తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blood Group Food: మీ బ్లడ్ గ్రూప్ ప్రకారం మీరు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో, ఎలాంటివి తినకూడదో తెలుసుకోండి

Blood Group Food: మీ బ్లడ్ గ్రూప్ ప్రకారం మీరు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో, ఎలాంటివి తినకూడదో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

28 September 2024, 9:30 IST

google News
    • Blood Group Food: మన బ్లడ్ గ్రూపును బట్టి మనం తినాల్సిన ఆహారం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కో బ్లడ్ గ్రూపు వారు ఒక్కో రకమైన ఆహారాన్ని తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.
బ్లడ్ గ్రూపును బట్టి తినాల్సిన ఆహారాలు
బ్లడ్ గ్రూపును బట్టి తినాల్సిన ఆహారాలు (Pixabay)

బ్లడ్ గ్రూపును బట్టి తినాల్సిన ఆహారాలు

Blood Group Food: ఆధునిక కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే వారిలో రోగనిరోధక శక్తి స్థాయిలు కూడా తక్కువగా ఉంటున్నాయి. కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడమే సరిపోతుందనుకుంటున్నారు, కానీ ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం మీ బ్లడ్ గ్రూపును బట్టి మీరు ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు. రోగనిరోధక శక్తి కూడా బలంగా మారుతుంది. మీ రక్త రకాన్ని బట్టి ఎలాంటి ఆహారాన్ని తినాలో, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

బ్లడ్ గ్రూపులు ఒక్కొక్కరివి ఒక్కో రకం ఉంటాయి. మీ బ్లడ్ గ్రూపును బట్టి మీరు తినాల్సిన ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు తినే ఆహారం మీ బ్లడ్ గ్రూప్ డైట్‌కు తగినట్టు ఉండాలి. మీ బ్లడ్ గ్రూపు మీరు తినే ఆహారాన్ని అంగీకరించకపోతే అది శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. వికారం, వాంతులు, విరేచనాలు, పొట్టనొప్పి, గ్యాస్టిక్ సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీ బ్లడ్ గ్రూప్ ప్రకారం మీరు ఎలాంటి ఆహారాన్ని తినాలో తెలుసుకోండి.

A బ్లడ్ గ్రూప్ తినాల్సిన ఆహారం

ద్రాక్షపండ్లు

బ్లూబెర్రీస్

నేరేడు పండ్ల

గుమ్మడికాయ

క్యారెట్లు

సోంపు గింజలు

బ్రోకోలి

గుడ్లు

సోయా ఉత్పత్తులు

చెర్రీ పండ్లు

తినకూడని ఆహారం

ఏ బ్లడ్ గ్రూప్ వారు బీన్స్, వంకాయలు, టమాటోలు తక్కువగా తినాలి.

B బ్లడ్ గ్రూప్ వారు తినాల్సినవి

బీట్రూట్

కాటేజ్ చీజ్

పెరుగు

బాదం

ద్రాక్ష పండ్లు

వంకాయలు

మిరియాలు

కిడ్నీ బీన్స్

మటన్

ఆవు పాలు

తినకూడనివి

B బ్లడ్ గ్రూప్ ఉన్నవారు చికెన్, మొక్కజొన్న, సోయా ఉత్పత్తులు, పప్పు ఉత్పత్తులు తక్కువగా తింటే మంచిది.

AB బ్లడ్ గ్రూపు ఉన్నవారు తినాల్సినవి

మటన్

రెడ్ వైన్

వెల్లుల్లి

పీనట్ బటర్

పాలు

పెరుగు

అంజీర్

పప్పు

గుడ్లు

ఆక్రోట్లు

కాలీఫ్లవర్

పుచ్చకాయలు

తినకూడనివి

మొక్కజొన్నలు, చికెన్, అరటి పండ్లు వంటివి AB బ్లడ్ గ్రూపు వారు తక్కువగా తినాలి.

O బ్లడ్ గ్రూప్ వారు తినాల్సినవి

చికెన్

ఉల్లిపాయలు

పాలకూర

ఆలివ్ నూనె

అల్లం

మటన్

వెన్న

అరటిపండ్లు

చేపలు

మామిడికాయలు

బాదం

తినకూడనివి

గోధుమ పిండితో చేసిన ఆహారాలు, సోయాబీన్ నూనెతో వండిన పదార్థాలు, కిడ్నీ బీన్స్ వంటివి తక్కువగా తినాలి.

పైన చెప్పిన సారాంశాన్ని బట్టి మీ బ్లడ్ గ్రూప్‌కు తగ్గ ఆహారాన్ని ఎంచుకొని తింటే మీకు ఆరోగ్య సమస్యలు తక్కువగా వస్తాయి.

తదుపరి వ్యాసం