Intercourse Tips : ఎన్ని నిమిషాలు శృంగారం చేస్తే మంచిది? టెక్నిక్స్ ఏంటి?
17 November 2023, 19:30 IST
- Intercourse Tips Telugu : సెక్స్ అనేక మానసిక, శారీరక ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే సెక్స్‌లో ఎంతసేపు ఉంటే బాగుంటుందనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు?
ప్రతీకాత్మక చిత్రం
సెక్స్ వల్ల స్త్రీ పురుషులిద్దరికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారానికి రెండు లేదా మూడు సార్లు సెక్స్‌లో పాల్గొనేవారు గుండె జబ్బులు, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే సెక్స్‌లో ఎంత ఎక్కువ కాలం ఉంటే మంచిదని చాలా మందికి సందేహం. ఇక రొమాన్స్ ఎంతకాలం సాగుతుందనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే చాలా మంది ఈ విషయానికి ఇంట్రస్ట్ చూపించడం లేదు.
పురుషులు సాధారణంగా శృంగారం మెుదలుపెట్టాక.. 5-10 నిమిషాల తర్వాత స్కలనం చేస్తారని నిపుణులు అంటున్నారు. అయితే మరికొందరు 2 నిమిషాల్లో కూడా చేసేస్తారు. పరిశోధన ప్రకారం 3 నుండి 13 నిమిషాల వరకు సంభోగం సాధారణమైనది. మూడు నుండి ఏడు నిమిషాల సంభోగం సరిపోతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే ఏడు నుంచి పదమూడు నిమిషాల మధ్య సంభోగం భాగస్వామి హ్యాపీగా ఫీలయ్యేలా చేస్తుంది.
సెక్స్‌లో ఎంత సేపు ఉన్నా మంచి ఆనందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మంచి సెక్స్‌లో పాల్గొనడానికి భాగస్వాములిద్దరూ దాని గురించి మాట్లాడుకోవాలి. ఒకరికొకరు ఏది మంచిదో తెలియజేసుకోవాలి. శృంగారంపై చర్చ జరగాలి. మీ ఊహలను కూడా పంచుకోవచ్చు.
లైంగిక అనుభవం అంటే సెక్స్ మాత్రమే కాదు. ఫోర్ ప్లే కూడా అంతే ముఖ్యం. కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో సంతోషం కూడా అంతే ముఖ్యం. సెక్స్ సమయంలో మీ భావోద్వేగాలను వ్యక్తపరచడం చాలా సహాయపడుతుంది.
ఫోర్ ప్లే మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. ఇది సంభోగానికి ముందు జరిగే లైంగిక చర్య. ఇది మీ భాగస్వామితో మానసిక సాన్నిహిత్యాన్ని పెంపొందించడానికి మీకు సహాయపడుతుంది. ఇది మీ భాగస్వామిలో లైంగిక కోరికలను ప్రేరేపించడంలో కూడా సహాయపడుతుంది.
సెక్స్ కఠినంగా ఉండవలసిన అవసరం లేదు. మీరు ఎక్కువ కాలం చేసేందుకు నెమ్మదిగా చేయాలి. మీ స్టామినా పెరిగిన తర్వాత ఎక్కువసేపు సెక్స్ చేయవచ్చు. దీనికోసం ఎక్కువ వ్యాయామం చేయాలి. పెల్విక్ వ్యాయామాలు దీనికి చాలా సహాయపడతాయి.
మీకు ఏం కావాలో మీ భాగస్వామికి చెప్పండి. ఇది సెక్స్ నాణ్యతను పెంచడానికి మంచి మార్గం. ఎక్కువ కాలం సెక్స్‌లో పాల్గొంటే అంత బాగా అనిపించవచ్చు.. కానీ కొందరికి అలా ఉండకపోవచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది చాలా సమస్యలను కలిగిస్తుంది. సుదీర్ఘమైన సంభోగం యోని ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది. యోని నొప్పి, వాపునకు కూడా దారితీస్తుంది. ఎక్కువసేపు సెక్స్ చేస్తే యోని పొడిగా తయారై.. ఘర్షణకు కారణమవుతుంది. ఇది నొప్పికి దారితీస్తుంది. ఎక్కువ సేపు సెక్స్ చేయడం వల్ల శారీరక అలసట వస్తుంది.