DIY Pink Salt Scrub। పింక్ సాల్ట్‌తో మీ చర్మం మిలమిల.. మీకు మీరుగా ఫేస్ స్క్రబ్ తయారు చేసుకోండిలా!
24 January 2023, 18:00 IST
- DIY Pink Salt Scrub: పింక్ సాల్ట్‌తో మీకు మీరుగా ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇక్కడ తెలుసుకోండి.
DIY Pink Salt Scrub
చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండాలంటే సరైన చర్మ సంరక్షణ అవసరం. మీరు అనుసరించే సంరక్షణ విధానాలలో చర్మాన్ని స్క్రబ్బింగ్ చేయడం ఎంతో ముఖ్యం. స్క్రబ్బింగ్ చేయడం చర్మంలో దెబ్బతిన్న కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. మార్కెట్లో ఎన్నో రకాల స్క్రబ్‌లు అందుబాటులో ఉంటాయి, కొన్ని ఉత్పత్తులు చాలా ఖరీదైనవి కూడా ఉంటాయి. అయితే తక్కువ ధరలో పింక్ సాల్ట్ అతి గొప్ప స్క్రబ్‌లాగా ఉపయోగపడుతుంది. పింక్ సాల్ట్‌లో అనేక రకమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో తోడ్పడతాయి.
పింక్ సాల్ట్‌ను ఉపయోగించి మీకు మీరుగా ఒక అద్భుతమైన ఫేస్ స్క్రబ్‌ను తయారు చేసుకోవచ్చు. ఇలా పింక్ సాల్ట్‌తో చేసిన స్క్రబ్ ఉపయోగించడం ద్వారా మీ చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. చర్మం శుభ్రపడుతుంది. మెరిసే తాజా చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. మరి పింక్ సాల్ట్‌తో స్క్రబ్ ఎలా తయారు చేయాలో, దానిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూడండి.
DIY Pink Salt Scrub- ఫేస్ స్క్రబ్ తయారు చేయడం
చర్మ సంరక్షణ కోసం పింక్ సాల్ట్ ను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు, అయితే దీనిని స్క్రబ్‌గా ఉపయోగించడం అన్నింటికంటే సులభమయిన, ఉత్తమమైన మార్గం. ఇందుకోసం మీరు ఒక గిన్నెలో పింక్ సాల్ట్ తీసుకొని అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలపండి. అలాగే కొంచెం తేనె వేసి పొడిగా ఉండే మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.
ఉపయోగించండం ఇలా
అన్నీ మిక్స్ చేసిన తర్వాత, దానిలో కొంత భాగాన్ని తీసుకుని, వృత్తాకార కదలికలో మీ ముఖం మీద మసాజ్ చేయండి. చర్మంపై కఠినంగా రుద్దవద్దని గుర్తుంచుకోండి, తేలికపాటి స్క్రబ్ చేయండి చాలు. ఇలా కాసేపు చేసిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. అనంతరం, మీరు మాయిశ్చరైజర్ లేదా ఫేస్ సీరమ్ ఉపయోగించవచ్చు.
శరీరానికి ఎలా ఉపయోగించాలి
ఒక కప్పు పింక్ సాల్ట్ తీసుకుని అందులో కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దీనిని బాడీ స్క్రబ్‌గా ఉపయోగించండి. ఇది మృతకణాలను తొలగిస్తుంది, అలాగే దురదను కూడా నయం చేసే గొప్ప ఎక్స్‌ఫోలియేటర్. మీరు పొరలుగా ఉండే చర్మంతో ఇబ్బంది పడుతుంటే, తప్పకుండా ఈ స్క్రబ్‌ని ప్రయత్నించండి.
పింక్ సాల్ట్ స్క్రబ్ ప్రయోజనాలు
ఈ స్క్రబ్ చర్మంలో ఉన్న టాక్సిన్స్‌ను తొలగిస్తుంది, దీని కారణంగా చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. పెరుగుతున్న వయస్సుతో పాటు చర్మం వదులుగా ఉండటం ప్రారంభమవుతుంది, ఈ సందర్భంలో పింక్ సాల్ట్ స్క్రబ్ ఉపయోగించడం ద్వారా ఇది చర్మం బిగుతుగా మారేందుకు కొత్త కణాల వేగవంతమైన పెరుగుదలకు సహాయపడుతుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి మీరు దీన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి.
గమనిక- ఈ స్క్రబ్‌ని అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కానీ రోజూ వాడకుండా ఉండండి, ఎందుకంటే మీరు దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించినప్పుడు మీ చర్మం దెబ్బతింటుంది.
టాపిక్