Diabetes Control Tips: షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!
24 September 2022, 19:45 IST
- Diabetes Control Tips: నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. నడక రక్తంలోని చక్కెరను నియంత్రించడమే కాకుండా మధుమేహం వల్ల వచ్చే ఇతర ఇబ్బందులను కూడా నివారిస్తుంది.
Diabetes Control Tips
వయసు, అదుపులేని జీవనశైలి కారణంగా, మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మధుమేహం ఆకస్మికంగా వచ్చే డిసిస్ కాదు. క్రమంగా ఈ వ్యాధి శరీరంలో పెరుగుతూ ఉంటుంది. డయాబెటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే అదుపులో ఉంటుంది . దీని కోసం ఖరీదైన మందులు తీసుకోవలసిన అవసరం లేదు. మీ రోజువారీ జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఆహారం మార్చడం ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించవచ్చు. అలాగే ఉదయం పూట కొన్ని వ్యాయామం చేయాలి . ఇది మీ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం
మార్నింగ్ వాక్
నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. నడక రక్తంలోని చక్కెరను నియంత్రించడమే కాకుండా మధుమేహం వల్ల వచ్చే ఇతర ఇబ్బందులను కూడా నివారిస్తుంది. ఒక్కవేళ మీరు ప్రీ-డయాబెటిక్ అయితే, రోజు ఉదయం నడవడం వల్ల వ్యాధి ప్రబలకుండా చూసుకోవచ్చు. ఉదయం పూట కనీసం 15-20 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.
ఏరోబిక్స్
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఏరోబిక్స్ చేస్తే మధుమేహం నుంచి బయటపడవచ్చు. ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాలు,వారానికి కనీసం ఐదు రోజులు ఏరోబిక్ డ్యాన్స్ చేయండి. ఇది క్రమంగా మీలో సానుకూల మార్పును చూపుతుంది.
సైక్లింగ్
వ్యాయామంలో సైక్లింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం పూట కనీసం 15 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉండటమే కాకుండా అనేక ఇతర రుగ్మతలను కూడా నయం చేస్తుంది.
ప్రాణాయామం
ప్రతిరోజూ ఉదయం 10-15 నిమిషాలు కపాల్ భారతి, అనులోమ్ విలోమ్ వంటి ప్రాణాయామం, శ్వాస వ్యాయామం, మధుమేహాన్ని నయం చేస్తుంది. దీనితో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, స్విమ్మింగ్ కూడా డయాబెటిక్ పేషెంట్లకు బాగా ఉపయోగపడుతుంది.