Mango Maggy Noodles | మతులు పోగొట్టే రెసిపీ.. మ్యాంగో మ్యాగీ నూడుల్స్ తింటారా?
17 May 2022, 8:52 IST
- నూడుల్స్ ఎలా చేయాలో మీకు తెలుసు కానీ మ్యాంగో నూడుల్స్ ఎలా చేయాలో తెలుసా? మామిడి పండుతో నూడుల్స్ కూడా చేయొచ్చా అని ఆశ్చర్యపోతున్నారా? ఇలా చేయొచ్చో ఇక్కడ తెలుసుకోండి..
Noodles
సాధారణంగా మనకు రెండు నిమిషాల్లోనే మ్యాగీ నూడుల్స్ కలిపేయవచ్చు. నీళ్లు వేడిచేసి, అందులో మ్యాగీ నూడుల్స్ వేసి, మసాలా వేసి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే మ్యాగీ నూడుల్స్ రెడీ. మరికొంత రుచిగా చేసుకోవాలంటే నూనెలో వెజిటెబుల్స్ వేయించి ఉప్పు,కారం వేసి ఆ తర్వాత నీళ్లు వేసి మరిగించి, అందులో నూడుల్స్ వేసి ఉడికిస్తే వెజిటేబుల్ నూడుల్స్ రెడీ అవుతుంది.
ప్రస్తుతం ఒకవైపు వేసవి మనతో వార్మప్ ఎక్సర్ సైజులు చేయిస్తుంటే, మరోవైపు కొత్తకొత్త రుచులను పరిచయం చేస్తూ సర్ ప్రైజులు చేస్తున్నారు మరికొంత మంది. వారి సృజనాత్మకతను ఆహార పదార్థాలపై ఉపయోగించి కొత్తకొత్త రుచులను సృష్టిస్తున్నారు. ఆహార ప్రియులను ఆహా అనిపిస్తున్నారు. కొన్నిసార్లు అమ్మ బాబోయ్.. అయ్య బాబోయ్ అనేలా కూడా చేస్తున్నారు.
ఇక్కడ ఒక వీధి విక్రేత మ్యాగీ నూడుల్స్ చేసే విధానం చేసి నెటిజన్ ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. స్ట్రీట్ వెండర్ చెఫ్ ప్రకారం తయారీ విధానం. ముందుగా తవాలో నూనె వేడి చేసి ఆపై మసాలా వేయాలి, ఆ తర్వాత కొన్ని నీళ్లుపోయాలి, ఆ తర్వాత మ్యాగీ నూడుల్ వేయాలి, ఆపై మ్యాంగో జ్యూస్ పోయాలి. మ్యాంగో మ్యాగీ నూడుల్స్ రెడీ అయినట్లే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని
టొమాటో సాస్ కాకుండా మ్యాంగో జ్యూస్ పోసుకోవాలి, మామిడి పండు ముక్కను గార్నిషింగ్ చేసుకోవాలి.
ఇలా.. వీడియోలో చూపినట్లుగా
ధైర్యం ఉంటే మీరూ ఇలా మ్యాంగో నూడుల్స్ చేసుకొని తినండి, మనసుంటే నలుగురికి ఈ రెసిపీని చూపించండి. అసలు ఇందులో అర్థమే లేకుంటే అనుభవించండి.. కానీ ఆరోగ్యంతో ఆటలాడకండి.