Monsoon Skin Infections । వర్షాకాలంలో చర్మ సమస్యలు హెచ్చు.. మధుమేహం ఉంటే మరింత తీవ్రం!
Monsoon Skin Infections: వర్షాకాలం మధుమేహం ఉన్నవారిలో చర్మ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. మధుమేహులపై మాన్‌సూన్ సీజన్ ప్రభావం ఎలా ఉంటుందో ఆరోగ్య నిపుణులు వివరించారు.
Monsoon Skin Infections: వర్షాకాలంలో అనేక దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లతో పాటు చర్మవ్యాధులు రావడం సాధారణం. అయితే ఈ సీజన్ మధుమేహం ఉన్నవారికి మరిన్ని సమస్యలను సృష్టించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినపుడు అది అనేక సమస్యలతో పాటు చర్మ సమస్యలను కలిగిస్తుంది. చర్మం పొడిబారి దురద కలిగించడం, పదేపదే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి చర్మ సమస్యలకు దారితీయవచ్చు. వీరి శరీరంలో రక్త ప్రసరణ తగ్గటం వలన అది చర్మంలో కొల్లాజెన్‌ను దెబ్బతీస్తుంది, షుగర్ ఉన్నపుడు గాయాలు త్వరగా నయం కానట్లే, ఈ చర్మ సమస్యలు కూడా సులభంగా నయం కావు. బాక్టీరియా, ఫంగస్, ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువైన వేడి తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల కారణంగా, వర్షాకాలం మధుమేహం ఉన్నవారిలో చర్మ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. మధుమేహులపై మాన్‌సూన్ సీజన్ ప్రభావం ఎలా ఉంటుందో ఆరోగ్య నిపుణులు వివరించారు.
డి.వై పాటిల్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ లో మెడిసిన్ ఫిజిషియన్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ అక్షయ్ మాట్లాడుతూ "ఋతుపవనాలు మనం స్వాగతించినా, మన చర్మం అస్సలు స్వాగతం పలకకపోవచ్చు. తేమ స్థాయిలు పెరగడంతో, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, ఇంటర్‌ట్రిగో, రింగ్‌వార్మ్‌లు, చర్మంపై దద్దుర్లు, చికాకులు ఎక్కువవుతాయి. తామర, గజ్జి, సార్కోప్ట్స్ వంటి చర్మ సమస్యలు తీవ్రమైన దురదకు కారణమవుతాయి. అలాగే పాదాల చుట్టూ చర్మాన్ని ప్రభావితం చేసే అథ్లెట్స్ ఫుట్, గోళ్లు చెడిపోవడం మొదలైన సమస్యలు మధుమేహం ఉన్నవారికి ఎక్కువ ఉబ్బంది పెడతాయి" అని పేర్కొన్నారు. మధుమేహం ఉన్నవారు వర్షాకాలంలో తమ చర్మాన్ని ఎలా సంరక్షించుకోవచ్చో డాక్టర్ అక్షయ్ పలు సూచనలు చేశారు.
వర్షాకాలంలో మధుమేహులు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు:
- మంచి వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. పరిశుభ్రమైన బట్టలు ధరించండి, ముఖ్యంగా లోదుస్తులను శుభ్రంగా ఉంచుకోవాలి.
- కొన్ని చర్మ సమస్యలు అంటువ్యాధులు కాబట్టి తమ బట్టలు కానీ, వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవడం మానుకోవాలి.
- ఎక్కువ సేపు తడి దుస్తులలో ఉండకుండా జాగ్రత్తపడండి, మిమ్మల్ని మీరు పొడిగా ఉంచుకోండి
- వర్షం పడినా, పడకపోయినా రెయిన్‌కోట్ లేదా గొడుగును ఎల్లవేళలా మీతో ఉంచుకోండి.
- చర్మ వ్యాధుల సంభవనీయతను తగ్గించడంలో మీ ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వర్షాకాలంలో వేడిచేసే ఆహారాలు, కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. చక్కెర, సంతృప్త కొవ్వులను తినడం నివారించాలి. మామిడిపండ్లు, పుచ్చకాయ వంటి పండ్లు తినకూడదు. పెరుగు, బాదం, వెల్లుల్లి, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి వాటిని తగ్గించాలి.
టైప్ 2 మధుమేహం, దాని సమస్యలను నివారించడంలో సహాయపడటానికి, ఆరోగ్యకరమైన శరీర బరువును కలిగి ఉండాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల మితమైన వ్యాయామం చేయాలి, శారీరకంగా చురుకుగా ఉండాలి.
సంబంధిత కథనం