తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Burji Sandwich: బరువు పెంచని.. యమ్మీ పనీర్ బుర్జి శాండ్‌విచ్..

Paneer burji sandwich: బరువు పెంచని.. యమ్మీ పనీర్ బుర్జి శాండ్‌విచ్..

HT Telugu Desk HT Telugu

19 June 2023, 6:30 IST

google News
  • Paneer burji sandwich: ఉదయం అల్పాహారంలోకి రుచిగా ఉండే పన్నీర్ బుర్జి శాండ్‌విచ్ ఎలా తయారుచేసుకోవాలో చూసేయండి. 

శాండ్‌విచ్
శాండ్‌విచ్ (freepik)

శాండ్‌విచ్

అల్పాహారం చేసే సమయం లేనపుడు శాండ్‌విచ్ మంచి ఆప్షన్. అయితే ఎప్పుడూ బంగాళదుంపతోనే కాకుండా ఒకసారి పన్నీర్ బుర్జితో ప్రయత్నించి చూడండి. తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. రుచి అద్భుతంగా ఉంటుంది. పదే నిమిషాల్లో శాండ్‌విచ్ రెడీ అయిపోతుంది. 

కావాల్సిన పదార్థాలు:

4 బ్రెడ్ స్లైసులు

ఒక కప్పు పన్నీర్

2 చెంచాల బటర్

1 చెంచా నూనె

1 చెంచా సన్నని వెల్లుల్లి తరుగు

సగం చెంచా కారం

పావు చెంచా పసుపు

సగం చెంచా కారం

సగం చెంచా గరం మసాలా

సగం చెంచా ఆమ్ చూర్ పొడి

1 ఉల్లిపాయ 

1 టమాటా

తయారీ విధానం:

  1. ముందుగా కడాయిలో నూనె వేసుకుని వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేగనివ్వాలి. 
  2. ఇప్పుడు స్టవ్ కట్టేసి అందులోనే పన్నీర్ తురుము, పసుపు, ఉప్పు, కారం, ఆమ్ చూర్ పొడి వేసుకుని కలుపుకోవాలి. 
  3. ఇపుడు ఒక బ్రెడ్ స్లైసుకు బటర్ రాసుకుని సన్నని గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పన్నీర్ బుర్జి మిశ్రమం కూడా సర్దుకోవాలి. 
  4. మీద మరో బ్రెడ్ స్లైస్ పెట్టుకుని కాస్త నూనె లేదా బటర్ వేసుకుని గ్రిల్ చేసుకోవాలి. లేదా రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే పన్నీర్ బుర్జి శాండ్ విచ్ సిద్ధం. 

తదుపరి వ్యాసం