తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palak Dosa: క్రిస్పీ పాలక్ దోశ, కొబ్బరి చట్నీతో ఈ దోశ టేస్టీగా ఉంటుంది

Palak Dosa: క్రిస్పీ పాలక్ దోశ, కొబ్బరి చట్నీతో ఈ దోశ టేస్టీగా ఉంటుంది

Haritha Chappa HT Telugu

20 June 2024, 6:00 IST

google News
    • Palak Dosa: పాలకూరతో చేసిన రెసిపీలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలకూరతో ఎప్పుడూ కూరలు మాత్రమే వండుతారు. దీనితో టేస్టీ దోశలు వేసుకోవచ్చు.
పాలకూర దోశెలు
పాలకూర దోశెలు

పాలకూర దోశెలు

Palak Dosa: పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. పాలకూరతో చేసిన రెసిపీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి కచ్చితంగా వారానికి రెండు మూడు సార్లు పాలకూరతో చేసిన వంటకాలు తినడం చాలా మంచిది. ఇక్కడ మేము క్రిస్పీ పాలక్ దోశ రెసిపీ ఇచ్చాము. ఈ గ్రీన్ దోశ పిల్లలకు పెడితే ఎంతో మంచిది. పాలకూరను ఇలా దోశ రూపంలో తినిపిస్తే వారికి పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. దీనిలో ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పాలక్ దోశ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పాలక్ దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పాలకూర తరుగు - ఒక కప్పు

బియ్యప్పిండి - ఒకటిన్నర కప్పు

బొంబాయి రవ్వ - అరకప్పు

జీలకర్ర - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నీరు - సరిపడినంత

అల్లం తురుము - అర స్పూను

పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను

కరివేపాకు తరుగు - గుప్పెడు

ఇంగువ - చిటికెడు

నూనె - సరిపడినంత

పాలక్ దోశ రెసిపీ

1. పాలకూరను పరిశుభ్రంగా కడిగి నీటిలో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.

2. తర్వాత పాలకూరని తీసి చల్లపరచాలి. దాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.

3. ఒక పెద్ద గిన్నెలో ఆ పాలకూర పేస్ట్ ను వేయాలి.

4. అందులోనే బియ్యప్పిండి, రవ్వ, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

5. నీటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

6. ఎలాంటి గడ్డలు లేకుండా బాగా గిలక్కోట్టాలి.

7. తర్వాత అల్లం తరుగు, కరివేపాకు తరుగు, ఇంగువ, ఉల్లిపాయల తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి.

8. రవ్వ దోశకు ఎంత పల్చగా చేసుకుంటారో అంత పలుచగా మిశ్రమాన్ని చేసుకుని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేయాలి.

9. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె పోసుకోవాలి.

10. దానిపైన ఈ పాలకూర మిశ్రమాన్ని వేసి పల్చగా దోశెను కాల్చుకోవాలి.

11. ఈ దోశెను కొబ్బరి చట్నీతో తిన్నా, పల్లీ చట్నీతో తిన్నా టేస్టీగా ఉంటుంది.

పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలు పాలకూరని తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి పాలకూర దోశలు పెట్టడం ద్వారా అందులోని పోషకాలను అందించవచ్చు. ఇది క్రిస్పీగా కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు.

తదుపరి వ్యాసం