున నానబెట్టిన రెండు అంజీర్ పండ్లను తినాలి. ఇవి ప్రేగు కదలికలను సరిచేస్తాయి. రోజువారీ మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే, పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

డయాబెటిస్ ఉన్నవారు తింటే

డయాబెటిస్ ఉన్న వారు నానబెట్టి న అంజీర్ పండ్లను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు ఉంటే డయాబెటిస్ సమస్య మరింత పెరుగుతుంది. అంజీర్ పండ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాషియం శరీరంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. క్లోరోజెనిక్ ఆమ్లం అత్తి పండ్లలో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. నానబెట్టిన రెండు అంజీర్ పండ్లను ప్రతిరోజూ ఉదయం పరగడుపున తింటే టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గేందుకు

అంజీర్ పండ్లలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఆహారం. ఉదయాన్నే ఖాళీ పొట్టతో అత్తి పండ్లను తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలా అని మీర ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరిగిపోతారు. రోజుకు రెండుకు మించి తినకపోవడమే మంచిది.

రక్తపోటు అదుపులో

అంజీర్ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కొరోనరీ ధమనుల్లో అడ్డంకులను నివారిస్తుంది. అత్తి పండ్లను తినడం వల్ల శరీరంలో పెరిగిన ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుతుంది.

హార్మోన్ అసమతుల్యత

అంజీర్ పండ్లను తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య తొలగిపోతుంది. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఉన్న మహిళలు హార్మోన్ల అసమతుల్యత సమస్యల బారిన పడుతూ ఉంటారు. రుతుక్రమ సమస్యలతో బాధపడే అమ్మాయిలు కూడా ఎంతో మంది ఉన్నారు. వారంతా కచ్చితంగా అంజీర్ పండ్లను తింటే మంచిది.

తదుపరి వ్యాసం