Green peas Meal Maker Curry । దాబా స్టైల్‌లో బఠానీ మీల్ మేకర్ కర్రీ.. పసందైన విందుకు లేదిక వర్రీ!-green peas soya chunks curry will make your meal more delicious dhaba style recipe inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Green Peas Soya Chunks Curry Will Make Your Meal More Delicious, Dhaba Style Recipe Inside

Green peas Meal Maker Curry । దాబా స్టైల్‌లో బఠానీ మీల్ మేకర్ కర్రీ.. పసందైన విందుకు లేదిక వర్రీ!

HT Telugu Desk HT Telugu
Jan 25, 2023 02:18 PM IST

Green peas Meal Maker Curry Recipe: పచ్చి బఠానీ, మీల్ మేకర్ రెండూ కలిపితే దాబా శైలిలో రుచికరమైన కర్రీని తయారు చేసుకోవచ్చు. రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.

Green peas Meal Maker Curry Recipe
Green peas Meal Maker Curry Recipe (freepik)

చలికాలంలో పచ్చి బఠానీలను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చి బఠానీలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్ వంటి పోషకాలతో నిండి ఉన్నాయి. శాకాహారుల ఆరోగ్యానికి మాంసకృత్తులు అవసరం, వారికి మొక్కల ఆధారిత మాంసకృత్తులను అందించే పచ్చి బఠానీలు గొప్ప ఆహారం.

అంతేకాదు, పచ్చి బఠానీలు ఎంతో రుచిగా కూడా ఉంటాయి, వీటిని ఇతర పదార్థాలతో కలిపి మరిన్ని రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలు కూడా సిద్ధం చేసుకోవచ్చు.

పచ్చిబఠానీలు, మీల్ మేకర్ కలిపి దాబా శైలిలో పసందైన వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. బఠానీ మీల్ మేకర్ కర్రీ రెసిపీ ఇక్కడ ఉంది చూడండి. దీనిని అన్నంతో, రోటీలకు తింటే చాలా అద్భుతంగా ఉంటుంది.

Green peas Meal Maker Curry Recipe కావలసినవి:

  • మీల్ మేకర్ 1 కప్పు
  • పచ్చి బఠానీలు 1 కప్పు
  • నూనె 2 టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర 1 tsp
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్
  • ఉల్లిపాయలు 4-5 మీడియం సైజు (తరిగినవి)
  • పసుపు ½ స్పూన్
  • టొమాటోలు 5-6 మీడియం సైజు (తరిగినవి)
  • శనగపిండి 1 టేబుల్ స్పూన్
  • కారంపొడి 1 టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్
  • జీరా పొడి 1 tsp
  • ఆమ్చూర్ పొడి 1 tsp
  • పచ్చిమిర్చి 3-4
  • అల్లం 1-అంగుళం
  • వేడి నీరు 500 మి.లీ
  • గరం మసాలా 1 tsp
  • కసూరి మేతి 1 స్పూన్
  • తాజా కొత్తిమీర 1 టేబుల్ స్పూన్
  • రుచికి తగినంత ఉప్పు

బఠానీ మీల్ మేకర్ కర్రీ తయారీ విధానం

1. ముందుగా సోయా చంక్స్ లేదా మీల్ మేకర్లను 2-3 నిమిషాలు నీటిలో ఉడకబెట్టి, ఆపైన వడకట్టి, చల్లటి నీటితో బాగా కడగాలి. నీటిని తీసేసి పక్కన పెట్టండి.

2. ఇప్పుడు వోక్‌లో నూనె వేడి చేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1-2 నిమిషాలు వేయించాలి.

3. ఉల్లిపాయలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. పసుపు వేసి ఒక నిమిషం ఉడికించాలి.

4. టొమాటోలు, ఉప్పు వేసి, అది మెత్తగా నూనె వచ్చే వరకు ఉడికించాలి.

5. ఇప్పుడు మసాలా పొడిలు వేసి 1-2 నిమిషాలు ఉడికించాలి, కొంచెం నీరు పోసుకొని మరో 2 నిమిషాలు ఉడికించాలి.

6. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, పచ్చి బఠానీలు, ఉడికించిన సోయా ముక్కలు వేసి బాగా కలపాలి, 2-3 నిమిషాలు ఉడికించాలి.

7. ఇప్పుడు వేడినీరు, ఉప్పు వేసి, మరిగించి, మూతపెట్టి 8-10 నిమిషాలు ఉడికించాలి.

8. చివరగా గరం మసాలా, కసూరి మేతి, తాజాగా తరిగిన కొత్తిమీర ఆకులు వేసి బాగా కలపాలి.

అంతే, సోయా మటర్ కర్రీ లేదా బఠానీ మీల్ మేకర్ కర్రీ రెడీ. పరాటా రోటీ లేదా అన్నంతో వేడివేడిగా సర్వ్ చేసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం