వృషభ రాశిలో సూర్యుడు: నెలపాటు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. ఈ ఇబ్బందులు కలగొచ్చు-unlucky zodiac signs sun enters in taurus negative effect on these 3 signs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  వృషభ రాశిలో సూర్యుడు: నెలపాటు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. ఈ ఇబ్బందులు కలగొచ్చు

వృషభ రాశిలో సూర్యుడు: నెలపాటు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. ఈ ఇబ్బందులు కలగొచ్చు

May 16, 2024, 12:10 PM IST Chatakonda Krishna Prakash
May 16, 2024, 12:10 PM , IST

Sun transit 2024: వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు. ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంది. వారి జీవితాల్లో మార్పులు రావొచ్చు. వారు జాగ్రత్తగా ఉండాలి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలకు సూర్యుడు రాజు. సూర్యుడు ప్రతీ నెల ఓ రాశిలో సంచరిస్తాడు. మే 14న వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు. అప్పటి నుంచి నెల పాటు ఆ రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత జూన్ 15న మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాలకు మిథున రాశిలోకి వెళతాడు. 

(1 / 5)

ప్రస్తుతం వృషభ రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. ఈ సంచారం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది. సూర్యుడు వృషభ రాశిలోకి ప్రయాణించడం వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తలెత్తవచ్చు. వారు నెల పాటు జూన్ 15 వరకు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ వివరాలు ఇవే.

(2 / 5)

మిథునం: ఈకాలంలో మిథున రాశిలో సూర్యుడు పన్నెండో స్థానంలో నుంచి సంచారం చేస్తాడు. అందువల్ల ఈ రాశి వారికి ఎక్కువగా డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. వృత్తిలో సమస్యలు, సమయం వృథా కావడం జరగొచ్చు. భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. ఇది మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ నెల రోజులు ప్రయాణాలు, వ్యక్తిగత జీవితంలో మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

(3 / 5)

తులా రాశి: ఈ రాశిలో సూర్యుడు ఎనిమిదో స్థానం నుంచి ప్రయాణిస్తున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారు వారి భావాలను స్పష్టంగా వ్యక్తీకరించలేకపోవచ్చు. దీనివల్ల వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుంది. ఒత్తిడికి గురవుతారు. ఈ రాశి వారికి జూన్ 15 వరకు కొన్ని ఆకస్మిక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 

(4 / 5)

మకర రాశి: ఈ కాలంలో సూర్యుడు ఈ రాశిలో ఐదో ఇంట్లో సంచరిస్తాడు. దీనివల్ల మకర రాశి వారి వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుంది. విద్య, సంతానం విషయాల్లో కాస్త ఇబ్బందులు ఉండొచ్చు. అందుకే ఈ నెల కాలంలో మీరు కుటుంబ జీవితం, విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో వాగ్వాదాలు జరగొచ్చు. ఈ విషయంలో జూన్ 15 వరకు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు