తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fistula Symptoms, Treatment: ఫిస్టులా లక్షణాలు, చికిత్స ఇవే.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది

Fistula symptoms, treatment: ఫిస్టులా లక్షణాలు, చికిత్స ఇవే.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది

HT Telugu Desk HT Telugu

21 April 2023, 17:16 IST

google News
    • Fistula symptoms, treatment: ఫిస్టులా లక్షణాలు, చికిత్స మార్గాలపై వైద్య నిపుణులు అందించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఫిస్టులా వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫిస్టులా ప్రాణాంతకమంటున్న వైద్య నిపుణులు
ఫిస్టులా ప్రాణాంతకమంటున్న వైద్య నిపుణులు (Photo by Twitter/DrAllenKamrava)

ఫిస్టులా ప్రాణాంతకమంటున్న వైద్య నిపుణులు

మీకు ఫిస్టులా ఉన్నట్లు నిర్ధారణ అయితే మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈ ఆరోగ్య పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలో పడతారు. చికిత్స చేయకుండా వదిలేస్తే ఫిస్టులా బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుంది. ఇది సెప్సిస్‌గా మారుతుంది. లో బీపీ, అవయవ నష్టం లేదా మరణానికి కూడా కారణమయ్యే ప్రమాదకరమైన పరిస్థితి ఇది.

లాపరోస్కోపీ, లేజర్ సర్జన్ డాక్టర్ రాజన్ మోడీ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంబంధిత అంశాలపై వివరించారు. ‘ఫిస్టులా అనేది మల ద్వారం లోపలి నుంచి, మల ద్వారం చుట్టూ ఉన్న బయటి చర్మానికి మధ్య ఉండే సొరంగం. మల ద్వారంలోని గ్రంధుల ఇన్ఫెక్షన్ కారణంగా ఫిస్టులా ఉన్నట్టు గుర్తిస్తారు. చాలా మంది ఫిస్టులాతో బాధపడుతున్నారు. గాయం లేదా శస్త్రచికిత్స కారణంగా కూడా ఫిస్టులా వస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ కూడా ఫిస్టులాకు కారణమవుతుంది. మీరు మీ రోజువారీ కార్యకలాపాలపై దృష్టి పెట్టలేనంతగా అసౌకర్యం ఏర్పడుతుంది. క్రాన్స్ వ్యాధి, గాయాలవడం, క్షయ (టీబీ), క్యాన్సర్, లైంగికంగా సంక్రమించే వ్యాధుల వంటి కొన్ని అంశాలు ఈ పరిస్థితికి దారితీస్తాయి..’ అని వివరించారు.

Fistula symptoms: ఫిస్టులా లక్షణాలు

‘మల ద్వారం చుట్టూ గడ్డలు, నొప్పి, వాపు, చీము, చర్మం చికాకు పెట్టడం, రక్త స్రావం, మల విసర్జనలో నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఈ ఫిస్టులాలో కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మరో ఆలోచన లేకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎలాంటి జాప్యం లేకుండా చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ లక్షణాలు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మీ ప్రశాంతతను భంగపరుస్తాయి..’ అని డాక్టర్ వివరించారు.

complications of fistula: ఫిస్టులా వల్ల దుష్ప్రభావాలు ఇవే

‘ఫిస్టులా ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఫిస్టులాలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కారణంగా సెప్సిస్‌కు దారితీస్తుంది. ఈ పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు లోపీబీ, అవయవ నష్టం లేదా చావుకు కూడా దారితీయవచ్చు. ఒక్కోసారి ఈ పరిస్తితి పునరావృతమయ్యే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల మీ వైద్యుడిని తరచూ సంప్రదించడం మంచిది. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే అది పరిస్థితిని బట్టి వైద్య నిపుణులు నిర్ణయిస్తారు..’ అని డాక్టర్ వివరించారు.

Prevention: ఫిస్టులా నివారణ

ఫిస్టులా నివారణ చర్యలపై డాక్టర్ సలహా ఇచ్చారు. ‘మలబద్దకాన్ని నివారించాలి. ఇందుకు ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తినాలి. తగినన్ని నీళ్లు తాగడం ద్వారా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. సరైన జీవనశైలిని అలవరుచుకుంటే ఈ ఫిస్టులా రాకుండా కాపడుకోవచ్చు..’ అని వివరించారు.

టాపిక్

తదుపరి వ్యాసం