తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Old Pillow Effects : శరీరంలో ఇలాంటి మార్పులు వస్తే మీ దిండు కారణం కావొచ్చు

Old Pillow Effects : శరీరంలో ఇలాంటి మార్పులు వస్తే మీ దిండు కారణం కావొచ్చు

Anand Sai HT Telugu

08 January 2024, 19:00 IST

google News
    • Old Pillow Health Effects : మనం ఉపయోగించే వస్తువులు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. రాత్రి వాడుకునే దిండు కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
దిండుతో ఆరోగ్య సమస్యలు
దిండుతో ఆరోగ్య సమస్యలు

దిండుతో ఆరోగ్య సమస్యలు

ఆరోగ్య సమస్యలు ఎప్పుడూ ఆహారం వల్ల మాత్రమే రావు. ఎంత చక్కటి ఆహారం తీసుకున్నా.. కొన్నిసార్లు మనం ఉపయోగించే వస్తువులు కూడా మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. మనం వాడే దుప్పట్లు, దిండు కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అవును మీరు ఉపయోగిస్తున్న దిండుతో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ప్రాణాంతకమైనవి కావు.., కానీ అసౌకర్యం, చికాకును కలిగిస్తాయి.

మీరు ప్రతి రాత్రి మీ దిండుతో సవాసం చేస్తారు. దీనిపై రాత్రిపూట తలని ఉంచడం ద్వారా మంచి నిద్రను పొందేలా చేస్తుంది. అయితే ఇది నిద్రకు ఎంత మంచిదో.. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కలిగిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే.. ఆరోగ్య సమస్యలను మీరు ఎదుర్కొంటుంటే మీ దిండును మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.

మీకు భుజం లేదా మెడ నొప్పి ఉంటే.. మీరు ఉపయోగించే దిండు రకం వల్ల ఇది కలుగుతుండొచ్చు. మీ మెడ, తలను సౌకర్యవంతంగా ఉంచడానికి మీ దిండు పరిమాణం ఉత్తమ కోణాన్ని అందించాలి. చాలా మందపాటి లేదా చాలా చదునైన దిండు మీ తలను అసహజ స్థితిలోకి నెట్టివేస్తుంది. మీ దిండు మందంగా ఉంటే నిద్రపట్టడం కుదరదు. మెడ నొప్పులు వస్తాయి. మీరు సైడ్ స్లీపర్ అయితే, మందమైన దిండు మీ mattress, మీ తల మధ్య ఖాళీని పూరించడానికి సహాయపడుతుంది. మీ మెడ, తలకి సరైన కోణాన్ని సృష్టిస్తుంది.

మీ దిండు కారణంగా మెుటిమలు వస్తాయని మీకు తెలుసా? మీ చర్మం మీ పిల్లోకేస్ తో ఘర్షణకు కారణమవుతుంది. దానిపై మృత చర్మ కణాలు పడిపోతాయి. మీ జుట్టుకు ఉన్న ఆయిల్ అంటుకుంటుంది. ఈ కారణంగా మీకు మెుటిమలు అవుతాయి. మీరు వారానికి ఒకసారి మీ పిల్లోకేసులను కడగడం లేదా మార్చడం చేయాలి. లేదంటే.. మీ ముఖ చర్మం ఎక్కువగా నూనెలు, మురికికి గురవుతుంది.

మీరు రాత్రి ఎక్కువసార్లు మేల్కొంటుంటే దిండు కారణం కావచ్చు. దిండు సరిగా లేకుంటే నిద్రపట్టదు. మధ్య మధ్యలో నిద్రలేస్తాం. హార్మోన్లను రీబ్యాలెన్స్ చేయడానికి, కణజాలాలను రిపేర్ చేయడానికి, మరుసటి రోజుకు పునరుజ్జీవింపజేయడానికి మన శరీరానికి సరైన నిద్ర అవసరం. మీ దిండు సగానికి వంగి దాని అసలు ఆకృతికి తిరిగి రాకపోతే దిండును మార్చడానికి ఇది సమయం.

కళ్ళ దురద, ముక్కు కారడం, తుమ్ములు వంటివి కూడా దిండు కారణంగా వస్తాయి. జెర్మ్స్ తరచుగా కడుక్కోని పిల్లోకేసులపై వృద్ధి చెందుతాయి. ఎందుకంటే అవి చర్మ కణాల వంటి పొడి ప్రాంతాలను ఇష్టపడతాయి.

తదుపరి వ్యాసం