తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Old Rice Vs New Rice: పాత బియ్యం లేదా కొత్త బియ్యం, ఈ రెండిట్లో ఏవి ఆరోగ్యం? ఎన్నాళ్లు గడిస్తే వాటిని పాత బియ్యం అంటారు?

Old Rice Vs New Rice: పాత బియ్యం లేదా కొత్త బియ్యం, ఈ రెండిట్లో ఏవి ఆరోగ్యం? ఎన్నాళ్లు గడిస్తే వాటిని పాత బియ్యం అంటారు?

Haritha Chappa HT Telugu

20 September 2024, 8:00 IST

google News
    • Old Rice Vs New Rice: చాలామంది ఇళ్లల్లో పాత బియ్యం, కొత్త బియ్యం అనే పదాలు వినే ఉంటారు. కొంతమందికి ఆ పదాలకు అర్థం తెలియదు. రెండింటిలో ఏవి ఆరోగ్యకరమో ఇప్పుడు తెలుసుకుందాం.
పాత బియ్యం అంటే ఏమిటి?
పాత బియ్యం అంటే ఏమిటి? (Unsplash)

పాత బియ్యం అంటే ఏమిటి?

Old Rice Vs New Rice: సంక్రాంతి వచ్చిందంటే కొత్త బియ్యం అనే పదం వినిపిస్తూ ఉంటుంది. బియ్యం దుకాణాల్లో పాత బియ్యం, కొత్త బియ్యం అనే పదాలు కూడా విని ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించారా? పాత బియ్యం అంటే ఏమిటో కొత్త బియ్యం అంటే ఏమిటో... ఎన్నాళ్లు గడిస్తే బియ్యాన్ని పాత బియ్యమని పిలుస్తారో తెలుసా? అలాగే పాత బియ్యం, కొత్త బియ్యంలో వేటిని తింటే ఆరోగ్యకరం అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకుందాం.

పాత బియ్యం అంటే

పాత బియ్యమైనా, కొత్త బియ్యమైనా... అన్ని ఒకటే. పొలాల్లో పండిన వరి కంకులకు వచ్చేవే. అయితే బియ్యాన్ని మిల్లు నుంచి తెచ్చాక ఏడాది పాటు నిల్వ ఉంచితే ఆ తర్వాత అవి పాత బియ్యంగా మారిపోతాయి. ఏడాదిలోపు వయసున్న బియ్యం కొత్తబియ్యం. సంక్రాంతికి పంట చేతికి వస్తుంది కాబట్టి కొత్త బియ్యంతో పాయసాలు చేసేందుకు అందరూ సిద్ధమవుతారు. ఆ కొత్త బియ్యమే ఏడాది తర్వాత పాత బియ్యంగా పేరు మార్చుకుంటుంది.

కొత్త బియ్యం, పాత బియ్యం... ఈ రెండింటిలో ఉండే పోషకాలు మారవు. కానీ కొన్ని తేడాలు మాత్రం ఉంటాయి. కొత్త బియ్యంతో పోలిస్తే పాత బియ్యంలోనే ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువ. పాత బియ్యంలో తేమశాతం తక్కువగా ఉంటుంది. అలాగే పూర్తిగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. అందుకే పాత బియ్యాన్ని తినమని చెబుతారు పోషకాహార నిపుణులు. పాత బియ్యం వండితే ముద్ద కాకుండా ఉంటుంది. పొడిపొడిగా వస్తుంది. కొత్త బియ్యంతో పోలిస్తే పాత బియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది త్వరగా ఆక్సీకరణం చెందుతుంది. పాత బియ్యంతో వండిన వంటకాలు రుచిపరంగా బావుంటాయి.

కొత్తబియ్యం అంటే

ఇక కొత్త బియ్యం విషయానికి వస్తే ఇది ఇవి చాలా తెల్లగా ఉంటాయి. సున్నితంగా జారుతున్నట్టు కనిపిస్తాయి. రుచి పరంగా చూస్తే సాధారణంగా ఉంటాయి. కొత్త బియ్యం కంటే పాత బియ్యమే తినాలనిపిస్తుంది. కొత్త బియ్యాన్ని మిల్లులో పాలిష్ చేసి తీసుకువస్తారు. దీనివల్ల వీటిని వెంటనే తినడం అంత మంచిది కాదు. కొత్త బియ్యంతో పోలిస్తే పాత బియ్యంలో తేమ తక్కువగా ఉంటుంది. అందుకే వండేటప్పుడు పాత బియ్యానికి తక్కువ నీరు అవసరం పడుతుంది. అదే కొత్త బియ్యానికి ఎక్కువ నీటిని వాడాల్సి వస్తుంది.

బియ్యం ఎంత పాతవి అయినా వాటిలో ముఖ్య పోషకాలు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, లిపిడ్లు మాత్రం మారవు. ఆ విషయంలో కొత్త బియ్యము, పాత బియ్యము ఒకేలాంటి ఫలితాలను ఇస్తాయి. కొత్త బియ్యం, పాత బియ్యంతో పోలిస్తే తేమవంతంగా ఉంటాయి. కాబట్టి కొత్త బియ్యం వండేటప్పుడు తక్కువ నీటిని వేయాలి. పాత బియ్యం లో తేమ చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఉడికేందుకు ఎక్కువ నీరు అవసరం పడుతుంది.

బిర్యానీ, పులావ్ వంటి వంటకాలు వండుకోవాలంటే పాత బియ్యమే మంచి ఎంపిక. కొత్త బియ్యంతో అవి సరిగా రావు. కొత్త బియ్యము పొడిపొడిగా రాకుండా కాస్త జిగటగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి టేస్టీ వంటకాలను పాత బియ్యంతోనే వండేందుకు ప్రయత్నించండి.

తదుపరి వ్యాసం