DIY Perfumes| సహజమైన సువాసనను వెదజల్లండి, మీ స్వంతంగా సెంట్ ఇలా తయారు చేసుకోండి!
13 September 2022, 21:01 IST
- Homemade DIY Perfumes : మార్కెట్లో లభించే పెర్ఫ్యూమ్‌లతో సంతృప్తి చెందలేకపోతున్నారా? ధర ఎక్కువ ఉన్నా, దాని పరిమళం తక్కువగా ఉందా? అయితే తగ్గేదేలే, మీకు నచ్చినట్లుగా మీకు మీరే సెంట్ సృష్టించుకోండి. ఇక్కడ టిప్స్ ఉన్నాయి.
Homemade DIY Perfumes
తమ శరీరం నుంచి ఆహ్లాదకరమైన సువాసన రావాలని కోరుకోని వారెవరు? మీ శరీరం మంచి వాసన వెదజల్లుతుంటే చుట్టుపక్కల వారు సైతం మీకు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంది. అదే మీ శరీరం చెమట కంపుతో దుర్వాసన వెదజల్లితే మాత్రం ఎవరైనా సరే కచ్చితంగా మీకు దూరంగా జరుగుతారు. చాలా మంది తమ శరీర దుర్వాసనను తొలగించి తమని తాము రోజంతా తాజాగా ఉంచుకునేందుకు పెర్ఫ్యూమ్‌లను ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు.
ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల పెర్ఫ్యూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్నింటి సువాసన అందరికీ నచ్చదు. పెర్ఫ్యూమ్‌ల ఘాటైన వాసనకు కొంత మందికి అలెర్జీ కూడా ఉంటుంది. అలాగే సున్నితమైన చర్మం ఉన్నవారు కూడా కొన్ని రకాల పెర్ఫ్యూమ్‌లు చల్లుకోవడం ద్వారా చర్మంపై దద్దుర్లు, పొక్కులు వంటి అలెర్జీ ప్రతిస్పందనలను అనుభవిస్తారు. అటువంటి పరిస్థితిలో, వారికి పెర్ఫ్యూమ్ ఎలా ఉపయోగించాలో అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే.. మార్కెట్లో లభించే పెర్ఫ్యూమ్‌లు కూడా చాలా ఖరీదైనవిగా ఉంటాయి. మరి ఈ చిక్కుముడులన్నింటికీ పరిష్కారం లేదా అంటే? ఎందుకు ఉండదు, కచ్చితంగా ఉంటుంది.
మీరు ఎప్పుడైనా మీ స్వంతంగా మీకు నచ్చిన సుగంధాలను తయారు చేయాలని ఆలోచించారా? ఒక వేళ అలాంటి ఆలోచనలు వచ్చినా, రాకపోయినా ఈసారి ప్రయత్నించి చూడండి. చాలా సులభంగా మీ ఇంట్లోనే కొన్ని ముఖ్యమైన నూనెలను ఉపయోగించి DIY పెర్ఫ్యూమ్‌లను తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
DIY Rose Perfume
1 కప్పు గులాబీ రేకులను 1/2 టీస్పూన్ తాజా కొబ్బరి నూనెతో కలిపి, ఆపై ఈ మిశ్రమాన్ని 24 గంటల పాటు పక్కన పెట్టండి. 24 గంటల వ్యవధి తర్వాత, ఒక చెంచాతో గులాబీ రేకులను చూర్ణం చేసి, వాటిని 2 కప్పుల స్వేదనజలం, 3-4 చుక్కల డిఫెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అలాగే 3-4 చుక్కల మరేదైనా ఎసెన్షియల్ నూనెతో కలపండి. ఒక వారం తర్వాత ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేస్తే రోజ్ పెర్ఫ్యూమ్ సిద్ధమైనట్లే. స్ప్రే బాటిల్‌లో పోసుకుని వాడుకోవచ్చు.
DIY Jasmine Perfume
Homemade జాస్మిన్ పెర్ఫ్యూమ్ తయారు చేయడానికి 2 టేబుల్ స్పూన్ల వోడ్కాలో 1 టీస్పూన్ జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అలాగే 5 నుండి 6 చుక్కల వెనీలా ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. దీనిని గది ఉష్ణోగ్రత వద్ద 48 గంటలు ఉంచండి. ఇప్పుడు, 1 టీస్పూన్ స్వేదనజలం (డిస్టిల్డ్ వాటర్) కలుపుతూ ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఏదైనా చల్లని, చీకటి ప్రదేశంలో ఒక నెల పాటు ఉంచండి. ఈ మిశ్రమాన్ని వడపోసి నెల తర్వాత స్ప్రే బాటిల్‌లో వేసి పెర్ఫ్యూమ్‌గా వాడుకోవచ్చు .
DIY Fruit Perfume
1 టీస్పూన్ లిక్విడ్ క్యారియర్ గ్రేప్ సీడ్ ఆయిల్, 2-3 చుక్కల మాండరిన్ ఎసెన్షియల్ ఆయిల్, 3-4 చుక్కల స్వీట్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్, 2 చుక్కల గంధపు ఎసెన్షియల్ ఆయిల్ ఇంకా 3 చుక్కల మిక్స్‌డ్ ఫ్రూట్ అయిల్ ను కలపడం ద్వారా మధురమైన ఫ్రూట్ పెర్ఫ్యూమ్ లను తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమంను రోల్-ఆన్ బాటిల్ లో నింపి ఒక గంట రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. ఆపై దీనిని రోల్-ఆన్ పెర్ఫ్యూమ్ లాగా వాడుకోవచ్చు.
ఇప్పుడు మీకు పెర్ఫ్యూమ్‌లను ఎలా తయారు చేయాలో తెలిసిందిగా.. ఇక రెచ్చిపోండి!
టాపిక్