తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Migraine Triggers । శృంగారంతోనూ మైగ్రేన్ తలనొప్పి.. మిగతా కారణాలు తెలుసుకోండి!

Migraine Triggers । శృంగారంతోనూ మైగ్రేన్ తలనొప్పి.. మిగతా కారణాలు తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu

23 November 2022, 17:18 IST

    • Migraine Triggers- మైగ్రేన్ అనేది ఒకరకమైన తలనొప్పి, ఇది కలగటానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో శృంగారం కూడా ఒక కారణం. మిగతా కారణాలు చూడండి.
Migraine Triggers
Migraine Triggers (stock photo)

Migraine Triggers

మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి, ఇది సాధారణంగా తలకు ఒక వైపున మాత్రమే కలుగుతుంది. కొన్ని సార్లు రెండు వైపులా ఎపిసోడ్‌ల రూపంలో నొప్పి ఉండవచ్చు. మైగ్రేన్ సమస్య ఉంటే తలలో ఒక పక్కన తీవ్రమైన నొప్పి లేదా జల్లుమన్న అనుభూతిని కలిగిస్తుంది. తరచుగా వికారం, వాంతులతో పాటు మెరిసే కాంతి, ధ్వనికి తీవ్ర సున్నితత్వంతో కూడి ఉంటుంది. మైగ్రేన్ దాడులు కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉండవచ్చు. ఈ నొప్పి మిమ్మల్ని ఏ పని చేయనివ్వదు. మీ రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించేంత తీవ్రంగా ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Friday Motivation: ఆనందంగా జీవించడానికి కావాల్సింది డబ్బు కాదు, ప్రేమ, కరుణ, స్నేహాలు, అనుబంధాలు

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు?

Mothers day 2024 Gift Ideas: మదర్స్ డే రోజు మీ అమ్మకు మర్చిపోలేని ఇలాంటి అందమైన బహుమతిని ఇవ్వండి

Carrot Milkshake: మండే ఎండల్లో టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ ఇది, ఎంతో ఆరోగ్యం కూడా

మైగ్రేన్ తలనొప్పి చాలా సాధారణం, ఇది ఎక్కువగా ఆడవారికి కలుగుతుంది. అందుబాటులో ఉన్న రిపోర్టుల ప్రకారం ప్రతీ ఐదుగురు స్త్రీలలో ఒకరికి, 16 మంది పురుషులలో ఒకరు అలాగే 11 మంది పిల్లలలో ఒకరికి ఈ మైగ్రేన్ సమస్య వెంటాడుతుంది. ఇతరులతో పోలిస్తే మైగ్రేన్ దాడులు మహిళల్లో మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయి.

Migraine Triggers- మైగ్రేన్ తలనొప్పికి కారణాలు

మైగ్రేన్ తలనొప్పి రావటానికి చాలా కారణాలు ఉండవచ్చు. కారణాలు వ్యక్తి వ్యక్తికి మధ్య వేరేగా ఉంటాయి. హార్మోన్ల వ్యత్యాసాల ఫలితంగా కూడా ఉండవచ్చు. అయితే ముఖ్యంగా ఏ వ్యక్తిలో అయినా మైగ్రేన్ వ్యాధి అభివృద్ధి చెందుతుందటే, అందుకు కచ్చితంగా జన్యుపరమైన, పర్యావరణ కారకాలు పాత్ర పోషిస్తాయని వైద్యులు అంటున్నారు.

మైగ్రేన్ సమస్యను నివారించాలంటే ముందు, అది రావటానికి గల కారణాలను విశ్లేషించాలి. మైగ్రేన్ ఎటాక్ కావటానికి కొన్ని సాధారమైన కారణాలు ఏమున్నాయో ఇక్కడ పరిశీలించండి.

మహిళల్లో హార్మోన్ల మార్పులు

ఈస్ట్రోజెన్‌లో హెచ్చుతగ్గులు, రుతుక్రమానికి ముందు లేదా పీరియడ్స్ సమయంలో తలనొప్పి ఉండవచ్చు. అలాగే గర్భంతో ఉన్నప్పుడు కూడా ఈ హార్మోన్ల మార్పులు చాలా మంది స్త్రీలలో తలనొప్పిని ప్రేరేపిస్తాయి.

గర్భనిరోధకాలు

కొన్ని రకాల గర్భనిరోధకాలు కూడా మైగ్రేన్‌లను కలిగిస్తాయి. ముఖ్యంగా నోటి ద్వారా తీసుకొనే గర్భనిరోధక మాత్రలు, హార్మోన్ల మందులు మైగ్రేన్‌లను మరింత తీవ్రతరం చేస్తాయి. అయితే, అందరికీ తీవ్రంగా ఉండదు, కొంతమంది మహిళలు ఈ ఔషధాలను తీసుకున్నప్పుడు వారి మైగ్రేన్లు తక్కువగా సంభవించవచ్చు.

ఇంద్రియ ఉద్దీపనలు

ప్రకాశవంతమైన లేదా మెరుస్తున్న లైట్లు మైగ్రేన్‌లను ప్రేరేపిస్తాయి, అలాగే బిగ్గరగా వినిపించే శబ్దాలు, దద్దరిల్లే శబ్దాలు కూడా మైగ్రేన్‌లకు కారణం.

ఘాడమైన వాసనలు

ఘాటైన పెర్ఫ్యూమ్, పెయింట్ వాసనలు, ఇతరులు సిగరెట్ త్రాగుతున్నప్పుడు వచ్చే పొగ వాసన, తదితర బలమైన వాసనలు కొంతమందిలో మైగ్రేన్‌లను ప్రేరేపిస్తాయి.

తీవ్రమైన శృంగారం

ఎక్కువసేపు లైంగిక కార్యకలాపాలలో పాల్గొనటం సహా తీవ్రమైన శృంగారం, శారీరక శ్రమ మైగ్రేన్‌లను రేకెత్తిస్తుంది.

నిద్రలేమి

వేళకు నిద్ర పోకపోవడం, నిద్ర సమయం మార్పులు. నిద్రలేమి లేదా ఎక్కువగా నిద్రపోవడం సహా పనిఒత్తిడి కొంతమందిలో మైగ్రేన్‌లను ప్రేరేపిస్తుంది.

ఆహార పానీయాలు

ఎక్కువ రోజులు గడిచిన ప్యాకేజ్ జున్ను , ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్వీటెనర్ అస్పార్టేమ్, ప్రిజర్వేటివ్ మోనోసోడియం గ్లుటామేట్ (MSG) వంటి ఆహారాలు మైగ్రేన్‌లను ప్రేరేపిస్తాయి.

అదేవిధంగా కొన్ని రకాల డెయిరీ ఉత్పత్తులు, కాఫీ వంటి చాలా కెఫిన్ ఉండే పానీయాలు, ఆల్కహాల్ పానీయాలు ముఖ్యంగా వైన్ వంటివి మైగ్రేన్‌లను కలిగిస్తాయి.

వాతావరణ మార్పులు

వాతావరణంలో మార్పు లేదా వాతావరణంలో అధిక పీడనం మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది.

టాపిక్