Beary Biryani Recipe । ఘుమఘుమల బేరీ బిర్యానీ.. దీని రుచిలో 'దమ్' ఉంది!-spicy and tasty mangalorean beary biryani here s an authentic recipe from coastal karnataka ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beary Biryani Recipe । ఘుమఘుమల బేరీ బిర్యానీ.. దీని రుచిలో 'దమ్' ఉంది!

Beary Biryani Recipe । ఘుమఘుమల బేరీ బిర్యానీ.. దీని రుచిలో 'దమ్' ఉంది!

HT Telugu Desk HT Telugu
Jan 31, 2023 07:33 PM IST

Mangalorean Beary Biryani Recipe: నైరుతి కర్ణాటక తీరప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ కలిగిన బేరీ బిర్యానీని వండుతారు. దాని రెసిపీ ఇక్కడ ఉంది చూడండి. రెసిపీ పెద్దగా అనిపించినా చాలా సింపుల్, ఈజీగా చేసేయొచ్చు.

Mangalorean Beary Biryani Recipe
Mangalorean Beary Biryani Recipe (Unsplash)

బిర్యానీ అంటే మనకు ఉన్న అభిమానం మాటల్లో చెప్పలేనిది. బిర్యానీలలో చాలా వెరైటీలు ఉన్నాయి. హైదరాబాదీ దమ్ బిర్యానీ నుంచి కాశ్మీరీ భునా మటన్ బిర్యానీ భారతదేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన బిర్యానీ ప్రసిద్ధి. దక్షిణ కర్నాటక తీర ప్రాంతాలలో బిర్యానీకి మరింత ఫ్లేవర్లు కలిపి చాలా రుచికరంగా తయారు చేస్తారు, వాటిలో ఒకటి బేరీ బిర్యానీ. ఈ బేరీ బిర్యానీ అనేది మంగుళూరు బిర్యానీకి దక్షిణ బిర్యానీకి, కొద్దిగా దగ్గర పోలికలు ఉన్నప్పటికీ సూక్ష్మమైన రుచులతో, భిన్నమైన ఫ్లేవర్లతో ఉంటుంది.

కర్ణాటకలోని నైరుతి తీరంలో నివసించే ముస్లిం కమ్యూనిటీ ఈ బేరీ బిర్యానీని ప్రత్యేకంగా వండుతారు. బేరీ బిర్యానీని దమ్ బిర్యానీ మాదిరిగానే వండుతారు, అయితే మెరినేషన్ చేయడం వేరేలా ఉంటుంది. మాంసాన్ని నెయ్యి, సుగంధ ద్రవ్యాలలో రాత్రిపూట మెరినేట్ చేస్తారు. చాలా సువాసనగల కొత్తిమీర-పుదీనా మసాలా పేస్ట్, కొబ్బరి పేస్ట్‌లను కలిపి వండుతారు. ఇది ఈ బిర్యానీకి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.

మరి మీరు కూడా రుచికరమైన ఈ బేరీ బిర్యానీని తినాలనుకుంటే ఈ కింద బేరీ బిర్యానీ రెసిపీ ఉంది. ఇక్కడ అందించిన సూచనల ప్రకారం సులభంగా తయారు చేసుకోవచ్చు.

Mangalorean Beary Biryani Recipe కోసం కావలసినవి

  • 600 గ్రాముల చికెన్
  • 300 గ్రాముల బాస్మతి బియ్యం
  • 1/2 కప్పు కొబ్బరి తురుము
  • 1/2 కప్పు పెరుగు
  • 1½ కప్పు తాజా కొత్తిమీర
  • 1 కప్పు తాజా పుదీనా
  • 6-7 పచ్చి మిరపకాయలు
  • 2 కప్పులు వేయించిన ఉల్లిపాయ
  • 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం
  • 1 కప్పు టమోటాలు తరిగినవి
  • 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి
  • 1½ స్పూన్ గరం మసాలా
  • 1 స్పూన్ గసగసాలు
  • 2 టేబుల్ స్పూన్లు సోంఫు
  • 1 టేబుల్ స్పూన్ ధనియాలు
  • 1 స్పూన్ జీలకర్ర
  • 3-4 పచ్చి ఏలకులు
  • 1 నల్ల ఏలకులు
  • 1 అంగుళం దాల్చిన చెక్క
  • 2 స్టార్ సోంపు
  • 1 జాపత్రి
  • ½ tsp జాజికాయ పొడి
  • 8-10 జీడిపప్పు
  • 8-10 ఎండుద్రాక్ష
  • 1/2 కప్పు నెయ్యి
  • రుచికి తగినంత ఉప్పు

బేరీ బిర్యానీ తయారీ విధానం

  1. ముందుగా బాస్మతి బియ్యంను కడిగి ఒక 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి.
  2. మరోవైపు రాత్రంతా మెరినేట్ చేసిన చికెన్‌ను తీసి అందులో పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి వరకు పక్కన పెట్టండి.
  3. ఇప్పుడు బాణాలిని వేడి చేసి అందులో 5 కప్పుల నీరు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, దాల్చిన చెక్క, యాలకులు, 1 స్టార్ సోంపు వేసి మరిగించండి. బాయిల్ వచ్చేసరికి నానబెట్టిన బియ్యాన్ని వేయాలి. అన్నం 75% ఉడికినంత వరకు ఉడికించి, ఆపై వడకట్టి పక్కన పెట్టండి.
  4. ఇప్పుడు మరొక మరొక బాణాలిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి అందులో జీడిపప్పు, ఎండుద్రాక్షలను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, పక్కన పెట్టండి.
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, ధనియాలు, మిరపకాయలు, జీలకర్ర, స్పూన్ సోంపు గింజలు, జాజికాయ పొడి, జాపత్రి అన్నీ ఒక బ్లెండర్లో వేసి కొన్ని నీళ్లు పోసి పేస్ట్‌గా తయారు చేయండి.
  6. ఇప్పుడు వంట కుండను 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యితో మీడియం మంట మీద వేడి చేసి, సిద్ధ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి, సువాసన వచ్చే వరకు వేయించాలి.
  7. అందులో టొమాటోలు, పెరుగు వేసి బాగా కలపండి నెయ్యి విడిపోయే వరకు ఉడికించాలి.
  8. తరువాత, చికెన్ ముక్కలు, వేయించిన ఉల్లిపాయలు వేసి 6-7 నిమిషాలు ఉడికించాలి. చికెన్ పూర్తిగా ఉడికినంత వరకు 3-4 టేబుల్ స్పూన్ల నీరు, ఉప్పు, వేసి మూతపెట్టి ఉడికించాలి
  9. ఈలోగా, మిగిలిన సోంపు గింజలు, కొబ్బరి , గసగసాలతో 2-3 టేబుల్ స్పూన్ల నీటితో పేస్ట్ చేయండి. చికెన్ ఉడికిన దీన్ని అందులో వేయండి. బాగా కలిపి మరో 5-6 నిమిషాలు ఉడికించాలి. కొన్ని సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేయండి.
  10. మందపాటి అడుగు ఉన్న పాన్ తీసుకోండి, దాని లోపల ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ముందుగా బిర్యానీ ఆకులు, చికెన్‌ కూర వేసి ఆపై పాక్షికంగా వండిన అన్నం, తరువాత గరం మసాలా, నెయ్యి, మిగిలిన వేయించిన ఉల్లిపాయలు, వేయించిన జీడిపప్పు ఎండుద్రాక్ష మొదలైనవి అన్నీ వేసేయండి.
  11. ఇప్పుడు కుండను అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టి, గట్టి మూతతో కప్పండి. 12-15 నిమిషాలు చాలా తక్కువ మంట మీద ఉడికించండి. పూర్తయిన తర్వాత, మంట నుండి తీసివేసి, మరో 10 నిమిషాలు అలాగే ఉంచండి.

ఘుమఘుమలాడే బేరీ బిర్యానీ రెడీ. రైతాతో సర్వ్ చేసుకుంటూ కమ్మగా తినండి, రుచిని ఆస్వాదించండి.

WhatsApp channel

సంబంధిత కథనం