బరువు తగ్గేందుకు పాస్తా తినొచ్చు.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Photo: Unsplash
By Chatakonda Krishna Prakash Dec 12, 2023
Hindustan Times Telugu
బరువు తగ్గాలనుకునే (వెయిట్ లాస్) వారు పాస్తా తప్పకుండా తినొచ్చు. అయితే, కొన్ని తప్పులు మాత్రం చేయకూడదు. వెయిట్ లాస్ కావాలనుకుంటున్న వారు పాస్తా విషయంలో చేయకూడని పొరపాట్లు ఇవే.
Photo: Pexels
ఎక్కువగా షుగర్, ఫ్యాట్, క్యాలరీలు ఉండే సాస్‍లను వేసి పాస్తాను వండుకోకూడదు. ఈ సాస్‍ల వల్ల బరువు తగ్గే అవకాశాలు తగ్గిపోతాయి.
Photo: Pexels
కూరగాయలను వేయకుండా పాస్తాను వండకూడదు. వెజిటబుల్స్ వల్ల శరీరానికి ఎక్కువ ఫైబర్ సహా పోషకాలు అందుతాయి. అందుకే పాస్తాలో తప్పకుండా కూరగాయలు వేసుకోవాలి.
Photo: Pexels
పాస్తాలో క్రీమ్, చీజ్‍ను ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు.
Photo: Pexels
పాస్తానే కదా అనీ మరీ ఎక్కువగా తినకూడదు. 80 శాతం కడుపు నిండే వరకే తింటే బరువు తగ్గేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
Photo: Pexels
ఒకవేళ డిన్నర్ కోసం పాస్తాను తీసుకుంటే రాత్రి ఆలస్యంగా తినకూడదు. రాత్రి 7 గంటలోపే తింటే బెస్ట్.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి