జీవిత భాగస్వాముల మధ్య సెక్స్ అనేది చాలా కీలకమైన విషయం. పురుషులు, స్త్రీలు.. ఇద్దరికీ శృంగారం ముఖ్యమే. అయితే, శృంగారంలో పాల్గొని ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ ఇస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సెక్స్‌కు ఎక్కువ కాలం దూరంగా ఉంటే కొన్ని రకాల దుష్ప్రభావాలు కలిగే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కాలం శృంగారానికి దూరంగా ఉంటే సెక్స్ లైఫ్‍పై ఎక్కువగా ప్రభావం పడుతుంది. సుదీర్ఘ కాలం సెక్స్ చేయకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవో ఇక్కడ చూడండి.
తరచూ సెక్స్‌లో పాల్గొంటే లైంగిక వాంఛ మెరుగ్గా ఉంటుంది. ఒకవేళ శృంగారం మధ్య ఎక్కువ గ్యాప్ వస్తే కోరికలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ కాలం సెక్స్‌లో పాల్గొనకుంటే వాంఛ తగ్గుతుంది. మళ్లీ సెక్స్‌లో పాల్గొనే సమయంలో కోరికను పొందడం కష్టమవుతుంది. అందుకే శృంగారం మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా జీవిత భాగస్వాములు జాగ్రత్తపడడం మేలు.
పురుషులు ఎక్కువ కాలం సెక్స్‌కు దూరంగా ఉంటే అంగస్తంభన సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే ఆ సమస్య ఉంటే మరింత ఎక్కువ అవుతుంది. సాధారణంగా తరచూ లైంగిక చర్యలో పాల్గొంటే పురుషాంగానికి రక్తప్రవాహం ఎక్కువై అంగస్తంభన సమస్య తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే, ఎక్కువ కాలం శృంగారానికి దూరంగా ఉంటే ఈ సమస్య పెరగొచ్చు.
ఎక్కువ కాలం గ్యాప్ ఇస్తే.. మళ్లీ సెక్స్‌లో పాల్గొన్నప్పుడు సరిగా పర్ఫార్మ్ చేయగలమా.. భాగస్వామిని సంతృప్తి పరచగలమా అనే సందేహాలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. లైంగిక పరంగా ఆందోళన పెరుగుతుంది. గతంలోలా శృంగారం చేయగలమా అనే డౌట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
సెక్స్‌కు మహిళ ఎక్కువ కాలం దూరంగా ఉంటే యోని పొడిబారే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ కారణంగా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ శృంగారంలో పాల్గొన్నప్పుడు సంభోగానికి అసౌకర్యంగా ఉండొచ్చు. ఎక్కువ నొప్పిగా కూడా ఉండే రిస్క్ ఉంటుంది. రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొంటే సంభోగం సులభతరంగా ఉంటుంది.
జీవిత భాగస్వాములు ఎక్కువ కాలం సెక్స్‌కు దూరంగా ఉంటే వారి మధ్య ఎమోషనల్ బంధం తగ్గే అవకాశాలు ఉంటాయి. చిరాకు, అసంతృప్తి అధికమవుతాయి. మొత్తంగా సరైన శృంగారం లేకపోతే లైఫ్ పార్ట్‌నర్స్ మధ్య బంధం అసంతృప్తికరంగా ఉంటుంది. గొడవలకు కూడా కారణం కావొచ్చు.
రెగ్యులర్‌గా సెక్స్ చేస్తే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ (కటి కండరాలు) దృఢత్వం పెరుగుతుంది. బ్లాడర్ సహా పెల్విక్ అవయవాలకు ఇది సపోర్టింగ్‍గా ఉంటాయి. సెక్స్‌కు ఎక్కువ కాలం దూరంగా ఉంటే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనమయ్యే ఛాన్స్ ఉంటుంది.
టాపిక్