తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Binge Eating | ఆహారం అతిగా తింటే అనర్థమే.. అసౌకర్యం నుంచి బయటపడే మార్గాలివిగో!

Binge Eating | ఆహారం అతిగా తింటే అనర్థమే.. అసౌకర్యం నుంచి బయటపడే మార్గాలివిగో!

HT Telugu Desk HT Telugu

14 June 2023, 15:39 IST

google News
    •  Binge Eating: అతిగా తినడం మీ శరీరాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. కేవలం కేలరీలు పెరగటం లేదా బరువు పెరగటం మాత్రమే కాదు అంతకుమించిన దుష్ప్రభావాలు ఉండవచ్చు
Binge eating impact
Binge eating impact (istock)

Binge eating impact

Binge Eating: కొన్నిసార్లు ఆహారం రుచిగా ఉందనో లేదా ఏదైనా ఒత్తిడి వల్లనో లేదా టీవీ చూస్తూనో మన తినాల్సిన దానికంటే అతిగా తినేస్తాం. కొందరిగా అతిగా తినే అలవాటు కూడా ఉంటుంది, అయితే ఇది ఏదైనా అనారోగ్య సమస్యకు సూచిక కావచ్చు. నిజానికి మీ కడుపు నిండింది అని మీ మెదడుకు కడుపు సిగ్నల్ పంపడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుంది. కానీ ఈలోపు తెలియకుండానే అతిగా తినేయవచ్చు. కారణమేదైనా సరే మీరు ఆహారాన్ని అతిగా తిన్నప్పుడు అది కొన్ని అనర్థాలకు దారితీస్తుంది.

అతిగా తినడం మీ శరీరాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. కేవలం కేలరీలు పెరగటం లేదా బరువు పెరగటం మాత్రమే కాదు అంతకుమించిన దుష్ప్రభావాలు ఉండవచ్చు. అతిగా తిన్న తర్వాత మీ కడుపులో అసౌకర్యంతో పాటు ఇతర సమస్యలు ఉంటాయి. ఇవి శారీరకమైనవి, మానసికమైనవి కూడా అయి ఉండవచ్చు.

ఎప్పుడైనా అతిగా తిన్న తర్వాత సాధారణంగా ఎలాంటి అనుభూతి ఉంటుందో ఇక్కడ ఓసారి గమనించండి.

శారీరక అసౌకర్యం

అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం లేదా అజీర్ణం వంటి భావాలు కలుగుతాయి. మీరు శారీరకంగా అలసిపోయినట్లుగా, కదలలేనట్లుగా అనిపించవచ్చు లేదా ప్రేగు కదలికలలో కూడా మార్పులను అనుభవించవచ్చు.

భావోద్వేగ బాధ

అతిగా తినడం వలన మీలో ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. ఇది మీకు ఏదైనా విషయంలో అపరాధం, అవమానం లేదా నిరాశ భావాలను కలిగిస్తుంది. మీకు ఇలాంటి ఆలోచనలు రావడానికి మీ ఆహారం కారణం అని మీకు తెలియకపోవచ్చు.

మానసిక సమస్యలు

అతిగా తినడం వలన మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతుంది, మీలో ఒత్తిడి ఆందోళనలు మరింత పెరగవచ్చు, ఆత్మగౌరవంకు సంబంధించిన ఆలోచనలు, బాధ మొదలైనవి ఉండవచ్చు. మీ మూడ్ చెడిపోవచ్చు.

శక్తి హెచ్చుతగ్గులు

ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు, ఇది అలసట లేదా శక్తిహీనమైన భావనలకు దారితీస్తుంది.

నిద్ర చెదిరిపోతుంది

అతిగా తినడం మీ నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. మీ నిద్ర చక్రాలను నియంత్రించే మీ సిర్కాడియన్ గడియారం రోజంతా మీ నిద్ర, ఆకలి హార్మోన్ స్థాయిలు పెరగడానికి, తగ్గడానికి బాధ్యత వహిస్తుంది. అతిగా తినడం వల్ల ఈ లయ దెబ్బతింటుంది, దీంతో ఆ రాత్రంతా నిద్రపోవడం మీకు కష్టమవుతుంది.

కోలుకునే మార్గం

అతిగా తిన్న తర్వాత ఆ పరిస్థితి నుంచి ఆప్పటికప్పుడు ఎలా కోలుకోవచ్చో నిపుణులు ఇచ్చిన సలహాలు ఇక్కడ తెలుసుకోండి.

- కొన్ని లోతైన శ్వాసలను తీసుకోండి

- మీకు వీలైతే, సౌకర్యవంతమైన దుస్తులను మార్చుకోండి

- అతిగా తర్వాత మీలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా అని కొన్ని నిమిషాలు గమనించండి

- అతిగా తినప్పుడు ప్రతికూల ఆలోచనలు చేయకుండా అంతా మంచే జరుగుతుందనే భావనలో ఉండండి.

మీరు అతిగా తినేస్తున్నారు అని భావిస్తే, మీరు తినడానికి ముందు, ఆ తర్వాత నీరు తాగండి. పరధ్యానంలో తినకండి, ఆహారంపై దృష్టిపెట్టి తినండి. నెమ్మదిగా నములుకుంటూ ఆహారం తినండి. చిరుతిళ్లను తగ్గించండి, ఆరోగ్యకరమైన ఆహరం తినండి, ఆరోగ్యంగా ఉండండి.

తదుపరి వ్యాసం