తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Maha Shivratri 2023 : మహాశివరాత్రి రోజున ఏం చేయాలి.. ఏం చేయకూడదు?

Maha Shivratri 2023 : మహాశివరాత్రి రోజున ఏం చేయాలి.. ఏం చేయకూడదు?

HT Telugu Desk HT Telugu

13 February 2023, 11:11 IST

    • Maha Shivratri 2023 : మహాశివరాత్రి.. ఫిబ్రవరి 18న వస్తుంది. శివుడికి ఇష్టమైన రోజు. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగిపోనున్నాయి. అయితే శివరాత్రి రోజు.. చేయాల్సిన పనులు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.
మహాశివరాత్రి 2023
మహాశివరాత్రి 2023 (Unsplash)

మహాశివరాత్రి 2023

శివరాత్రి.. ఎంతో పవిత్రమైన రోజు. హిందూవులు జరుపుకొనే ముఖ్యమైన పండగలలో ఒకటి. నిష్ఠగా పూజిస్తే.. పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శివరాత్రి(ShivRatri)కి భక్తులు ఉపవాసం ఉంటారు. రాత్రి జాగారం చేస్తారు. శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఫాల్గుణ మాసం చతుర్ధశి తిథి కృష్ణ పక్షం నాడు మహాశివరాత్రిని జరుపుతారు. ఈ సంవత్సరం శివరాత్రి ఫిబ్రవరి 18న వస్తుంది. అయితే శివరాత్రి నాడు చేయాల్సినవి, చేయకూడనివి కొన్ని ఉన్నాయి.

లేటెస్ట్ ఫోటోలు

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

Mercury transit: వీరి మీద కనక వర్షం కురిపించబోతున్న బుధుడు.. అందులో మీరు ఉన్నారా?

May 16, 2024, 01:34 PM

Jupiter combust: అస్తంగత్వ దశలోకి గురు గ్రహం.. వీరికి అప్పులు, సమస్యలు, కష్టాలే

May 16, 2024, 01:11 PM

వృషభ రాశిలో సూర్యుడు: నెలపాటు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. ఈ ఇబ్బందులు కలగొచ్చు

May 16, 2024, 12:10 PM

Guru Aditya yoga: 12 ఏళ్ల తర్వాత గురు ఆదిత్య యోగం.. వీరికి గౌరవం, డబ్బు, అన్నింటా విజయం

May 16, 2024, 08:25 AM

ఏం చేయాలి..

బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందుగానే లేవాలి. ధ్యానం చేయడం మంచిది. అనంతరం తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైతే తెల్ల రంగు దుస్తులను ధరించాలి. అయితే ఉపవాసానికి ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. రోజు ఉండే డైట్ మారుతుంది కదా. మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. వైద్యుడి సలహా మేరకు ఉపవాసం ఉండండి. ఎక్కువసార్లు ఓం నమ:శివాయ అని వీలైనన్ని ఎక్కువసార్లు జపించండి.

ఇంట్లో అయినా.., దేవాలయంలో శివలింగానికి అయినా.. నీరు లేదా పచ్చిపాలతో అభిషేకం చేయాలి. నెయ్యి , పెరుగు, తేనెతో కూడా అభిషేకం చేయొచ్చు. దతుర పువ్వులు, పండ్లు, బిల్వ పత్రాన్ని సమర్పించాలి. చందనాన్ని శివయ్యకు సమర్పించండి. అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుడికి పూజలు చేయండి.

ఏం చేయకూడదు

గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి. మాంసం, ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకుడదు. పొగాకు, మద్యాన్ని సేవించొద్దు. శివలింగానికి కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు. కేతకి పువ్వులకు దూరంగా ఉండాలి. పూజకు ఇత్తడి, రాగి, వెండి పాత్రలను ఉపయోగించేలా చూసుకోండి. స్టీల్ వద్దు. నలుపు రంగు దుస్తులను ధరించకండి. తులసి ఆకులను దేవదేవుడికి సమర్పించకూడదు.

టాపిక్

తదుపరి వ్యాసం