తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Chutney: రెస్టారెంట్లో పెట్టే గ్రీన్ చట్నీని ఇలా ఇంట్లోనే చేసేయండి, ఇలా చేస్తే ఎంతో ఆరోగ్యం

Green Chutney: రెస్టారెంట్లో పెట్టే గ్రీన్ చట్నీని ఇలా ఇంట్లోనే చేసేయండి, ఇలా చేస్తే ఎంతో ఆరోగ్యం

Haritha Chappa HT Telugu

25 July 2024, 16:00 IST

google News
  • Green Chutney: గ్రీన్ చట్నీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని రెస్టారెంట్లలో కచ్చితంగా పెడతారు. ముఖ్యంగా స్టార్టర్స్ తో జతగా తినిపిస్తారు. గ్రీన్ చట్నీని తయారుచేసే చిట్కాలు ఇవిగో.

గ్రీన్ చట్నీ రెసిపీ
గ్రీన్ చట్నీ రెసిపీ

గ్రీన్ చట్నీ రెసిపీ

చాలా స్నాక్స్ తో జతగా గ్రీన్ చట్నీని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. శాండ్ విచ్ అయినా, పకోడాలు అయినా సరే గ్రీన్ చట్నీ తింటే ఆ టేస్టే వేరు. కానీ ఇంట్లో గ్రీన్ చట్నీ తయారు చేసేటప్పుడు దాని రంగు ముదురు రంగులోకి మారుతుంది. గ్రీన్ చట్నీని కలర్ జోడించకుండా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేయాలనుకుంటే ఈ విధంగా చేయండి. ఇలా చేయడం వల్ల చట్నీ రంగు పూర్తిగా ఆకుపచ్చగా కనిపించడంతో పాటు రుచి కూడా అదిరిపోతుంది.

గ్రీన్ చట్నీ రెసిపీకి కావలసిన పదార్థాలు

కొత్తిమీర - 50 గ్రాములు

పుదీనా - 50 గ్రాములు

పాలకూర - ఒక కట్ట

పెరుగు - అర కప్పు

చాట్ మసాలా - ఒక స్పూను

ఉప్పు - రుచికి తగినంత

నిమ్మరసం - రెండు స్పూన్లు

పచ్చిమిర్చి - రెండు

గ్రీన్ చట్నీ తయారీ విధానం

  1. ముందుగా పాలకూరను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత కొత్తిమీర, పుదీనా ఆకులను అదే విధంగా కడిగి శుభ్రం చేసుకోవాలి.

3. ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో పాలకూరను వేసి రెండు నిమిషాలు ఉడికించి, తర్వాత తీసి చల్లటి నీటిలో ముంచాలి.

4. అదేవిధంగా కొత్తిమీర, పుదీనా ఆకులను వేడినీటిలో వేసి తీసేయాలి. తర్వాత చల్లటి నీటిలో వేయాలి.

5. ఇప్పుడు పాలకూర, పుదీనా, కొత్తిమీరను మిక్సీ జార్ లో వేయాలి.

6. అలాగే రుచికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి రెండు మూడు, చాట్ మసాలా వేయాలి.

7. వీటన్నింటినీ గ్రైండ్ చేయడానికి నీటికి బదులు పెరుగు వాడండి. ఇలా చేయడం వల్ల చట్నీ రంగు చిక్కగా, ఫ్రెష్ గ్రీన్ చట్నీలా కనిపిస్తుంది.

8. చట్నీని బాగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి.

9. చట్నీ మరీ పలుచగా ఉండకూడదనుకుంటే పెరుగు పరిమాణాన్ని తగ్గించాలి. దీన్ని సాండ్ విచ్‌లు, పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివాటితో కలిపి తినేందుకు టేస్టీగా ఉంటాయి.

ఇందులో మనం వాడినవి ఆరోగ్యానికి మేలు ఆకుకూరలు. పాలకూర, కొత్తిమీర, పుదీనా… ఈ మూడు కూడా ఆరోగ్యానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. పిల్లలకు ఈ చట్నీ తాజాగా చేసి పెడితే ఎంతో నచ్చుతుంది.

తదుపరి వ్యాసం