Dil Leaves Attu । సోయాకూరతో అట్టు.. చలికాలంలో పట్టండి ఓ పట్టు!
Dil Leaves Attu: సోయాకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, వీటిలో పప్పులు కలపడం ద్వారా మంచి ప్రోటీన్ ఫుడ్ అవుతుంది. దీనిని అట్టు చేసుకొని అల్పాహారంగా తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. ఈ చలికాలంలో అయితే బ్రేక్‌ఫాస్ట్ అస్సలు మిస్ చేయకూడదు. చల్లటి వాతావరణంలో మీరు రోజులో తినే మొదటి భోజనం మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి తగినంత వేడిని ఉత్పత్తి చేస్తుంది. సరైన పోషకాలతో నిండిన అల్పాహారం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఈ చలికాలంలో ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. బెంగళూరులోని క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో ఎగ్జిక్యూటివ్ న్యూట్రిషనిస్ట్ సుస్మిత, ఈ చలికాలంలో సమతుల్య అల్పాహారం అవసరం అని పేర్కొన్నారు. ప్రోటీన్లు, ఇతర పోషకాలతో నిండిన సోయాకూర అట్టు తింటే చాలా మంచిది అని పేర్కొన్నారు. దీనిని ఉసిరి చట్నీతో కలుపుకొని తింటే మరీ మంచిది.
సోయాకూర అట్టులో ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ సి లతో పాటు తక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్ల ఉంటాయి. కాబట్టి ఈ అల్పాహారం బరువు తగ్గడం కోసం, మధుమేహం సమస్య ఉన్నవారికి కూడా ఇది మంచి ప్రత్యామ్నాయం. మరి సోయాకూర అట్టు ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ రెసిపీ ఇచ్చాం చూడండి.
Dil Leaves Attu Recipe కోసం కావలసినవి
- బియ్యం - 1 కప్పు
- పెసరిపప్పు - 1/2 కప్పు
- మినపపప్పు - 1/2 కప్పు
- మెంతి గింజలు - 1/4 టీస్పూన్లు
- సోయాకూర ఆకులు - 1/2 కప్పు
- పచ్చిమిర్చి - 1
- చిన్నగా తరిగిన ఉల్లిపాయలు - 1/2 కప్పు
- ఉప్పు - రుచికి తగినంత
- నూనె అవసరం మేరకు
సోయాకూర అట్టు తయారీ విధానం
1. ముందుగా బియ్యం, పెసరపప్పు, మినపపప్పు, మెంతి గింజలను కడిగి 8 గంటలు నానబెట్టండి.
2. రెండో దశలో నానబెట్టిన పప్పుల నుండి నీటిని తీసేసి, సోయా కూర , పచ్చిమిర్చి, ఉల్లిపాయల ముక్కలు కలిపి మెత్తని పేస్ట్ చేయండి, అవసరం మేరకు నీరు కలపండి.
3. ఇప్పుడు మిక్స్‌ను ఒక గిన్నెలోకి మార్చు, 6 గంటలు పులియనివ్వండి.
4. బ్యాటర్ తయారయ్యాక పెనం వేడి చేసి, నూనె అప్లై చేసి అట్లు వేసుకోండి.
5. ఉసిరికాయ చట్నీతో సోయాకూర అట్టును వేడివేడిగా సర్వ్ చేయండి.
సంబంధిత కథనం