Better Sex : గ్రేట్ సెక్స్‌లో ఈ 5 విషయాలు ఉంటాయి.. మీ జీవితంలో ఎన్ని ఉన్నాయి?
Great Sex Tips : ఎన్నిసార్లు చేసినా.. మళ్లీ కొత్తగా అనిపించేది శృంగారం. అలాంటి విషయాన్ని అంత ఈజీగా తీసుకోవద్దు. అలాగే కొన్ని రకాల తప్పులూ చేయెుద్దు. వాటి గురించి తెలుసుకుందాం..
గ్రేట్ సెక్స్ అంటే కేవలం శృంగారం చేయడం మాత్రమే కాదు. ఇందులో తాకడం, మాట్లాడటం, ఆసక్తికరమైన ఫోర్‌ప్లే కూడా ఉండాలి. సెక్స్ విషయంలో దంపతులు తరచుగా కొన్ని తప్పులు చేస్తుంటారు. కొందరు శృంగారంలో దూకుడుగా వ్యవహరిస్తారు, మరికొందరు అదే పాత పద్ధతిని ఎంచుకుంటారు. తమ లైంగిక అనుభవాన్ని మరింత దిగజార్చుకుంటారు. సెక్స్ సమయంలో ఏం చేయాలో జంటలకు తెలియనప్పుడు, సెక్స్ నిపుణులు కొన్ని సలహాలను అందిస్తారు. అలాంటివే కొన్ని ఇక్కడ ఉన్నాయి.. తెలుసుకోండి.
ట్రెండింగ్ వార్తలు
సెక్స్‌ను ఎంజాయ్ చేసే జంటలు.. కచ్చితంగా శృంగార సమయంలో మాట్లాడుకుంటారు. మాట్లాడుకోవడమే కాదు, సంభోగం సమయంలో సెక్స్ సంబంధిత విషయాలను ఒకరి చెవుల్లో ఒకరు గుసగుసలాడుకుంటారు. మంచి సెక్స్ కోసం మంచి కమ్యూనికేషన్ అవసరం. ఇది మీ ఇద్దరి ఇష్టాలు, అయిష్టాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
శృంగారానికి ముందు ఫోర్ ప్లే తప్పనిసరి. నేరుగా మ్యాటర్‍లోకి వెళ్తే.. ఆడవాళ్లకు అస్సలు నచ్చదు. సెక్స్ సమయంలో ఆనందం పొందాలంటే ఫోర్ ప్లేను ఎంజాయ్ చేయాలి. ఇది ఉత్సాహం, సాన్నిహిత్యాన్ని సృష్టిస్తుంది. జంటలు ఒకరి శరీరాన్ని మరొకరు అన్వేషించుకోవాలి. గాలికి కూడా గ్యాప్ ఇవ్వకూడదు. ముద్దుపెట్టుకోవడానికి, అణువణువు తాకడానికి కచ్చితంగా సమయాన్ని కేటాయించాలి.
ఎప్పుడూ ఒకేలా శృంగారం చేస్తే మీ భాగస్వామికి సంతోషం ఉండదు. అందుకే కొత్త కొత్త భంగిమల్లో ప్రయత్నించాలి. మెరుగైన సెక్స్ అనేది విభిన్న భంగిమల్లోనే ఉంటుంది. ఇది మీకు, మీ భాగస్వామికి కొత్త అనుభూతిని కలిగిస్తుంది. రోజూ చేసిన విధంగానే చేస్తే.. చాలా త్వరగా నీరసం వస్తుంది. కొత్త పద్ధతులను అన్వేషిస్తే.. ఇంకా చేయాలనే తపన పెరుగుతుంది.
గొప్ప ప్రేమికులు శృంగార సమయంలో తొందరపడరు, ఇదే నిజం. వారు నెమ్మదిగా చేస్తారు. వేగవంతమైన, కఠినమైన సెక్స్ కంటే నెమ్మదిగా చేయడం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. శృంగారం సమయంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి. ఆనందంపై దృష్టి పెట్టేలా చూసుకోవాలి. అందుకే వేగం వద్దు.
బెడ్‌పై ప్రయోగాలు చేయడం ఎప్పటికీ ఆపవద్దని సెక్స్ థెరపిస్ట్‌లు సలహా ఇస్తారు. వివిధ రకాల సెక్స్ టాయ్‌లు, ల్యూబ్, ఇతర సెక్స్ ఉపకరణాలు మీ సెక్స్ రొటీన్‌కు భిన్నంగా ఉంటాయి. ఈ సెక్స్ టాయ్‌లను ఎలా వాడాలో, సెక్స్‌ను మరింత మెరుగ్గా ఎలా చేయాలో గ్రేట్ సెక్స్ చేసే వాళ్లకు బాగా తెలుసు. ప్రతీ విషయాన్ని ఆస్వాదించాలి.
టాపిక్