తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Infections For Diabetes : వానాకాలం మధుమేహ వ్యాధిగ్రస్తులు స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఏం చేయాలి?

Skin Infections For Diabetes : వానాకాలం మధుమేహ వ్యాధిగ్రస్తులు స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఏం చేయాలి?

HT Telugu Desk HT Telugu

27 July 2023, 14:30 IST

google News
    • Skin Infections For Diabetes : వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. వానాకాలం చల్లటి వాతావరణం చాలా మందికి ఇష్టం. ఆరోగ్యం విషయానికి వస్తే ఆందోళన చెందాల్సిందే. ఎందుకంటే.. వర్షాకాలం కొన్నిసార్లు చాలా వ్యాధులను కలిగిస్తుంది.
వానాకాలం సూచనలు
వానాకాలం సూచనలు

వానాకాలం సూచనలు

వర్షాకాలం ఇన్ఫెక్షన్(Monsoon Skin Infection), చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే చల్లని వాతావరణంలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరుగుతాయి. ఇది నేరుగా మన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ విషయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు(Diabetes) ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో భూమి ఎండదు. నేల పూర్తిగా తడిగా ఉంటుంది. బ్యాక్టీరియా పెరిగి అనేక రోగాలకు కారణమవుతుంది. మలేరియా, వైరల్ ఫీవర్(Viral Fever) మాత్రమే కాకుండా చర్మవ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం..

మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఈ సమస్య రావచ్చు. శరీరంలో అధిక రక్త చక్కెర స్థాయిలు చర్మ సమస్యలు(Skin Problems) లేదా ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. దురద, పుండ్లు వంటి సమస్యలను కలిగిస్తుంది. రక్త ప్రసరణ తగ్గడం వల్ల కొల్లాజెన్ దెబ్బతింటుంది, చర్మంలో గాయం లేదా ఇన్ఫెక్షన్ పూర్తిగా నయం కాకుండా చేస్తుంది.

వర్షాకాలంలో శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతాయి. ఈ జెర్మ్స్ ఇంటి లోపల, వెలుపల మన చర్మానికి సోకుతాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్కిన్ ఇన్ఫెక్షన్(skin infection) వస్తే చర్మంపై దద్దుర్లు, దురదలు, ఎగ్జిమా, నాన్ ఇన్ఫెక్షన్ డెర్మటోసిస్ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వర్షాకాలంలో చర్మ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.

చర్మ సమస్య రాకుండా ఉండాలంటే ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే వర్షాకాలంలో తడి బట్టలు ఏ కారణం చేతనైనా ధరించకూడదు. పొడి బట్టలు ధరించండి. కారంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడే పండ్లను తినడం మంచిది. మీ శరీరం, పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడం, మీ బట్టలు, లోదుస్తులను వీలైనంత శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. సరిగ్గా ఎండబెట్టిన కాటన్ క్లాత్‌లను కూడా ఉపయోగించండి. బయటకు వెళ్లేటప్పుడు వర్షం పడినా, పడకపోయినా రెయిన్ కోట్ లేదా గొడుగును మీతో ఉంచుకోండి.

హైదరాబాద్ లాంటి నగరంలో ఎప్పుడు వర్షాలు పడతాయో అంచనా వేయడం కష్టమే. అలాంటి సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే, ఎటువంటి చర్మ ఇన్ఫెక్షన్ మిమ్మల్ని బాధించదు. వర్షాకాలంలో చర్మవ్యాధులు రాకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో చక్కెర, సంతృప్త కొవ్వు తగ్గుతుంది. శరీర బరువు తగ్గుతుంది. దీనివల్ల మధుమేహం(diabetes) కూడా అదుపులో ఉంటుంది.

వర్షాకాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులే కాకుండా పిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. వాతావరణం మనసుకు ఆహ్లాదకరంగా ఉన్నా, శరీరానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి.

తదుపరి వ్యాసం