తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Puree Dosa: ఆలూ గుజ్జు చేసి ఇలా క్రిస్పీ దోశలు వేయొచ్చు, ఇన్స్టంట్ బ్రేక్‌ఫాస్ట్

Potato puree dosa: ఆలూ గుజ్జు చేసి ఇలా క్రిస్పీ దోశలు వేయొచ్చు, ఇన్స్టంట్ బ్రేక్‌ఫాస్ట్

02 October 2024, 6:30 IST

google News
  • Potato puree dosa: ఉడికించిన బంగాళదుంపలతో దోశ పిండి తయారు చేసి ఆలూ దోశ చేసుకోవచ్చు. రెగ్యులర్ దోశలకు బదులుగా ఇన్స్టంట్ అల్పాహారం ట్రై చేయాలనుకుంటే ఇది మంచి ఆప్షన్.

ఆలూ దోశ
ఆలూ దోశ

ఆలూ దోశ

ఆలూ దోశ అంటే ఇది దోశ మీద ఆలూ కర్రీ పెట్టే దోశ కాదు. ఆలూతోనే దోశలు వేయడం. ఆలూ రుచి నచ్చితే మీరిది మరింత ఇష్టంగా తింటారు. పిండి పులియబెట్టకుండా ఇన్స్టంట్ గా వేసుకునే దోశ ఇది.

ఆలూ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు:

3 ఆలూ, ఉడికించినవి

సగం కప్పు రవ్వ

కప్పున్నర బియ్యం పిండి

అరచెంచా ఉప్పు

2 ఉల్లిపాయలు, సన్నటి ముక్కల తరుగు

గుప్పెడు కొత్తిమీర సన్నటి తరుగు

కరివేపాకు రెమ్మ, తరుగు

అరటీస్పూన్ జీలకర్ర

నూనె

ఆలూ దోశ తయారీ విధానం:

  1. ముందుగా మిక్సీ జార్ లో ఉడికించిన బంగాళదుంపల్ని కాస్త ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అందులోనే పావు కప్పు నీళ్లు పోసుకోండి. లేదంటే మిక్సీ పట్టడం కష్టం అవుతుంది.
  2. మరోసారి మరో రెండు కప్పుల నీల్లు పోసుకుని మిక్సీ పట్టండి. మెత్తటి చిక్కటి పిండి లాగా రెడీ అవుతుంది.
  3. దీన్ని ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోవాలి. అందులోనే బియ్యంపిండి, రవ్వ కూడా వేసుకోండి. ఉప్పు కూడా వేసి రుచి సరిచూసుకోండి.
  4. పిండి ఆలూతో పాటూ బాగా కలిసిపోవాలి. ఉండలు, ముద్దలు ఉండకుండా బాగా కలుపుకోండి. అవసరమైతే మరిన్ని నీళ్లు పోసుకోండి. దోసెలు పోసేలాగా పిండి ఉంటే చాలు.
  5. ఇక పిండి రెడీ అయ్యాక అందులో మీకిష్టమైన కూరగాయ ముక్కలు, క్యారట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తరుగు, జీలకర్ర వేసుకోండి.
  6. ఒక పావు గంట పాటు పిండి పక్కన పెట్టుకుంటే రవ్వ నానిపోతుంది. లేదంటే అలాగే వేసేయొచ్చు.
  7. పెనం పెట్టుకుని వేడెక్కాక గరిటెడు పిండిని తీసుకుని దోశలు వేసుకోండి. దోస చాలా క్రిస్పీగా వస్తుంది. ఈ ఆలూ దోశను ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోండి.

తదుపరి వ్యాసం