Restaurant Onions: రెస్టారెంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా జ్యూసీగా ఎందుకుంటాయి? వాళ్ల సీక్రెట్స్ ఇవే-why restaurant raw onions taste crunchy and tasty know these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Restaurant Onions: రెస్టారెంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా జ్యూసీగా ఎందుకుంటాయి? వాళ్ల సీక్రెట్స్ ఇవే

Restaurant Onions: రెస్టారెంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా జ్యూసీగా ఎందుకుంటాయి? వాళ్ల సీక్రెట్స్ ఇవే

Koutik Pranaya Sree HT Telugu
Sep 09, 2024 06:00 AM IST

Restaurant Onions: రెస్టారెంట్లలో భోజనం కన్నా ముందు ఇచ్చే ఉల్లిపాయల సలాడ్ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఉల్లిపాయలు కట్ చేస్తే ఆ రుచి రాదు. అలాంటి రుచి ఇంట్లోనూ రావాలంటే కొన్ని సీక్రెడ్ టిప్స్ పాటించండి.

ఉల్లిపాయ సలాడ్ రుచిగా రావడానికి టిప్స్
ఉల్లిపాయ సలాడ్ రుచిగా రావడానికి టిప్స్

రెస్టారెంట్లలో ఏం ఆర్డర్ చేసినా ముందు మన టేబుల్ మీద పెట్టేది ఉల్లిపాయ ముక్కలు. కొంతమందైతే ఆర్డర్ వచ్చేలోపు ఈ ఉల్లిపాయల్ని ఇష్టంగా తినేస్తారు. ఉల్లిపాయ మీద ఉప్పు, నిమ్మరసం పిండుకునే వాళ్లు చాలామందే ఉంటారు. అయితే ఇంట్లో కూడా ఏదైనా స్పెషల్ వంటకం చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి తింటే రెస్టారెంట్లో ఉల్లిపాయల రుచి రాదు.

రెస్టారెంట్లలో ఇచ్చే పచ్చి ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా, జ్యూసీగా, ఘాటు తక్కువగా ఉంటాయి. ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు తింటే ఒక్కోసారి కళ్లలో నుంచి నీళ్లు కూడా వచ్చేస్తాయి. అలాంటి రుచి రానే రాదు. మంచూరియా, చికెన్‌తో చేసిన స్నాక్స్, ఏవైనా వెజ్ స్నాక్స్ లాంటివి తెచ్చుకున్నప్పుడు తినడానికి ఉల్లిపాయలకు అలాంటి రుచే రావాలంటే రెస్టారెంట్లలో వాళ్లు ఏం చేస్తారో తెల్సుకోండి.

నీళ్లలో నానబెట్టడం

పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉంటుంది. వాటివల్లే ఉల్లిపాయలకు ఘాటుదనం వస్తుంది. అయితే వంటల్లో వేసి వేడి చేసినప్పుడు ఆ ఘాటు తగ్గుతుంది. అయితే పచ్చి ఉల్లిపాయలు కూడా రుచిగా, ఘాటు తక్కువగా రావాలంటే చిన్న ముక్కలుగా, గుండ్రంగా కట్ చేసి ఐస్ వాటర్ లో కనీసం పది నిమిషాలు ఉంచాలి. దీంతో ఘాటు తగ్గి రుచి పెరుగుతుంది. ముక్కలు క్రంచీగా అవుతాయి.

ఉప్పుతో కోటింగ్

నీళ్లలో నానబెట్టడం వల్ల వచ్చే క్రంచీ తనం ఉల్లిపాయలకు రాకుండా ఘాటు తగ్గాలంటే మరో మార్గం ఉంది. ఉల్లిపాయ ముక్కల మీద ఉప్పు చల్లి బాగా కలపాలి. పావుగంటయ్యాక ఉప్పు కాస్త చేత్తో తుడిచేసి తింటే ఘాటు ఉండదు. రుచీ పెరుగుతుంది.

నిమ్మరసం

ఉల్లిపాయ ముక్కలను తినేకన్నా పది నిమిషాల ముందు కాస్త నిమ్మరసం చల్లి పక్కన పెట్టాలి. సిట్రస్ రసాలు ఉల్లిపాయ లోని ఘాటును తగ్గిస్తాయి. రుచి పెంచుతాయి. ఇలా చేసిన ముక్కల్ని తాజా సలాడ్లలో వాడితే మంచి రుచి వస్తుంది.

వెనిగర్

ఉల్లిపాయ ముక్కల్ని వెనిగర్ లో అయిదు నిమిషాలు నానబెట్టి తర్వాత నీటితో కడిగేసి తిన్నా కూడా ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా, జ్యూసీగా ఉంటాయి.

ఉల్లిపాయ రకం

మన దగ్గర ఎక్కువగా అందుబాటులో ఉండేవి తెలుపు, గులాబీ రంగు ఉల్లిపాయలు. మీకు క్రంచీగా, కాస్త తీపిగా ఉండే ఉల్లిపాయలు నచ్చితే గులాబీ రకం ఎంచుకోవచ్చు. తెలుపు రంగు ఉల్లిపాయలు అంత క్రంచీగా ఉండవు. కానీ వీటి ఘాటుదనం కూడా తక్కువే.

 

 

టాపిక్