తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rare Foods : పందికళ్లతో ఫ్రై, గొంగళిపురుగుతో సూప్‌, తూనీగతో చిప్స్‌.. ప్రపంచంలో ఫేమస్‌ వంటకాలివి

Rare Foods : పందికళ్లతో ఫ్రై, గొంగళిపురుగుతో సూప్‌, తూనీగతో చిప్స్‌.. ప్రపంచంలో ఫేమస్‌ వంటకాలివి

Anand Sai HT Telugu

13 February 2024, 18:00 IST

    • Rare Foods : ప్రపంచంలో కొన్ని రకాల ఆహారపు అలవాట్లు వితంగా ఉంటాయి. మనం వెరైటీగా చూస్తాం.. కానీ కొన్ని దేశాల్లో వారికి అదే ప్రధానం ఆహారం. అలాంటి ఆహారాలు చూద్దాం..
వెరైటీ ఆహారాలు
వెరైటీ ఆహారాలు (Unsplash)

వెరైటీ ఆహారాలు

ప్రపంచంలోని కొన్ని దేశాల ప్రజలు ఆహారం చూస్తే.. కడుపులో తిప్పుతుంది.. కారణం వారి విచిత్రమైన ఆహారం. మనదేశంలో తిండికి దూరమైన వస్తువులన్నీ విదేశాల్లో ఆహారం రూపంలో కడుపులోకి చేరుతున్నాయి. గొంగళిపురుగును డీ ఫ్రై చేసి తింటారట.. చైనా మాత్రమే అనుకోకండి. ఇంకా చాలా దేశాల్లో ఇలాంటి వింత ఆహారపు అలవాట్లు ఉన్నాయి.

ఒక్కో ప్రాంతానికి ఒక్క వంటకం ఫేమస్‌ ఉంటుంది.. హైదరాబాద్‌ అంటే బిర్యానీ ఫేమస్‌, నెల్లూరు అంటే చేపల పులుసు ఫేమస్‌, విజయవాడ అంటే చిట్టిపునుగులు ఫేమస్, రాయలసీమ సైడ్‌ నాటుకోడి, రాగిసంకటి.. ఇలా ఉంటాయి.. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఫేమస్‌ అయిన ఆహారం చూస్తే.. మీకు వాంతు వస్తుంది. గొంగళిపురుగు పొరపాటున బట్టల మీద పాకితేనే.. మనకి చిరాకుగా ఉంటుంది. అలాంటిది గొంగళిపురుగుతో ఫ్రై చేస్తే.. ఇమాజిన్‌ అదే అక్కడ ఫేమస్‌ వంట అయితే, పందికళ్లతో చేసే డిష్‌ ఒక దేశంలో ఫేమస్‌.. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌ అయిన వంటకాలు ఏంటో చూద్దామా..!

వేయించిన తూనీగ

చిన్నప్పుడు చెట్టుపై వాలిన తూనీగను పట్టుకుని తోకకు దారం కట్టి ఆడుకునే వాళ్లం.. తూనీగను వేయించి తినే దేశం ఒకటుంది. ఇది చైనాలోని నైరుతి ప్రావిన్స్‌లో చూడవచ్చు. అక్కడి ప్రజలు తూనీకలను కాల్చి తింటారు.

వేయించిన గొంగళి పురుగు

ఈశాన్య చైనా ప్రజలు వేయించిన గొంగళి పురుగులను తినడానికి ఇష్టపడతారు. వీటిని ఉడికించే ముందు నీటిలో నానబెడతారు. అప్పుడు వాటిని ఉల్లిపాయలు, అల్లంతో వంట చేస్తారు.

నల్ల చీమ

యునాన్ ప్రావిన్స్‌లో నల్ల చీమలను పంది మాంసంతో కలిపి వండుతారు. సూప్ ను పంది కాళ్లు, బ్లాక్ చికెన్, గొడ్డు మాంసం నుండి తయారు చేస్తారు.

ఫ్రైడ్ పిగ్స్ ఐస్

ఇది వియత్నాం సరిహద్దులో ఉన్న దక్షిణ చైనాలోని గ్వాంగ్జీలో ఒక సాంప్రదాయ వంటకం. మొదట పంది కళ్ళు వేయిస్తారు. తరువాత ఉప్పు, నువ్వులు, మిరపకాయలు వంటి వివిధ మసాలా దినుసులతో వండుతారు.

ఆవు పేడ సూప్

ఈ వంటకం నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్ నుంచి ఉద్భవించింది. ఇది ఆవు పేడతో తయారు చేయబడుతుంది. కానీ ఈ పేడ ఆవు పేడ కాదు. ఇది ఆవు కడుపులో కనిపించే ద్రవం.

ఎండిన ఎలుక

ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ ప్రజలు ఎండిన ఎలుకలను తినడానికి ఇష్టపడతారు. పంటలను ఎలుకల బారి నుంచి కాపాడుకునేందుకు రైతులు పట్టుకున్న ఎలుకలను తినడం ప్రారంభించారు. ఈ ఎలుకలను ఇప్పుడు అధిక ప్రోటీన్ కోసం ఉపయోగిస్తారు.

రొయ్యల సలాడ్

దీనికి ఎండు రొయ్యలతో పాటు టమోటాలు, వేరుశెనగలు, మిరపకాయలు కలుపుతారు. ఇది లావోస్, థాయిలాండ్‌లో అత్యంత ప్రజాదరణ పొందింది.

ఆక్టోపస్ ఐస్ క్రీం

ఈ పేరు వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఆక్టోపస్‌కి చాలా కాళ్లు ఉండటం వల్ల ఐస్‌క్రీమ్‌ తయరు చేసేందుకు చాలా ఇష్టపడతారు. ఆక్టోపస్‌ను ముందుగా ఐస్‌క్రీమ్‌ను తయారు చేయడానికి వండుతారు. తర్వాత ఐస్‌క్రీమ్‌లో కలుపుతారు. అందులో పాలు, పంచదార, వెనీలా ఎసెన్స్ విడివిడిగా కలుపుతారు. జపనీస్ ప్రజలు దీన్ని ఇష్టపడతారు.

తదుపరి వ్యాసం