తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nuvvula Curry: స్పైసీగా నువ్వుల కూర ఇలా వండుకోండి, చలికాలంలో బెస్ట్ కర్రీ రెసిపీ ఇది

Nuvvula Curry: స్పైసీగా నువ్వుల కూర ఇలా వండుకోండి, చలికాలంలో బెస్ట్ కర్రీ రెసిపీ ఇది

Haritha Chappa HT Telugu

16 December 2024, 11:33 IST

google News
    • Nuvvula Curry: చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే కూరలను తినాలి. ఇక్కడ మేము నువ్వుల కూర రెసిపీ ఇచ్చాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా నువ్వుల కూర రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
నువ్వుల కూర రెసిపీ
నువ్వుల కూర రెసిపీ (Youtube)

నువ్వుల కూర రెసిపీ

నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సీడ్స్. వీటిని గుప్పెడు ప్రతిరోజూ తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక్కడ మేము కొత్తగా నువ్వులు కూర రెసిపీ ఇచ్చాము. నువ్వుల పచ్చడి ఎంత ఇష్టంగా తింటారో నువ్వుల కూరను కూడా మీరు అంతే ఇష్టంగా తినే అవకాశం ఉంది. వేడివేడి అన్నంలో ఈ నువ్వుల కూరను కలుపుకొని తిని చూడండి. మీకు దీని రుచి అద్భుతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి నువ్వుల కూర రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు.

నువ్వుల కూర రెసిపీకి కావలసిన పదార్థాలు

నువ్వులు - ఒక కప్పు

నీళ్లు - తగినన్ని

నూనె - రెండు స్పూన్లు

పచ్చిమిర్చి - నాలుగు

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

వెల్లుల్లి రెబ్బలు - ఆరు

మినప్పప్పు - అర స్పూను

పచ్చి మిర్చి - ఎనిమిది

కరివేపాకులు - గుప్పెడు

ఇంగువ - చిటికెడు

ఉల్లిపాయల తరుగు - ఒక కప్పు

పసుపు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కారం - అర స్పూను

నువ్వుల కూర రెసిపీ

1. నువ్వులను ముందుగానే గంటసేపు నానబెట్టుకోవాలి.

2. వాటిని మిక్సీలో వేసి తగినంత నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. గట్టి చట్నీకి ఎలా రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకులు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి.

5. అవి వేగాక ఉల్లిపాయల తరుగును వేసి బాగా వేయించుకోవాలి.

6. నిలువుగా తరిగిన పచ్చిమిర్చిని కూడా బాగా వేసి వేయించాలి.

7. ఉల్లిపాయలు రంగు మారేవరకు వేయించుకున్నాక ముందుగా రుబ్బి పెట్టుకున్న నువ్వుల ముద్దను అందులో వేసి బాగా కలపాలి.

8. రుచికి సరిపడా ఉప్పును, పసుపును, కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి.

9. పైన మూత పెట్టి చిన్న మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

10. తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగు లేదా కరివేపాకు తరుగు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.

11. టేస్టీ నువ్వుల కూర రెడీ అయినట్టే. దీని రుచి అద్భుతంగా ఉంటుంది.

నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో గుప్పెడు నువ్వులు ప్రతిరోజూ తినండి. మీకు ఎన్నో రకాల సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో నువ్వులు ముందుంటాయి. రక్తపోటును తగ్గించడంలో కూడా నువ్వులు మంచి ఔషధంలా పనిచేస్తాయి. మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు నువ్వులను ఆహారంలో భాగం చేసుకోండి. మీకు త్వరగా ఉపశమనం కలుగుతుంది. నువ్వుల్లో పీచు అధికంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నువ్వుల్లో ఐరన్, కాపర్, సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఎక్కువగానే ఉంటాయి. పిల్లలకు, బాలింతలకు, మహిళలకు శారీరక శ్రమ అధికంగా చేసే వారికి నువ్వులు తినాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇచ్చిన నువ్వుల కూర ఒక్కసారి చేసుకుని చూడండి... స్పైసీగా మీకు ఎంతో నచ్చేలా ఉంటుంది.

తదుపరి వ్యాసం