తెలుగు న్యూస్ / ఫోటో /
Hyderabad Rains : హైదరాబాద్ లో హైఅలర్ట్, ఐటీ ఉద్యోగులకు ఆగస్టు 1 వరకూ షిఫ్టుల వారీ లాగ్ అవుట్
- Hyderabad Rains : తెలంగాణలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ హై అలర్ట్ జారీచేసింది.
- Hyderabad Rains : తెలంగాణలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ హై అలర్ట్ జారీచేసింది.
(1 / 8)
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. సహాయం కోసం 9000113667 నెంబర్ ను సంప్రదించాలని తెలిపింది.
(2 / 8)
భారీ వర్షాలతో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కరించేందుకు ఆగస్టు 1 వరకు 3 విడతల్లో లాగ్ అవుట్ చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు.
(3 / 8)
ఐటీ ఉద్యోగుల లాగ్ అవుట్ షిఫ్టులను ఈ నెల 27 నుంచి వచ్చే నెల 1 వరకు కొనసాగించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్య లేకుండా 3 దశలుగా విధుల ముగింపు వేళలు పోలీసులు తెలిపారు.
(4 / 8)
ఐకియా నుంచి సైబర్ టవర్స్ దారిలోని సంస్థలు, రహేజా మైండ్‌స్పేస్‌లోని కంపెనీలు, టీసీఎస్, హెచ్‌ఎస్‌బీసీ, డెల్, ఫీనిక్స్, ఒరాకిల్, క్వాల్‌కామ్, టెక్ మహీంద్ర, పూర్వా సమ్మిట్‌లోని కంపెనీలకు మధ్యాహ్నం 3 గంటలకు లాగ్ అవుట్ చేయాలని పోలీసులు సూచించారు.
(5 / 8)
ఐకియా, బయోడైవర్సిటీ, రాయదుర్గం సమీప ప్రాంతాల్లోని నాలెడ్జ్ సిటీ, నాలెడ్జ్ పార్క్, టీహబ్, గెలాక్సీ, ఎల్‌టీఐ అండ్ ట్విట్జా, కమర్జోమ్, ఆర్.ఎం.జడ్ నెక్సిటీ, స్కైవ్యూ, దివ్యశ్రీ ఓరియన్, అసెండాస్, ఇతర కంపెనీలకు సాయంత్రం 4 గంటలకు లాగ్ అవుట్ నిర్ణయించారు.
(6 / 8)
మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, సెంటారస్, బ్రాడ్‌వే, విర్టుసా, బీఎస్‌ఆర్ ఐటీపార్క్, ఐసీఐసీఐ, వేవ్‌రాక్, అమెజాన్, హనీవెల్, హిటాచీ, సత్వా క్యాపిటల్, క్యాప్ జెమిని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, క్యూసిటీ, డీఎల్‌ఎఫ్, ఇతర ఐటీ పార్కుల్లోని కంపెనీలకు మధ్యాహ్నం 3-6 గంటల మధ్య లాగ్ అవుట్ చేయాలని సూచించారు.
(7 / 8)
రాగల రెండు రోజుల్లో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని, దీనికి తోడు ఉపరితల ఆవర్తం ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
(8 / 8)
దక్షిణ, మధ్య పశ్చిమ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీచేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నాగరత్న తెలిపారు.
ఇతర గ్యాలరీలు