తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Hair Care Routine : శీతాకాలంలో జుట్టును ఇలా కాపాడుకోండి.. లేదంటే హాం ఫట్

Winter Hair Care Routine : శీతాకాలంలో జుట్టును ఇలా కాపాడుకోండి.. లేదంటే హాం ఫట్

02 November 2022, 11:48 IST

google News
    • Winter Hair Care Routine : శీతాకాలంలో పొడివాతవరణం ఎక్కువగా ఉంటుంది. దీని ఎఫెక్ట్ జుట్టుపై ఎక్కువగా చూపిస్తుంది. పొడి వాతవరణం వల్ల చుండ్రు వచ్చేస్తుంది.. నిర్జీవంగా కనిపిస్తుంది.. ఇలాంటి సమస్యలు పెరిగి చివరికి జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అంటున్నారు. 
వింటర్లో జుట్టును ఇలా కాపాడుకోండి..
వింటర్లో జుట్టును ఇలా కాపాడుకోండి..

వింటర్లో జుట్టును ఇలా కాపాడుకోండి..

Winter Hair Care Routine : చలికాలంలో చర్మం ఎంత పొడిబారుతుందో.. జుట్టు కూడా అంతే పొడిబారుతుంది. అసలు జుట్టు మన మాట వినదనే చెప్పాలి. పొట్టు, పొడిబారడం, స్కాల్ప్ సమస్యలు, చుండ్రు వంటి అనేక జుట్టు సమస్యలు వస్తాయి. వెంట్రుకలు పొడిబారడం, కఠినమైన వాతావరణ పరిస్థితులు, కాలుష్య కారకాలకు గురికావడం వల్ల జుట్టు విరిగిపోతుంది. చివర్లు చిట్లిపోతాయి. తలలో దురద వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. స్టార్టింగ్​లోనే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో చలిపెరిగి పరిస్థితి మరింత దిగజారే అవకాశముంది.

అందుకే ముందునుంచే.. జుట్టుపై చలికాలం ప్రభావం పడకుండా శ్రద్ధ తీసుకుంటే.. దానిని కాపాడుకోవచ్చు. చుండ్రు, జుట్టు రాలడం, దురద వంటి సమస్యలను తగ్గించవచ్చు. మరి అయితే జుట్టును కాపాడుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గోరువెచ్చని నీటితో స్నానం..

చలికాలం మొదలుకాగానే అందరూ చేసే పని పొగలు వచ్చే వేడి నీటితో స్నానం చేయడం. ఇలా చేయడం వల్ల పొడిబారడం అనే సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అలా కాకుండా.. గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయండి. వేడి నీటితో తలస్నానం చేస్తే.. జుట్టు సమస్యలు మరింత తీవ్రం అవుతాయి.

హెయిర్​ను కవర్ చేయండి..

చలి తీవ్రంగా ఉండే సమయంలో, బయటకు వెళ్లే సమయంలో మీ తలను కవర్ చేయండి. తలను స్కార్ఫ్ లేదా టోపీతో కప్పి ఉంచండి. తద్వారా కఠినమైన వాతావరణం ఒత్తిడి కాస్త తగ్గుతుంది.

హెయిర్ మాస్క్‌లు

ప్రతి వారం ఏదొక DIY హెయిర్ మాస్క్ వేయండి. ఈ సీజన్లో హెయిర్ మాస్క్​లు చాలా అవసరం. ఎందుకంటే ఇవి జుట్టుకి తేమనిస్తాయి. పొడిబారడం తగ్గుతుంది. లేదంటే మీ చర్మవ్యాధి నిపుణుడి సలహాలు తీసుకుని.. ఎలాంటి మాస్క్​లు మీకు సూట్​ అవుతాయో తెలుసుకుని వారానికి ఒక్కసారైనా హెయిర్‌ మాస్క్‌ వేయండి.

జుట్టును ఎలా దువ్వాలంటే..

మొదటి నుంచి చివరకు కాకుండా.. కొంచెం కొంచెం జుట్టు తీసుకుని.. కింద నుంచి చిక్కును విడదీయాలి. అలా స్కాల్ప్ వరకు రావాలి. అంతేకానీ స్కాల్ప్ నుంచి ఓ దువ్వేస్తామంటే.. జుట్టు రాలిపోతుంది. చలికాలంలో జుట్టు ఎక్కువసార్లు దువ్వకపోవడమే మంచిది. రోజుకి ఒకటి, రెండు సార్లు దువ్వితే చాలు.

హీట్ స్టైలింగ్‌కు దూరంగా ఉండండి..

మీ జుట్టు ఇప్పటికే పొడిగా, నిస్తేజంగా, రఫ్​గా ఉంటే.. మీరు స్టైలింగ్‌ మానుకోండి. దీనివల్ల జుట్టు మరింత నాశనం అయిపోతుంది. ఇది అధికంగా జుట్టు రాలేలా చేస్తుంది.

ఈ చిట్కాలను ఇప్పటినుంచే ప్రారంభిస్తే.. మీ జుట్టును మంచిగా కాపాడుకోవచ్చు.

తదుపరి వ్యాసం