తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mushroom Masala: పుట్టగొడుగుల మసాలా కర్రీ రెసిపీ, చూస్తేనే నోరూరిపోతుంది, ఇక తింటే మర్చిపోలేరు

Mushroom Masala: పుట్టగొడుగుల మసాలా కర్రీ రెసిపీ, చూస్తేనే నోరూరిపోతుంది, ఇక తింటే మర్చిపోలేరు

Haritha Chappa HT Telugu

13 September 2024, 17:30 IST

google News
  • Mushroom Masala: మీకు పుట్టగొడుగుల కూర అంటే ఇష్టమా మేము చెప్పినట్టు మసాలా కర్రీ వండుకొని చూడండి వదలకుండా మొత్తం తినేస్తారు అంత రుచిగా ఉంటుంది రెసిపీ

మష్రూమ్ మసాలా కర్రీ రెసిపీ
మష్రూమ్ మసాలా కర్రీ రెసిపీ (Youtube)

మష్రూమ్ మసాలా కర్రీ రెసిపీ

Mushroom Masala: కొందరికి మష్రూమ్స్ పేరు వింటేనే నోరూరిపోతుంది. వాటిని మసాలా పెట్టి వండితే రుచి అదిరిపోతుంది. ఇక్కడ మేము మష్రూమ్ మసాలా కర్రీ ఎలా వండాలో చెప్పాము. ఇదే పద్ధతిలో వండి చూడండి, టేస్ట్‌ను మర్చిపోలేరు. మష్రూమ్ మసాలా కర్రీ వండడం కూడా చాలా సులువు.

మష్రూమ్ మసాలా కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు

పుట్టగొడుగులు - 200 గ్రాములు

ఉల్లిపాయలు - మూడు

పెరుగు - అరకప్పు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

పసుపు - పావు స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

గరం మసాలా - ఒక స్పూను

చికెన్ మసాలా - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

అనాస పువ్వు - ఒకటి

లవంగాలు - నాలుగు

యాలకులు - రెండు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

బిర్యానీ ఆకు - రెండు

నూనె - తగినంత

జీలకర్ర - అర స్పూను

మష్రూమ్స్ మసాలా కర్రీ రెసిపీ

1. మష్రూమ్స్‌ను మీకు కావలసిన సైజులో కట్ చేసుకుని ఒక గిన్నెలో శుభ్రంగా కడిగి వేయండి.

2. ఆ గిన్నెలోనే పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోండి. దీన్ని పక్కన పెట్టండి.

3. ఈ లోపు ఉల్లిపాయలను సన్నగా తరిగి ఉంచండి.

4. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి ఉల్లిపాయలు రంగు మారేవరకు వేయించండి. తర్వాత స్టవ్ కట్టేయండి.

5. ఆ ఉల్లిపాయల వేపుడును చల్లార్చి వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయండి.

6. ఆ పేస్ట్ ను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా పుట్టగొడుగుల మిశ్రమంలో బాగా కలిపేయండి.

7. మరొక పది నిమిషాలు పక్కన పెట్టండి.

8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.

9. ఆ నూనెలో జీలకర్ర, లవంగాలు, అనాసపువ్వు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి వేయించండి.

10. అవి వేగాక కారం కూడా వేసి వేయించండి.

11. వెంటనే మ్యారినేట్ చేసుకున్న పుట్టగొడుగుల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోండి.

12. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒక పావు గంట సేపు మూత పెట్టి ఉడికించండి.

13. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ పుట్టగొడుగుల మసాలా కర్రీ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.

పుట్టగొడుగులను తినడం వల్ల విటమిన్ డి అందుతుంది. దీనిలో సెలీనియం, రిబోఫ్లేవిన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. కొన్ని రకాల వ్యాధులను రాకుండా అడ్డుకోవడంలో కూడా పుట్టగొడుగులుముందుంటాయి.

తదుపరి వ్యాసం