తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wrong Food Combination: పాలు, ఉల్లిపాయ కలిపి వాడకూడదా? ఆయుర్వేద నియమం ఇదే

Wrong food combination: పాలు, ఉల్లిపాయ కలిపి వాడకూడదా? ఆయుర్వేద నియమం ఇదే

11 September 2024, 12:30 IST

google News
  • Wrong food combination:: పాలు, ఉల్లిపాయల కలయికతో తయారు చేసిన పాస్తా హానికరమని చెబుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చాలా వైరల్ అవుతున్నాయి. ఇది నిజంగా హానికరమా? ఆయుర్వేదం ఏం చెబుతుందో తెల్సుకుందాం.

పాలు, ఉల్లిపాయ కాంబినేషన్
పాలు, ఉల్లిపాయ కాంబినేషన్ (Shutterstock)

పాలు, ఉల్లిపాయ కాంబినేషన్

రకరకాల రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఏదైనా ట్రెండింగ్ లో ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరూ దానికి సంబంధించిన కంటెంట్‌ వీడియోలు తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు సోషల్ మీడియాలో వైట్ సాస్ పాస్తా గురించి అనేక రీల్స్ లేదా పోస్టులను చూసే ఉండొచ్చు. ఇందులో ఈ పాస్తా తినడం మీ ఆరోగ్యానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని చెబుతుంటారు. అయితే ఇది నిజంగా కరెక్టేనా? తెలుసుకుందాం

నిజంగా హానికరమా?

పాస్తా సాస్ తయారు చేయడానికి పాలను ఉపయోగిస్తారు. దీని రుచిని పెంచడానికి ఉల్లిపాయను కూడా వాడతారు. ఇలా ఉల్లిపాయ, పాలు కలిపి తినడం వల్ల తీవ్రమైన హాని జరుగుతుంది. వాస్తవానికి, ఆయుర్వేదంలో దీన్ని విరుద్ధమైన ఆహారం కలయికగా పరిగణిస్తారు. కాబట్టి ఈ కాంబినేషన్‌లో ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి అనేక నష్టాలు కలుగుతాయి.

ఇదీ కారణమే:

ఈ రోజుల్లో అనేక వ్యాధులు చుట్టుముట్టేస్తున్నాయి. వీటికి గల కారణాల్లో తప్పుగా ఆహార కలయికలు తీసుకోవడం కూడా ఒకటి. పండ్లను పాలు కలిపి షేక్స్ చేసి తాగడమూ అలవాటుగా మారిపోయింది. ఇలా పాస్తాల లాంటి వెస్టర్స్ ఫుడ్స్ కోసం ఉల్లిపాయ, పాలు కలిపి వాడతారు. ఇలా తప్పుడు ఆహార కలయికలు తినడం వల్ల పూర్తి ఆరోగ్యం, చర్మం, జుట్టు దెబ్బతింటుంది.

ఏ నియమం పాటించాలి?

పాలు, ఉల్లిపాయలు తినడానికి మధ్య కనీసం మూడు నుంచి నాలుగు గంటల సమయం ఉండాలని నివేదికలు చెబుతున్నాయి. లేకపోతే, ఇది మీ రోగనిరోధక శక్తిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ కలయికలో ఉన్న ఆహారాల్ని పదేపదే తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు. అలాగే పాలు తాగి కనీసం గంట విరామం తీసుకున్న తర్వాతే పండ్లు తినడం మంచిది.

టాపిక్

తదుపరి వ్యాసం