carrot rice: లంచ్ బాక్స్‌లోకి రుచికరమైన క్యారట్ రైస్
14 May 2023, 12:25 IST
carrot rice: క్యారట్ రైస్ సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మధ్యాహ్న భోజనంలోకి, రాత్రి పూట ఈ క్యారట్ రైస్ తినొచ్చు.
క్యారట్ రైస్ (free pic)
క్యారట్ రైస్
ఎప్పుడైనా లంచ్ బాక్సులోకి, మధ్యాహ్న భోజనం వండడానికి సమయం లేకపోతే ఈ క్యారట్ రైస్ చేసి చూడండి. తక్కువ సమయంలో అయిపోతుంది. మసాలాల వల్ల బిర్యానీ తిన్న అనుభూతి కలుగుతుంది. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సులువుగా చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
1 కప్పు బాస్మతీ బియ్యం
1 కప్పు క్యారట్ తురుము
సగం కప్పు సన్నగా తరిగిన క్యారట్ ముక్కలు
1 ఉల్లిపాయ
1 టేబుల్ స్పూన్ జీడిపప్పు
2 లవంగాలు
1 బిర్యానీ ఆకు
2 యాలకులు
అంగులం దాల్చిన చెక్క ముక్క
సగం స్పూన్ ధనియాల పొడి
సగం స్పూన్ జీలకర్ర పొడి
సగం స్పూన్ గరం మసాలా
4 వెల్లుల్లి రెబ్బలు
2 టేబుల్ స్పూన్ల నూనె
తయారీ విధానం:
- ముందుగా బాస్మతీ బియ్యాన్ని కడిగి పొడిపొడిగా ఉండేలా అన్నం వండుకోవాలి.
- పొయ్యిమీద కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. మసాలాలు వేగాక జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కాస్త వేగాక ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి.
- ఉల్లిపాయ ముక్కలు వేగాక క్యారట్ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. 2 నిమిషాలయ్యక క్యారట్ తురుము కూడా వేసుకోవాలి.
- క్యారట్ ఉడికాక ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకుని వేగనివ్వాలి.
- కొత్తిమీర తరుగు వేసుకుని ముందే ఉడికించి పెట్టుకున్న బియ్యం కలుపుకోవాలి. అంతే.. క్యారట్ రైస్ సిద్ధమవుతుంది.
టాపిక్