తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango Kulfi | మామిడిపండులో కుల్ఫీ.. తింటే మైమరిచిపోవడం గ్యారెంటీ!

Mango Kulfi | మామిడిపండులో కుల్ఫీ.. తింటే మైమరిచిపోవడం గ్యారెంటీ!

HT Telugu Desk HT Telugu

31 May 2022, 17:56 IST

    • చాలా మందికి మామిడి పండు అంటే ఇష్టం, అలాగే కుల్ఫీ అంటే కూడా ఇష్టం. మరి ఈ రెండింటిని కలిపి మామిడి పండు కుల్ఫీ చేస్తే ఎంతమందికి ఇష్టం? టేస్ట్ మామూలుగా ఉండదు మరి. రెసిపీ ఇక్కడ ఉంది. తినాలనుకుంటే మీరు ట్రై చేసుకోండి.
Mango Kulfi
Mango Kulfi (Chef Kunal Kapur)

Mango Kulfi

మీ వద్ద మామిడి పండు ఉంటే మీరు ఏం చేస్తారు? తినేస్తారు నిజమే.. కానీ ఎలా తింటారనేది ఇక్కడ పాయింట్. మామిడి పండును నేరుగా పండులాగానే తినొచ్చు, జ్యూస్ చేసుకొని తాగొచ్చు, పానకం చేసుకొని తినొచ్చు ఇంకా వెరైటీగా కావాలనుకుంటే మ్యాంగో స్మూతీలు, మ్యాంగో పాప్సికల్స్,  మ్యాంగో ఛాయ్ ఇలా రకరకాలుగా ప్రయత్నించవచ్చు. క్రియేటివిటీ ఉంటే మామిడి పండుతో కుల్ఫీ కూడా తయారు చేసుకొని తినొచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

మామిడిపండు కుల్ఫీ చూస్తే నోరూతుంది, నోట్లో వేసుకుంటే ఆ రుచి మజాగా ఉంటుంది. మధ్యలో కుల్ఫీ, దాని అంచుల్లో మామిడి ఈ రెండు రుచుల ఫ్యూజన్ మిమ్మల్ని మీరే మైమరచిపోయేలా చేస్తుంది. అయితే మామిడి పండు కుల్ఫీ చేసుకోవడం ఏమంత కష్టం కాదు. చెఫ్ కునాల్ కపూర్ ఎంతో సులభంగా తయారుచేసుకోగలిగే రెసిపీని పంచుకున్నారు. మరి మామిడిపండు కుల్ఫీ తినాలని మీకూ ఆసక్తి ఉంటే కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలా తయారు చేసుకోవాలో ఈ కింద ఇచ్చాం చూడండి.

మామిడిపండు కుల్ఫీకి కావాల్సినవి

  • పాలు (ఫుల్ క్రీమ్) - 1.25 లీటర్లు లేదా 5 కప్పులు
  • మామిడి పండ్లు - 6-8
  • చక్కెర - 70 గ్రాములు లేదా ముప్పావు కప్పు
  • పిస్తా పలుకులు - గుప్పెడు

తయారీ విధానం

  1. ముందుగా లీటరు పావు పాలను బాగా వేడి చేయండి మూడవ వంతుకు ఇనికిపోయేలా చూడండి. ఇందులో చక్కెర వేసి బాగా కలపండి. ఇప్పుడు చిక్కటి క్రీమ్ లాగా తయారైన పాలను చల్లబరిచి అందులో పిస్తాపప్పు తురుమును వేసుకోండి. దీనిని పక్కనపెట్టండి.
  2. ఇప్పుడు తాజా మామిడిపండ్లను బాగా శుభ్రం చేసి, పైన తల భాగంలో మాత్రమే కత్తితో కట్ చేయండి. అనంతరం ఆ మామిడి పండులో ఉండే టెంకను పైన చేసిన రంధ్రం గుండా జాగ్రత్తగా తీసివేయండి.
  3. టెంక తీసి వేయడంతో మామిడి పండులో ఖాళీ స్థలం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ ఖాళీ స్థలాన్ని పాలను మరిగించి చేసిన కుల్ఫీ మిశ్రమంతో నింపండి.
  4. అనంతరం మామిడిపండు పైభాగాన్ని ఇదివరకు కట్ చేసిన ముక్కతో మూతలాగా పెట్టి గడ్డ కట్టేంత వరకు ఫ్రిజ్ లో ఉంచండి.
  5. పూర్తిగా గడ్డకట్టిన మామిడిపండ్లను బయటకు తీసి అడ్డంగా పెద్ద ముక్కలుగా కత్తితో కట్ చేసుకోవాలి.

మీకోసం రుచికరమైన మ్యాంగో కుల్ఫీ రెడీ అయినట్లే. ఆవురావురుమంటూ ఆరగించండి.

టాపిక్

తదుపరి వ్యాసం