తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pelala Chikki: ఈ కొలతలతో పేలాల చిక్కీ చేయండి, అంటుకోకుండా క్రిస్పీగా వస్తాయి

Pelala Chikki: ఈ కొలతలతో పేలాల చిక్కీ చేయండి, అంటుకోకుండా క్రిస్పీగా వస్తాయి

13 October 2024, 15:30 IST

google News
  • Pelala Chikki: పేలాలతో సింపుల్‌గా తయారయ్యే స్వీట్ పేలాల చిక్కి. దీని తయారీకి చాలా తక్కువ పదార్థాలు అవసరం. పక్కా కొలతలతో చేస్తే ఒకదాంతో ఒకటి అంటుకోకుండా ఉంటాయి. బెస్ట్ స్నాక్ రెడీ అవుతుంది. 

పేలాల చిక్కి
పేలాల చిక్కి

పేలాల చిక్కి

పేలాలతో చిక్కీ చేయడం చాలా మందికి రాదు. కొలతలు సరిగ్గా తెల్సుకున్నారంటే చాలా సులువుగా అంటుకోకుండా వీటిని చేసేయొచ్చు. సాయంత్రం పూట పిల్లలకు ఇది హెల్తీ స్నాక్ అవుతుంది. దీనికోసం బెల్లం వాడతాం కాబట్టి మరింత రుచిగా ఉంటుంది. కేవలం నాలుగు పదార్థాలు, పావుగంట సమయం ఉంటే చాలు పేలాల చిక్కీ రెడీ అవుతుంది. 

పేలాల చిక్కి తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు బెల్లం

పావు కప్పు నీళ్లు

2 కప్పుల పేలాలు

2 చెంచాల నెయ్యి

పేలాల చిక్కి తయారీ విధానం:

  1. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో బెల్లం వేసుకోండి. కప్పు బెల్లానికి నీళ్లు పావు కప్పు పోసుకోవాలి.
  2. స్టవ్ మీడియం మంట మీద పెట్టుకుని బెల్లం పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం చిక్కబడేదాకా వేడి చేసుకోవాలి. ఒక 5 నిమిషాల్లో బెల్లం చిక్కగా అయిపోతుంది.
  3. ఇప్పుడు ఇందులో పేలాలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
  4. కాస్త లోతుగా ఉన్న పల్లెం తీసుకుని దానికి నెయ్యి రాసుకోవాలి. అందులో పేలాల ముద్ద కూడా వేసుకుని సమంగా పర్చుకోవాలి.
  5. ఒక అరగంట సేపు అలాగే వదిలేస్తే కాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు చాకు సాయంతో ముక్కలుగా కట్ చేసుకుంటే పేలాల చిక్కి రెడీ అవుతుంది.

 

తదుపరి వ్యాసం