తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Neetలో ర్యాంక్ రాకపోయిన ఈ మెడికల్ కోర్సులు చెయొచ్చు.. జీతం కూడా లక్షల్లో..!

NEETలో ర్యాంక్ రాకపోయిన ఈ మెడికల్ కోర్సులు చెయొచ్చు.. జీతం కూడా లక్షల్లో..!

HT Telugu Desk HT Telugu

22 July 2022, 20:47 IST

google News
  • Medical Courses without NEET: నీట్ లేని మెడికల్ కోర్సులు: వైద్య రంగంలో కెరీర్‌ కోసం ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షను నిర్వహిస్తారు. నీట్ లేకుండా కూడా వైద్యరంగంలో కెరీర్ చేయవచ్చని మీకు తెలుసా. ఇక్కడ అలాంటి కొన్ని కోర్సుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

MEDICAL COURSES
MEDICAL COURSES

MEDICAL COURSES

Medical Courses without NEET: వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి 17 జూలై 2022న నీట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 18 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో NEET ఫలితాలను విడుదల చేయనుంది. NEET స్కోర్ ఆధారంగా, దేశంలోని టాప్ మెడికల్ కాలేజీలలో MBBS, BDS కోర్సులలో ప్రవేశాలు ఉంటాయి. అయితే వైద్య రంగంలో కెరీర్‌ ప్రారభించాలంటే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని అనుకుంటారు. కానీ కొన్ని వైద్య సంబంధిత కోర్సును అభ్యసించాలనుకునే వారికి NEET అవసరం లేదని మీకు తెలుసా. నీట్ పరీక్షలో అర్హత సాధించకపోయినా వైద్య రంగంలో మంచి కెరీర్‌ను ప్రారంభించవచ్చు. మరి ఆ కోర్సులెంటో ఇప్పుడు చూద్దాం..

ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా మ్యాథ్స్ (PCB/PCM) సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు.. NEET పరీక్ష లేకుండానే అనేక వైద్య కోర్సులలో కెరీర్‌ను మెుదలుపెట్టవచ్చు.

1. BSc నర్సింగ్: BSc నర్సింగ్ అనేది నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సు, దీని తర్వాత అభ్యర్థులు స్టాఫ్ నర్స్, రిజిస్టర్డ్ నర్స్ (RN), నర్స్ టీచర్, మెడికల్ కోడర్ వంటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్‌కు NEET తప్పనిసరి కానప్పటికీ, ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో, B.Sc నర్సింగ్ ప్రవేశాలు NEET స్కోర్‌ల ద్వారా జరుగుతున్నాయి. ఈ కోర్సు తర్వాత, అభ్యర్థులు సంవత్సరానికి రూ. 3 లక్షల నుండి రూ. 8 లక్షల వరకు జీతం పొందవచ్చు.

2. B.Sc. న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ / హ్యూమన్ న్యూట్రిషన్ / ఫుడ్ టెక్నాలజీ : ఈ కోర్సులు మూడు నుండి నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఉంటాయి. దీన్ని పూర్తి చేసిన తర్వాత న్యూట్రినిస్ట్, ఫుడ్ టెక్నాలజిస్ట్, రీసెర్చ్ పోస్టుల్లో ఉద్యోగాలు పొందవచ్చు. మీరు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ప్యాకేజీని పొందవచ్చు.

3. B.Sc. బయోటెక్నాలజీ: 12th తర్వాత, మీరు NEET అర్హత లేకుండా వైద్య రంగంలో కెరీర్ చేయాలనుకుంటే, B.Sc బయోటెక్నాలజీ మంచి ఎంపిక. ఈ కోర్సు చేయడానికి, మీరు వార్షిక రుసుము కింద రూ. 35,000 నుండి 100,000 వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు మూడు, నాలుగేళ్లలో పూర్తవుతుంది. ఈ కోర్సు చేసిన తర్వాత, బయోటెక్నాలజిస్ట్ పోస్ట్‌లో ఉద్యోగం పొందవచ్చు, రూ. 5 లక్షల నుండి రూ. 9 లక్షల వరకు వార్షిక ప్యాకేజీని అందుకోవచ్చు.

4. BSc అగ్రికల్చర్ సైన్స్: BSc అగ్రికల్చర్ అనేది 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సు. ఈ కోర్సులో ప్రవేశానికి అనేక కళాశాలలు ప్రవేశ పరీక్షలను కూడా నిర్వహిస్తాయి. మీరు ఏదైనా ప్రభుత్వ కళాశాల, విశ్వవిద్యాలయం నుండి B.Sc అగ్రికల్చర్ చేయాలనుకుంటే, వార్షిక రుసుము కింద 7 వేల నుండి 15 వేల రూపాయల వరకు డిపాజిట్ చేయాలి. ఫీజు సంవత్సరానికి 20 వేల రూపాయల నుండి 80 వేల రూపాయల వరకు ఉంటుంది. ఈ కోర్సు తర్వాత, మీరు అగ్రోనమిస్ట్, అగ్రికల్చర్ సైంటిస్ట్, అగ్రిబిజినెస్ వంటి స్థానాల్లో పని చేయవచ్చు. ఈ కోర్సు తర్వాత ప్రతి సంవత్సరం రూ.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు సంపాదించవచ్చు.

తదుపరి వ్యాసం