తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango Tea | మామిడి పండు ఛాయ్ తాగండి.. వేసవి సాయంత్రాలను ఆస్వాదించండి!

Mango Tea | మామిడి పండు ఛాయ్ తాగండి.. వేసవి సాయంత్రాలను ఆస్వాదించండి!

HT Telugu Desk HT Telugu

12 May 2022, 17:56 IST

    • మామిడి పండ్లతో జ్యూసులు, మిల్క్ షేకులు, ఐస్ క్రీములే కాదు ఛాయ్ కూడా చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ రెసిపీ ఇచ్చాం, అది చూసి మీరూ నేర్చుకోండి, చేసుకోండి, తాగండి...
Mango Tea
Mango Tea (Unsplash )

Mango Tea

మీరు ఇప్పటివరకు మామిడి పండు జ్యూస్ తాగి ఉంటారు, మామిడి పండు ఐస్ క్రీమ్ తిని ఉంటారు. కానీ ఎప్పుడైనా మామిడి పండు ఛాయ్ తాగారా? ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ నడుస్తుంది. మార్కెట్లో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తున్నాయి. మరి అలాంటపుడు ఈ వేసవి సాయంకాలానా ఎప్పుడూ తాగే వేడి వేడి ఛాయ్‌కి బదులు చల్లని మ్యాంగో ఛాయ్ తాగాలనే ప్రయత్నం ఎందుకు చేయకూడదు. మ్యాంగో ఛాయ్ ఈ మండే వేసవి సీజన్‌లో సరికొత్త రిఫ్రెషర్‌గా పనిచేస్తుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. మరి ఎలా తయారు చేసుకోవాలో రెసిపీ ఇక్కడ ఇస్తున్నాం. ఒక కప్ తాగి చూడండి.

కావలసిన పదార్థాలు

  • రెండు మామిడి పండ్లు
  • రెండు టీ బ్యాగులు
  • 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
  • 4 కప్పుల నీరు
  • చక్కెర అవసరమైనంత

ఎలా తయారు చేయాలి?

  1. మామిడి పండ్లను బాగా కడిగి, తొక్కతీసి ముక్కలుగా కోసుకొని ఒక మిక్సర్- బ్లెండర్‌లో వేసి ప్యూరీలాగా చేసుకోవాలి. అనంతరం ఈ మ్యాంగో ప్యూరీని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి
  2. నీటిని వేడిచేసి ఆ నీటిలో టీ బ్యాగ్‌లను ముంచి పక్కన పెట్టుకోవాలి. దీనిని కూడా ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరుచుకోవాలి.
  3. పైన రెండు పదార్థాలు కొద్దిగా చల్లబడిన తర్వాత బయటకు తీయండి. టీ బ్యాగ్స్ తీసేవేయండి.
  4. ఒక జార్‌లో మ్యాంగో ప్యూరీ, తేనీరుతో పాటు నిమ్మరసం, చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. మరింత చల్లదనం కోసం ఐస్ ముక్కలు కూడా వేసుకోవచ్చు.
  5. ఇప్పుడు మ్యాగో టీ రెడీ అయినట్లే సర్ సర్వింగ్ గ్లాస్‌లోకి ఈ మ్యాంగో టీ పోసుకోండి. గార్నిషింగ్ కోసం పైన పుదీనా ఆకులను చల్లుకోండి.

ఈ చల్లటి వైరెటీ మ్యాంగో టీని వేడివేడి సమోసా, చికెన్ రోల్స్ ఇతర స్నాక్స్ తో కలిపి తీసుకుంటే అద్భుతంగా అనిపిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం