Soya Chaap Curry Recipe । రుచికరం, సువాసనభరితం.. సోయా చాప్ కర్రీ పూర్తిగా శాకాహారం!
16 February 2023, 12:53 IST
- Soya Chaap Curry Recipe: చిక్కటి గ్రేవీ, మెత్తని ముక్కలు ఉన్న శాకాహార కూర తినాలనుకుంటున్నారా? అయితే సోయా చాప్ కర్రీని ట్రై చేయండి. ఇక్కడ దాని రెసిపీ ఉంది చూడండి.
Soya Chaap Curry Recipe
శాకాహారంలో మంచి మసాలా కూర తినాలని ఉందా? ఎప్పుడైనా సోయా చాప్ కర్రీ తిని చూశారా? ఇది వెజ్ రెస్టారెంట్లలో ఎక్కువగా వడ్డించే ప్రసిద్ధ వంటకం. ప్రొటీన్లు అధికంగా ఉండే ఈ వంటకం మాంసాహారాన్ని తలదన్నే రుచి ఉంటుంది. సోయా చాప్ కర్రీ ఒక సువాసనభరితమైన, రుచికరమైన శాకాహార కూర. దీనిని గార్లిక్ నాన్, తందూరీ రోటీ, కుల్చా వంటి రొటీలతో అయినా పులావ్, బిర్యానీ వంటి రైస్ వంటకాలతో వడ్డించినా చాలా రుచిగా ఉంటుంది.
సాధారణంగా సోయా చంక్స్‌తో చేసే మీల్ మేకర్ కర్రీని మీరు చాలా సార్లు తినే ఉంటారు. కానీ సోయా చాప్స్‌తో చేసే ఈ సోయా చాప్ కర్రీని స్పైసీగా, జ్యూసీగా, ఫ్రైగా, తందూరీగా మనకు నచ్చిన విధానంలో వండుకోవచ్చు.
మరి ఆలస్యం ఎందులకు? అవస్యంగా సోయా చాప్ కర్రీని ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
Soya Chaap Curry Recipe కోసం కావలసినవి
- 5 సోయా చాప్ స్టిక్స్
- 3 టమోటాలు
- 1 పచ్చిమిర్చి
- 1 చిటికెడు ఇంగువ
- 1 టీస్పూన్ పసుపు పొడి
- ¼ టీస్పూన్ ఎర్ర మిరపకాయ
- ½ స్పూన్ గరం మసాలా
- 1 టీస్పూన్ ధనియాల పొడి
- 1 బిర్యానీ ఆకు
- 1 స్పూన్ జీలకర్ర
- 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ పేస్ట్
- 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్
- 1/2 కప్పు క్రీమ్
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- ఒక చిటికెడు కసూరి మేతి
- రుచికి తగినంత ఉప్పు
సోయా చాప్ కర్రీ రెసిపీ ఎలా చేయాలి?
- ముందుగా, సోయా చాప్ స్టిక్స్ తీసుకొని మంచినీటితో శుభ్రంగా కడగండి. ఆపై చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
- ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె పోసి వేడి చేయండి, అనంతరం నూనెలో కట్ చేసిన సోయా స్టిక్స్ వేసి, బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించండి. వేయించిన సోయా చాప్‌స్టిక్‌లను కాసేపు పక్కనపెట్టండి.
- ఇప్పుడు అదే నూనెలో బిర్యానీ ఆకు, జీలకర్ర, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించండి. సరిపడా ఉప్పు, పసుపు వేసి కలపండి.
- ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి కలపాలి.
- ఇప్పుడు ఆ మిశ్రమంలో కొన్ని నీళ్లు పోయండి, గ్రేవీ కోసం కొన్ని టమోటాలను ప్యూరీగా చేసి వేయండి, బాగా కలిపి ఉడికించండి.
- గ్రేవీ ఉడికిన తర్వాత అందుకో కొత్తిమీర తరుగు, కసూరి మేతి, గరం మసాలా వేసి బాగా కలపండి, ఆపైన క్రీమ్ కలపండి.
- చివరగా రోస్ట్ చేసి పక్కనపెట్టిన సోయా చాప్ స్టిక్స్ వేసి కొద్దిగా ఉడికించండి.
అంతే, ఘుమఘుమలాడే సోయా చాప్ కర్రీ రెడీ. పైనుంచి కాస్త క్రీమ్ గార్నిష్ చేసుకుంటే కూర నోరూ ఊరేలా టెక్చర్ అద్భుతంగా ఉంటుంది. లంచ్ అయినా, డిన్నర్ అయినా.. అన్నంలో అయినా, రోటీతో అయినా సంతృప్తిగా తినండి.