తెలుగు న్యూస్  /  ఫోటో  /  Avoid This Food In Piles: పైల్స్‌తో బాధలా.. ఈ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకండి

Avoid this food in piles: పైల్స్‌తో బాధలా.. ఈ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకండి

25 January 2023, 18:06 IST

పైల్స్‌తో బాధపడుతున్నారా? లేదా ఇంట్లో ఎవరికైనా పైల్స్‌తో సమస్యలు ఉన్నాయా? ఐతే ఈరోజు నుండి ఈ 5 ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.

  • పైల్స్‌తో బాధపడుతున్నారా? లేదా ఇంట్లో ఎవరికైనా పైల్స్‌తో సమస్యలు ఉన్నాయా? ఐతే ఈరోజు నుండి ఈ 5 ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.
అనారోగ్యకర జీవనశైలి, ఆహారపు అలవాట్లు శరీరంలో వివిధ వ్యాధులకు కారణమవుతాయి. పైల్స్ లేదా హెమోరాయిడ్స్‌ కూడా ఇలాగే వస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఉంటే దీర్ఘకాలంలో పైల్స్ వచ్చేందుకు కారణమవుతుంది. భవిష్యత్తులో పైల్స్ నివారించేందుకు ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండండి.
(1 / 5)

ప్రస్తుతం పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడ్డారు. నూనె, మసాలాలు, అనారోగ్యకరమైన పదార్థాలతో తయారైన ఈ ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరం చాలా కష్టపడాలి. జంక్ ఫుడ్ సరిగా జీర్ణం కాకపోవడం వల్ల మలబద్ధకం ఏర్పడి భవిష్యత్తులో పైల్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే పైల్స్‌తో ముప్పు ఉన్న వారు వీటి జోలికి వెళ్లొద్దు.
(2 / 5)

నూనె, మసాలాలు కలిసిన ఆహారం ఎవరికైనా నోరూరుతుంది. కానీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఇది అంత మంచిది కాదు. మసాలాలు, నూనెలు జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. మీకు పైల్స్ నుండి రక్తస్రావం అయ్యే అవకాశం ఉన్నట్లయితే మీరు ముఖ్యంగా ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.
(3 / 5)

ఈ రోజుల్లో పిజ్జా, పాస్తా, పరాటాలు, అన్నం.. ఇలా ప్రతిదానిలో చీజ్ జత చేస్తూ రుచికరంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మాంసాహార ఆహారాలకు ప్రత్యామ్నాయంగా చీజ్ ముఖ్యంగా ప్రోటీన్‌కు మంచి సోర్స్. కానీ మీరు పైల్స్‌తో బాధపడుతున్నట్టయితే మీ ఆహారంలో చీజ్ జత చేయకండి. ఇది మలబద్ధకం కలిగిస్తుంది. పైల్స్ బాధను మరింతగా పెంచుతుంది.
(4 / 5)

పచ్చి మిర్చిలో విటమిన్ సి ఉంటుంది. అయితే ఈ కారం చాలా తక్కువ పరిమాణంలో తినాలి. మరోవైపు ఎర్ర మిరపకాయలు లేదా ఎండు మిరపకాయలను ఆహారంలో అస్సలు ఉపయోగించకూడదు. దీనివల్ల మలబద్ధకం పెరిగి సమస్య ఇంకా పెరుగుతుంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి