తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Macaroni Pasta Recipe । మసాలా మాకరోనీ పాస్తా.. దీని రుచి అమోఘం!

Macaroni Pasta Recipe । మసాలా మాకరోనీ పాస్తా.. దీని రుచి అమోఘం!

HT Telugu Desk HT Telugu

07 July 2023, 19:30 IST

google News
    • Macaroni Pasta Recipe: మాకరోనీ అనేది ఒక ఇండో-ఇటాలియన్ ఫ్యూజన్ డిష్. ఇక్కడ మీకు భారతీయశైలిలో చేసే మాకరోనీ పాస్తా రెసిపీని అందిస్తున్నాము
Macaroni Pasta Recipe
Macaroni Pasta Recipe (istock)

Macaroni Pasta Recipe

Monsoon Recipes: మాకరోనీ అనేది అనేక రకాలైన పాస్తా వంటకాల తయారీకి ఉపయోగిస్తారు. ఇది ఒక ఇండో-ఇటాలియన్ ఫ్యూజన్ డిష్. ఇక్కడ మీకు భారతీయశైలిలో చేసే మాకరోనీ పాస్తా రెసిపీని అందిస్తున్నాము. టొమాటోలు, ఉల్లిపాయ ముక్కలు, కొన్ని మసాలాలు కలిపి రుచికరమైన పాస్తా వంటకాన్ని. కేవలం 30 నిమిషాలలోపు తయారు చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇందులో వివిధ రకాల కూరగాయలను కూడా కలుపుకోవచ్చు. బేబీ కార్న్, గ్రీన్ పీస్, బంగాళదుంపలు, క్యారెట్, బెల్ పెప్పర్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ లేదా బ్రోకలీ ఫ్లోరెట్స్ వంటి మిశ్రమ కూరగాయలను కలపడం ద్వారా పూర్తి భోజనంగా మార్చవచ్చు. అయితే ఇక్కడ సింపుల్ మాకరోని పాస్తాను ఎలా చేయాలో తెలుసుకోండి.

Macaroni Pasta Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు మాకరోనీ
  • 1 టేబుల్ స్పూన్ నూనె
  • 1 tsp వెల్లుల్లి
  • 1/2 tsp అల్లం
  • 1/2 కప్పు ఉల్లిపాయ
  • 1 కప్పు టమోటాలు
  • 1/4 కప్పు క్యాప్సికమ్ సన్నగా తరిగినది
  • 2 టేబుల్ స్పూన్లు క్యారెట్లు
  • 1 టేబుల్ స్పూన్ టమోటా సాస్
  • 1/2 కప్పు పాస్తా ఉడికించిన నీరు
  • 1 స్పూన్ కొత్తిమీర
  • 1 tsp ఎర్ర మిరప పొడి
  • 1/2 స్పూన్ గరం మసాలా పొడి
  • రుచికి తగినంత ఉప్పు

మాకరోని పాస్తా తయారీ విధానం

  1. ముందుగా ఒక వంటపాత్రలో 4 కప్పుల నీటిని మరిగించండి, ఇందులో కొద్దిగా ఉప్పుతో పాటు 1 స్పూన్ నూనె వేయండి.
  2. మరుగుతున్న నీటిలో కప్పు మాకరోనీ పాస్తా మెత్తగా ఉడికించుకోవాలి, ఆ తర్వాత పాస్తాను వడకట్టి ఉంచుకోండి, వండిన నీటిని రిజర్వ్ చేయండి
  3. ఇప్పుడు .ఒక పాన్ లో నూనె వేడి చేయండి, అందులో అల్లంవెల్లుల్లి వేసి వేయించండి.
  4. అనంతరం ఉల్లిపాయను వేసి వేయించాలి. ఆపై టొమాటోలు, మిగిలిన కూరగాయ ముక్కలను వేసి కలుపుతూ వేయించాలి, ఆ తర్వాత మూతపెట్టి ఉడికించాలి.
  5. కారంపొడి, గరం మసాలా పొడి, ఇతర మసాలాలను వేసి కలపండి. ఉడికించిన పాస్తా నీటిని కలపండి, టొమాటో సాస్ కూడా వేసి ఉడికించండి.
  6. చివరిగా ఉడికించిన పాస్తా వేసి బాగా కలపండి, ఆపై తరిగిన కొత్తిమీర వేసి కలపండి.

అంతే, రుచికరమైన మాకరోని పాస్తా రెడీ.

తదుపరి వ్యాసం