తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mahindra Xuv400 Ev Highlights | ఫుల్ ఛార్జ్‌తో రాబోతున్న మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనం..!

Mahindra XUV400 EV Highlights | ఫుల్ ఛార్జ్‌తో రాబోతున్న మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనం..!

HT Telugu Desk HT Telugu

05 September 2022, 13:10 IST

google News
    • మహీంద్రా కంపెనీ తమ బ్రాండ్ నుంచి ఆల్-ఎలక్ట్రిక్ Mahindra XUV400 EV వాహనాన్ని ఈ గురువారం విడుదల చేస్తుంది. అయితే ఈ కార్ విడుదలకు ముందే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రత్యేకతలు ఏమున్నాయో చూడండి.
Mahindra XUV400 EV
Mahindra XUV400 EV

Mahindra XUV400 EV

దేశీయ వాహన తయారీదారు మహీంద్రా & మహీంద్రా భారత ఆటోమొబైల్ మార్కెట్లో మంచి స్థానాన్ని కలిగి ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పుంజుకుకుంటుండంతో ఈ సెగ్మెంట్లో కూడా తమదైన ముద్రవేయాలని భావిస్తోంది. గత నెలలో మహీంద్రా బ్రాండ్ 5 ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్‌లను ఆవిష్కరించారు. ఈ క్రమంలో తమ ఆల్-ఎలక్ట్రిక్ SUV అయిన 'Mahindra XUV400' వాహనాన్ని విడుదల చేసేందుకు మహీంద్రా సన్నాహాలు చేస్తోంది. తమ సరికొత్త ఎలక్ట్రిక్ SUVని సెప్టెంబర్ 8, 2022న లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.

ప్రస్తుతం దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో టాటా మోటార్స్ ముందంజలో ఉంది. టాటా నుంచి ఇదివరకే పూర్తి ఎలక్ట్రిక్ వాహనం అయిన Tata Nexon EV విడుదలైంది. టాటా తమ బ్రాండ్ నుంచి మరిన్ని మోడల్స్ విడుదల చేస్తూ దేశంలో తమ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌ను మరింత విస్తరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో వెనకబడకుండా టాటా EVలకు పోటీగా మహీంద్రా కంపెనీ తమ మహీంద్రా XUV400లో ఎలక్ట్రిక్ వెర్షన్ తీసుకురాబోతుంది.

మరి సరికొత్త మహీంద్రా XUV400 EV ఎలా ఉండబోతుంది. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి. ఈ కారుకు సంబంధించిన 5 కీలక అంచనాలు ఇక్కడ ఉన్నాయి.

Mahindra XUV400 EV డిజైన్

మహీంద్రా XUV400 EVకి సంబంధించిన డిజైన్‌ను కంపెనీ చాలా గోప్యంగా ఉంచుతోంది. తాజాగా విడుదల చేసిన టీజర్ ఫోటోలు మభ్యపెట్టేవిగా ఉన్నాయి, రహదారులపై అక్కడక్కడ కనిపిస్తున్న మహీంద్రా XUV400 EVగా చెప్పే వాహనాలు కూడా తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. అయితే సాలిడ్ గ్రిల్‌లో ట్విన్-పీక్స్ లోగో, ప్రొజెక్టర్ హెడ్‌లైట్ యూనిట్లు, అలాగే L-ఆకారపు DRLలు మాత్రం ఉంటాయి. ఏదేమైనా అధికారిక లాంచ్ జరిగితే గానీ Mahindra XUV400 EV ఎలా ఉంటుందనేది బయటకు తెలియదు.

Mahindra XUV400 EV కొలతలు

రాబోయే XUV400 EV కొలతల గురించి మాట్లాడుకుంటే ఇది ఎలక్ట్రిక్ సబ్-కాంపాక్ట్ SUV వెర్షన్ అయిన XUV300 కంటే పొడవు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే XUV300లో ఉన్న దాని కంటే మరింత విశాలమైన బూట్‌ స్పేస్ కలిగి ఉండవచ్చు.

Mahindra XUV400 EV బ్యాటరీ సామర్థ్యం

నివేదికల ప్రకారం.. మహీంద్రా XUV400 EV రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉండవచ్చు. అయితే వీటికి సంబంధించిన వివరాలు మాత్రం ప్రస్తుతానికి అస్పష్టంగా ఉన్నాయి. అయితే ఈ వాహనంలో 400 కిమీ మించిన పరిధిని అందించే బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చు.

Mahindra XUV400 EV ఫీచర్లు

మహీంద్రా XUV400 అనేది దేశీయంగా తయారైన ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి అందుకు తగినట్లుగా ఫీచర్లు ఉంటాయి. అడ్రినోఎక్స్ కనెక్టివిటీ ప్లాట్‌ఫారమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.

Mahindra XUV400 EV ప్రత్యర్థులు

మహీంద్రా XUV400 EV అధికారికంగా లాంచ్ అయిన తర్వాత భారత మార్కెట్లో ఈ వాహనం టాటా నెక్సాన్ EV, Nexon EV మాక్స్‌ వంటి వాహనాలకు పోటీగా ఉంటుంది.

తదుపరి వ్యాసం