తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Normal Delivery Q&a: నార్మల్ డెలివరీ అంటే భయం వద్దు, ఈ వాస్తవాలు తెల్సుకోండి

Normal delivery Q&A: నార్మల్ డెలివరీ అంటే భయం వద్దు, ఈ వాస్తవాలు తెల్సుకోండి

28 September 2024, 7:03 IST

google News
  • Normal delivery Q&A: నార్మల్ డెలివరీ విషయంలో సాధారణంగా అనేక అపోహలు, ప్రశ్నలు ఉంటాయి. ప్రసవించబోయే ప్రతి మహిళ భయాందోళనలు లేకుండా ఉండలంటే వీటికి సమాధానాలు తెల్సుకోవాల్సిందే. 

నార్మల్ డెలివరీ విషయంలో ప్రశ్నలు జవాబులు
నార్మల్ డెలివరీ విషయంలో ప్రశ్నలు జవాబులు (freepik)

నార్మల్ డెలివరీ విషయంలో ప్రశ్నలు జవాబులు

నార్మల్ డెలివరీ, సి సెక్షన్ డెలివరీ.. ఈ రెండింటి గురించి చాలామందిలో అనేక సందేహాలుంటాయి. ప్రసవించబోతున్న మహిళ మనసులో ఏ పద్ధతిలో శిశువును కనడం మంచిదనే విషయంలో అనేక ప్రశ్నలుంటాయి. ముఖ్యంగా నార్మల్ డెలివరీ గురించి భయం ఎక్కువగా ఉంటుంది. నొప్పి భరించడం మొదలుకొని అనేక సందేహాలుంటాయి. దాంతో సి సెక్షన్ నయం అని భావిస్తారు. అందరికీ ఈ విషయంలో సాధారణంగా ఉండే సందేహాలు, వాటికి సంబంధించిన జవాబులు తెల్సుకోండి.

ప్రశ్న 1: సిజేరియన్ కన్నా నార్మల్ డెలివరీలో నొప్పి ఎక్కువగా ఉంటుందా?

జవాబు: చాలా మందిలో పురిటి నొప్పులు భరించడం వాళ్ల తరం అవుతుందా కాదానే భయం ఉంటుంది. సిజేరియన్‌లో నొప్పి తక్కువ అనుకుంటారు. కానీ నార్మల్ డెలివరీ తర్వాత కోలుకోడానికి తక్కువ సమయం పడుతుంది. సిజేరియన్ డెలివరీ అనేది ఒక  సర్జరీ. దీని తర్వాత కోలుకోడానికి సమయం ఎక్కువగా పడుతుంది.

ప్రశ్న 2: సి సెక్షన్ వల్ల నార్మల్ డెలివరీతో పోలిస్తే సౌకర్యం ఎక్కువంటారు. నిజమేనా?

జవాబు: సిజేరియన్ డెలివరీ అనేది ఒక సర్జికల్ విధానం. మీ పొట్టలో కోత పెట్టి శిశువును బయటకు తీస్తారు. ఇక సౌకర్యం విషయానికొస్తే ప్రతి పద్దతిలో కొన్ని లాభనష్టాలుంటాయి. కానీ మీకు ప్రసవం విషయంలో ఎలాంటి సమస్యలు, చిక్కులు లేకపోతే నార్మల్ డెలివరీ శ్రేయస్కరం.

ప్రశ్న 3: నార్మల్ డెలివరీలో నొప్పి భరించలేనంత ఉంటుందా?

జవాబు: నిజమే. నొప్పి ఉంటుంది. కానీ మీ ధైర్యాన్నంత కూడగట్టుకుని ఒక్కరోజు కోసం సిద్ధం అవ్వండి. నొప్పిని భరించగలను అనే స్పష్టత, దృఢ నిశ్చయంతో ఉంటే మీకు సాధ్యం కానిది ఏదీ లేదు. మీరు భరించే నొప్పి మంచి కోసం తప్ప కష్టం వల్ల కాదని గుర్తు చేసుకోండి. అలాగే ఇప్పుడు నొప్పిని తగ్గించడానికి అనేక శ్వాస వ్యాయామాలున్నాయి. వాటిని సాధన చేస్తే మంచిది.

ప్రశ్న 4: మొదటి డెలివరీలో సి సెక్షన్ అయితే, రెండో డెలివరీలో నార్మల్ డెలివరీ సాధ్యం కాదా?

జవాబు: ఇది చాలా మందిలో ఉండే అపోహ మాత్రమే. నిజానికి మొదటి డెలివరీలో సి సెక్షన్ అయినా కూడా రెండో డెలివరీ నార్మల్ అవ్వచ్చు. కాాకపోతే మొదటి ప్రెగ్నెన్సీ ఎలా ఉందనే దాన్ని బట్టి ఇది ఆధారపడుతుంది. అలాగే రెండు ప్రెగ్నెన్సీల మధ్య కనీసం 2 సంవత్సరాల ఎడం ఉండాలి.

ప్రశ్న 5: నార్మల్ డెలివరీ వల్ల శృంగార సామర్థ్యం తగ్గుతుందా?

జవాబు: నార్మల్ డెలివరీ వల్ల శృంగారలో అసంతృప్తి, లేదా శృంగార సామర్థ్యంలో మార్పు వస్తుందని చెప్పడానికి ఎలాంటి నిరూపణలు లేవు.

ప్రశ్న 6: నార్మల్ డెలివరీ వల్ల గర్భాశయం జారిపోతుంది

జవాబు: నార్మల్ డెలివరీ వల్ల గర్భాశయం కిందికి జారిపోతుందనేది అపోహ మాత్రమే. ఈ కారణంగా సిజేరియన్ డెలివరీ ఎంచుకోవడం తెలివైన పని మాత్రం కాదు.

ప్రశ్న 7: బొడ్డుతాడు శిశువు మెడకు చుట్టుకుని ఉంటే సిజేరియన్ డెలివరీ అవసరం?

జవాబు: బొడ్డు తాడు శిశువు కదలికలకు సరిపడా పొడవులో ఉంటుంది. కాబట్టి దాంతో ఏ ప్రమాదం ఉండదు. ఇది నార్మల్ డెలివరీకి సమస్య కాదు. నిపుణుల సమక్షంలో నార్మల్ డెలివరీ అయితే ఏ ప్రమాదం ఉండదు.

నార్మల్, సిజేరియన్ పద్దతులు ఎంచుకోవడం పూర్తిగా మహిళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఏ పద్దతిలో అయినా దేనికదే ప్రత్యేక సౌకర్యాలు, కష్టాలు ఉంటాయి. అన్నీ అనుకూలంగా ఉంటే మాత్రం నార్మల్ డెలివరీ ఎంచుకోవడం ఉత్తమం. 

 

 

 

 

తదుపరి వ్యాసం