Winter Vacation : చలికాలంలో ఈ ప్రదేశాలకు ఓ ట్రిప్ వేయండి.. అలా రిలాక్స్ అయిపోతారు-best places in india for memorable winter vacation in budget ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Best Places In India For Memorable Winter Vacation In Budget

Winter Vacation : చలికాలంలో ఈ ప్రదేశాలకు ఓ ట్రిప్ వేయండి.. అలా రిలాక్స్ అయిపోతారు

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 02, 2022 09:56 AM IST

Winter Vacation Spots in India : ఫుల్ బిజీ లైఫ్​ నుంచి ఓ బ్రేక్ తీసుకుని ఎక్కడికైనా ట్రిప్​కి వెళ్లాలని చాలామందికి ఉంటుంది. పైగా చలికాలంలో కొన్ని ప్రదేశాలు భూతల స్వర్గాలను తలపిస్తాయి. మీరు కూడా ఈ ఆలోచనతోనే ఉంటే.. మిమ్మల్ని ఫిదా చేసి.. మనసుకు హాయినిచ్చే హాలీ డే స్పాట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో అక్కడికి వెళ్లండి..
చలికాలంలో అక్కడికి వెళ్లండి..

Winter Vacation Spots in India : ఇండియాలో మనం చూడాలే కానీ చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవి వీక్షకుల మనసులను కట్టిపడేస్తాయి. అదే శీతాకాలంలో అయితే చెప్పనవసరం లేదు. కొన్ని ప్రదేశాలను చూడటానికి చలికాలమే పర్​ఫెక్ట్. అయితే ఈ చలికాలంలో మీరు కూడా ఓ ఆహ్లాదకరమైన ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మీకు ఎక్కడికి వెళ్లాలనే దానిపై క్లారిటి లేకపోతే.. మీ బడ్జెట్​కు తగ్గట్లు.. ప్రకృతిని ఆస్వాదించగలిగే పలు ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకేముంది మీ డెస్టినేషన్ ఫిక్స్ అయిపోండి.. బడ్జెట్ సెట్​ చేసుకుని.. అక్కడికి వెళ్లిపోండి. భారతదేశంలోని ఏ ప్రాంతాలకు చలికాలం పర్​ఫెక్ట్ అంటే..

ట్రెండింగ్ వార్తలు

మున్నార్

కేరళలోని మున్నార్ వాతావరణం సంవత్సరంలో పన్నెండు నెలలు ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ.. శీతాకాలంలో అక్కడికి వెళ్లడం ఒక విభిన్నమైన సరదానిస్తుంది. మున్నార్‌ను దక్షిణ భారతదేశంలోని కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఉత్తమ హనీమూన్ స్పాట్‌ల జాబితాలో కూడా ఒకటి. హౌస్ బోటింగ్, టీ గార్డెన్స్, వండర్లా అమ్యూజ్‌మెంట్ పార్క్, కొచ్చి ఫోర్ట్, గణపతి టెంపుల్ అక్కడి పర్యాటకులను ఆకర్షిస్తాయి.

గుల్మార్గ్

శీతాకాలంలో పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలలో గుల్మార్గ్ ఒకటి. ఇది కాశ్మీర్​లో ఉంది. శీతాకాలంలో చుట్టూ మంచు మాత్రమే ఉంటుంది. మంచుతో గడ్డకట్టిన సరస్సు, పైన్ చెట్లు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. అక్కడ మీరు స్కీయింగ్, స్నోబోర్డింగ్​తో ఎంజాయ్ చేయవచ్చు. మీరు అడ్వాంచర్ చేయడానికి ఇష్టపడేవారైతే.. కేబుల్ రైడ్ మీకు మంచి ఎంపిక. గుల్మార్గ్ అందాలను మీరు హైదర్, ఫితూర్, రాజీ వంటి అనేక బాలీవుడ్ చిత్రాల్లో చూడవచ్చు.

డల్హౌసీ

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఉన్న దీనిని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. పర్వతాలు, జలపాతాలు, పొలాలు, నదులు ఈ ప్రదేశానికి మరింత అందాన్ని ఇస్తాయి. మీరు సుభాష్ బావోలి, బర్కోటా హిల్స్, పంచపులా కూడా సందర్శించవచ్చు. డల్హౌసీ పర్యటన మీ జీవితంలో మరపురాని క్షణాలలో ఒకటిగా నిలుస్తుంది.

జైసల్మేర్

శీతాకాలంలో రాజస్థాన్​లోని జైసల్మేర్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. లక్షలాది మంది పర్యాటకులు చలికాలంలో అక్కడికి వెళతారు. ఇక్కడ మీరు ఎడారిలో క్యాంపింగ్, పారాసైలింగ్, క్వాడ్ బైకింగ్, డూన్ బాషింగ్ వంటివి ప్రయత్నించవచ్చు. జైసల్మేర్ కోట, థార్ హెరిటేజ్ మ్యూజియం, జైన్ టెంపుల్, నత్మల్ కి హవేలీ, గడిసర్ సరస్సు మొదలైన వాటిని కూడా సందర్శించవచ్చు. Dajets Safariని ఆస్వాదించడం అస్సలు మర్చిపోవద్దు.

ఔలి

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న ఔలి.. దేశంలోని అత్యంత అందమైన స్కీయింగ్ గమ్యస్థానాలలో ఒకటి. సాహసాలను ఇష్టపడే పర్యాటకులు ఏటా లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఉత్తరాఖండ్ టూరిజం డిపార్ట్‌మెంట్ ఇక్కడ శీతాకాలపు క్రీడల పోటీని నిర్వహిస్తుంది. మీరు కూడా దీనిలో భాగం కావచ్చు. ఇక్కడ నుంచి మీరు నందా దేవి, కామత్ పర్వతాలను చూడొచ్చు.

WhatsApp channel

టాపిక్