తెలుగు న్యూస్  /  Lifestyle  /  In Search Of The Perfect Perfume? Check Fragrances That Are Ideal To Your Zodiac Signs

మంచి పర్ఫ్యూమ్ కావాలా? రాశి ఆధారంగా ఎవరు ఎలాంటి పరిమళాల్ని ఇష్టపడతారో చెపొచ్చు!

Manda Vikas HT Telugu

28 February 2022, 17:51 IST

    • రాశులు వాటి స్వాభావిక స్వభావాల ప్రకారం కొన్ని సుగంధాలకు ఆకర్షితమవుతాయట. మనకు మార్కెట్లో వందల రకాల పర్ఫ్యూమ్ లు అందుబాటులో ఉంటాయి, అన్నీ సువాసనభరితంగానే ఉంటాయి అందులో ఏది తీసుకోవాలో చిన్న కన్ప్యూజన్ ఉంటుంది. జన్మరాశి ప్రకారం ప్రయత్నిస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు.
Perfume
Perfume (Shutterstock)

Perfume

జన్మరాశుల ఆధారంగా ఈరోజు ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది లేదా వారికి సరిపోయే భాగస్వామి ఎవరు లాంటి విషయాలు అంచనా వేస్తారు. అదేవిధంగా ఏ రాశి వారు ఎలాంటి పరిమళాలను ఇష్టపడతారో కూడా తెలుసుకోవడం సులభం అని కొంత మంది టారో అనలిస్టులు చెబుతున్నారు.

అదెలా అంటే, రాశులు వాటి స్వాభావిక స్వభావాల ప్రకారం కొన్ని సుగంధాలకు ఆకర్షితమవుతాయట. మనకు మార్కెట్లో వందల రకాల పెర్ఫ్యూమ్ లు అందుబాటులో ఉంటాయి, అన్నీ సువాసనభరితంగానే ఉంటాయి అందులో ఏది తీసుకోవాలో చిన్న కన్ప్యూజన్ ఉంటుంది. జన్మరాశి ప్రకారం ప్రయత్నిస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు.

రాశుల స్వభావం..

మీరు గమనించినట్లయితే సెంట్ బాటిళ్లపై వుడీ, ఆక్వా, ఫ్లోరల్ అని లేబుల్ చేసి ఉంటాయి. వీటికి, జన్మరాశులకు మధ్య ఒక కనెక్షన్ ఉంటుందట. సాధారణంగా కర్కాటకం, మీనం, వృశ్చికం అనేవి నీటికి సంబంధించిన రాశులు. అంటే 'ఆక్వా' కేటగిరీలోకి వస్తాయి. అలాగే వృషభం, కన్య, మకర రాశులు భూమికి సంబంధించినవి. కాబట్టి ఈ రాశులకు చెందిన వారు ప్రకృతి ఆధారిత పచ్చని 'వుడీ' సుగంధాలను ఇష్టపడతారు. 

ఇలాగే సింహం, మేషం, ధనుస్సు రాశులు దావానంలా వ్యాపించే నిప్పు లాంటి 'వైల్డ్' రాశులు. కాబట్టి వీరికి ఆడంబరమైన, ఉల్లాసమైన, వెచ్చని పరిమళాలను ఇష్టపడతారు. ఇక చివరగా, తులారాశి, కుంభరాశి, మిథున రాశులు గాలికి చెందిన రాశులు కాబట్టి వీరికి గాలివీచినపుడు పుష్పాల నుండి వచ్చే తేలికపాటి సువాసనలు ఇష్టముంటుందట. ఆసక్తికరంగా ఉంది కదూ?!

కాబట్టి పైన చెప్పిన విశ్లేషణ ప్రకారం కన్యారాశిలోని కలువలాంటి అమ్మాయిని ఆకర్షించాలంటే మంచి సుగంధంతో కూడిన పరిమళం మీ ఒంటి నుంచి రావాలి. మీరెవరికైనా బహుమతి ఇవ్వాల్సి వచ్చినపుడు కూడా వారి రాశి ఆధారంగా మంచి పెర్ఫ్యూమ్ కొనిచ్చి బెస్ట్ ఇంప్రెషన్ పొందవచ్చు.

రాశుల వారీగా ఇష్టపడే పర్ఫ్యూమ్స్:

మేషరాశి

ఘాడమైన ముస్కీ , స్పైసీ సువాసనలు ఉదాహారణకు యాలకులు, లవంగాలు, పొగాకు, దేవదారు, మిరియాలతో కూడిన ఫ్లేవర్స్ వీరికి సరిపోతాయి.

వృషభం

విలాసవంతమైన మట్టి సువాసనలు (తెల్ల కస్తూరి, ఓక్ నాచు, గంధపు చెక్క) అలాగే మృదువైన పుష్పాలు (లావెండర్, లిల్లీస్, నారింజ ఫ్లేవర్స్) వీరికి బాగా సరిపోతాయి.

మిథునరాశి

కవలలు సరదాగా, సరసంగా ఉంటారు, వెంటనే కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి సముద్రతీరం నుంచి వీచే సిట్రస్ గాలులు, లెమనీ ఫ్లేవర్స్ ఇష్టం. వీరికి ఎన్నో రకాలు ఇష్టం అందులో విభిన్నమైన వేరియంట్‌లను ఇష్టపడతారు.

కర్కాటకం

వీరు ఎమోషనల్, తమకు నచ్చిన వారిపై ప్రేమ కలిగి ఉంటారు. ఓదార్పును కోరుకుంటారు. కాబట్టి ఇంటిని గుర్తుకు తెచ్చే సువాసనలు, లేదా ఫ్రూట్ ఫ్లేవర్స్ అలాగే వెనిలా, పింక్ పెప్పర్, వైన్, రెడ్ లీచీ, దాల్చినచెక్క తదితర పరిమళాలు వీరికి ప్రశాంతతను కలిగిస్తాయి.

సింహ రాశి

వీరు సహజంగానే ఆకర్షణీయంగా, బోల్డ్‌గా ఉంటారు. తమ గుర్తింపును కోరుకుంటారు కాబట్టి వీరికి పర్ఫ్యూమ్‌తో పాటు ఆడంబరమైన క్లాస్సీ బాటిల్ ప్యాకేజింగ్ ఇష్టం. వైల్డ్ ఫ్లేవర్స్ అనిపించే వుడీ, క్రిస్టల్ నాచు, ఓరియంటల్ ఫ్లోరల్ పరిమళాలు సరిపోతాయి.

కన్యా రాశి

వీరు సున్నితమైన, శుభ్రమైన సువాసనలకు ఆకర్షితులవుతారు. తాజాదనం కోరుకుంటారు కాబట్టి ఐస్ లిల్లీస్, య్లాంగ్ య్లాంగ్ సువాసనలు వీరిని కట్టిపడేస్తాయి.

తులా రాశి

క్రీమీ హాజెల్ నట్, వైల్డ్ రోజ్, గ్రేప్స్, వెనీలా లాంటి సున్నితమైన , శృంగార సమతుల్యమైన పరిమళాలు కోరుకుంటారు. గాఢమైన పరిమళాలు వీరు ఏమాత్రం ఇష్టపడరు.

వృశ్చిక రాశి

ఉద్వేగభరితంగా ఉన్నప్పటికీ, వృశ్చిక రాశివారు చాలా తెలివైనవారు, పనిలో ఉత్పాదకత వీరికి సంతోషాన్ని కలిగిస్తుంది. వృశ్చికరాశికి వారి అభిరుచి, సామర్థ్యానికి సరిపోయే పరిమళ ద్రవ్యాలు అవసరం. కాబట్టి చాలాసేపు నిలిచి ఉండే పరిమళాల్ని కోరుకుంటారు. తాజా సముద్రపు గాలులు, ఔద్ సువాసనలకు ఆకర్షితులవుతారు.

ధనుస్సు రాశి

సాహసోపేతమైన ఒక ఆర్చర్ ఆహ్లాదకరమైన, బలమైన సువాసనలను ఆస్వాదిస్తాడు. ప్యాషన్ ఫ్రూట్, వైల్డ్ బెర్రీలు, ఆరెంజ్- కుంకుమ పువ్వులు, స్వీట్ ఫ్లేవర్లను ఇష్టపడతారు.

మకరరాశి

మకరరాశి వారు బ్రాండ్‌లను ఇష్టపడతారు. ఏదైనా మంచి బ్రాండ్‌లో వచ్చే సాంప్రదాయ సువాసనలు, ప్లేఫుల్ స్పోర్టీ సువాసనలను కోరుకుంటారు.

కుంభ రాశి

కుంభ రాశి వారు పరిష్కార ప్రదాతలు, గొప్ప సంధానకర్తలు, నాయకత్వ పాత్ర పోషిస్తారు. త్వరగా వీరి నిజమైన వ్యక్తిత్వాన్ని బయటపడనివ్వరు. వీరికి ఘాడమైన గంధపు సువాసనలు, మిస్టీరియస్, ఆండ్రోజినస్, యునిసెక్స్ పర్ఫ్యూమ్‌లు సరిపోతాయి.

మీనరాశి

వీరు భావోద్వేగపూరితులు, సానుభూతి పరులు, ఫాంటసీలో జీవిస్తారు. ఆక్వా సంబంధిత పర్ఫ్యూమ్ వేరియంట్స్ వీరికి ఇష్టముంటుంది.