తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Little Millet Upma Recipe । సామలతో ఉప్మా.. ఇలా చేస్తే రుచికరం, మరెంతో ఆరోగ్యకరం!

Little Millet Upma Recipe । సామలతో ఉప్మా.. ఇలా చేస్తే రుచికరం, మరెంతో ఆరోగ్యకరం!

HT Telugu Desk HT Telugu

07 July 2023, 6:30 IST

google News
    • Little Millet Upma Recipe: సామలతో ఉప్మాను ఇన్‌స్టంట్ పాట్ ప్రెజర్ కుక్కర్‌లో 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో తయారు చేయవచ్చు. సామలు ఉప్మా రెసిపీని ఈ కింద చూడండి.
Little Millet Upma Recipe
Little Millet Upma Recipe (istock)

Little Millet Upma Recipe

Healthy Breakfast Recipes: ఉప్మాను ఎప్పుడూ చేసేలా రవ్వతో కాకుండా మిల్లెట్లతో కూడా వండుకోవచ్చు. మిల్లెట్లతో చేసిన రవ్వ మీకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం మంచి బలవర్ధకమైన అల్పాహారం అవుతుంది, మిల్లెట్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, మలబద్దకం నివారించడంలో సహాయపడుతుంది, అంతేకాకుండా మిల్లెట్లు గ్లూటెన్ రహితమైన ఆహారం, అందువల్ల ఇవి బరువు తగ్గడానికి అనువైనవి. డయాబెటిక్ పేషెంట్లకు ఈ చిరుధాన్యాలు గొప్ప ఆహారం. వారు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా రోజూ మిల్లెట్లతో వండిన ఆహారాలు తినాలి.

సామలు మిల్లెట్లలో చాలా చిన్నగా ఉంటాయి, అందుకే వీటిని లిటిల్ మిల్లెట్ అంటారు. సామలతో ఉప్మాను ఇన్‌స్టంట్ పాట్ ప్రెజర్ కుక్కర్‌లో 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో తయారు చేయవచ్చు. సామలు ఉప్మా రెసిపీని ఈ కింద చూడండి.

Little Millet Upma/ Samai Upma Recipe కోసం కావలసినవి

  • 1/2 కప్పు సామలు
  • 1 కప్పు నీరు
  • 1 మీడియం సైజ్ ఉల్లిపాయ
  • 1/2 కప్పు మిశ్రమ కూరగాయలు (బీన్స్, క్యారెట్, బఠానీలు, క్యాప్సికమ్)
  • 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము
  • 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరిగిన
  • 1 టీస్పూన్ నిమ్మరసం
  • రుచికి తగినంత ఉప్పు
  • 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె
  • 1/2 టీస్పూన్ ఆవాలు
  • 1/2 టీస్పూన్ జీలకర్ర
  • 1 చిటికెడు ఇంగువ
  • 2 పచ్చిమిర్చి
  • 1 టీస్పూన్ అల్లం
  • 1 కరివేపాకు రెమ్మ

సామలు ఉప్మా తయారీ విధానం

  1. ముందుగా సామలను శుభ్రంగా కడగాలి, అనంతరం వాటిని కనీసం 15-30 నిమిషాలు నీటిలో నానబెట్టండి.
  2. ఆ తరువాత బాణాలిలో నూనె వేసి, వేడెక్కిన తర్వాత, ఆవాలు, జీరా వేసి, వాటిని చిమ్మనివ్వండి.
  3. తర్వాత ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి, కొన్ని సెకన్ల పాటు వేయించాలి.
  4. అనంతరం ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించాలి.
  5. ఆపైన తరిగిన కూరగాయలు వేసి కలపండి, కొద్దిగా ఉడికించండి.
  6. ఇప్పుడు నానబెట్టిన మిల్లెట్, సుమారు ఒక కప్పు నీరు వేయండి, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
  7. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ మీద సుమారు 5 నిమిషాలు ఆవిరిలో ఉడికించండి.

అంతే సామల ఉప్మా రెడీ. కొబ్బరి చట్నీతో లిటిల్ మిల్లెట్ ఉప్మాను సర్వ్ చేయండి.

తదుపరి వ్యాసం