Doctor Strange |2022 హయ్యెస్ట్ గ్రాసింగ్ మార్వెల్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది
03 June 2022, 6:13 IST
మార్వెల్ లేటెస్ట్ హిట్ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ వరల్డ్‌వైడ్‌గా 880 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఏ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా రిలీజ్ కానుందంటే..
డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్
2022లో విడుదలైన మార్వెల్ చిత్రం డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ వరల్డ్‌వైడ్‌గా 880 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో తొలిస్థానంలో నిలిచింది. ఇండియాలోనూ డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం.
డాక్టర్ స్ట్రేంజ్‌గా బెనెడిక్ట్ కంబర్‌బ్యాచ్ యాక్టింగ్,అతడిపై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్ సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా ఈ నెలలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నది. జూన్ 22 నుంచి డాక్టర్ స్ట్రేంజ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు డిస్నీ సంస్థ ప్రకటించింది.
థియేటర్లలో రిలీజ్ అయిన 47 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో విడుదలకాబోతున్నది. థియేటర్లలో తొలివారంలోనే ఈ సినిమా 185 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి చరిత్రను సృష్టించింది. రెండు వందల మిలియిన్ డాలర్లతో రూపొందిన ఈ సూపర్ హీరో చిత్రం నాలుగింతల వసూళ్లను సాధించడం గమనార్హం. ఈ చిత్రానికి సామ్ రైమీ దర్శకత్వం వహించారు.
టాపిక్