తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పైల్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఇలా సులువుగా తగ్గించుకోండి!

పైల్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఇలా సులువుగా తగ్గించుకోండి!

HT Telugu Desk HT Telugu

19 June 2022, 0:01 IST

google News
    • పైల్స్‌ సమస్య ఉన్నవారికి నిల్చోవడం. కూర్చోవడం చాలా కష్టం ఉంటుంది. ఈ సమస్యలో, మలద్వారం లోపల, వెలుపల అలాగే పురీషనాళం దిగువ భాగంలో వాపు ఏర్పడుతుంది
piles
piles

piles

అదుపు తప్పిన జీవనశైలి కారణంగా చాలా మంది ఉదర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మలబద్ధకం.  సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుందిి. దీిన్ని నిర్లక్ష్యం చేస్తే పైల్స్‌ సమస్యకు దారి తీస్తుంది. ఈ వ్యాధిలో రక్తస్రావం సమస్య కూడా ఉంటుంది.

పైల్స్‌ సమస్య ఉన్నవారికి నిల్చోవడం.  కూర్చోవడం చాలా కష్టం ఉంటుంది. ఈ సమస్యలో, మలద్వారం లోపల, వెలుపల అలాగే పురీషనాళం  దిగువ భాగంలో వాపు ఏర్పడుతుంది. పైల్స్‌లో మల భాగంలో మొటిమ లాంటిది ఏర్పడుతుంది.  ఈ సమస్యను బాధపడేవారు.  కొన్ని ఇంటి నివారణలు సులువుగా తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. 

పైల్స్‌లో, మలద్వారం లేదా మల ప్రాంతంలోని రక్త నాళాలు  పెద్దవిగా మారుతాయి, దీని కారణంగా మంటతో పాటు తీవ్రమైన నొప్పి ఉంటుంది. పైల్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు మలబద్ధకం, జీర్ణక్రియ సరిగా జరగకపోవడం, బరువైన వస్తువులను ఎత్తడం, గ్యాస్ సమస్య, ఒత్తిడి, ఊబకాయం, అంగ సంపర్కం వంటివి కూడా ఈ వ్యాధికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కర్పూరం: పైల్స్ సమస్యలో అరటిపండు ముక్కతో కర్పూరాన్ని ఉపయోగించడం వల్ల ఉపశమనం ఉంటుంది

పాలు, నిమ్మకాయ: పైల్స్ సమస్యను తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పైల్స్ సమస్యతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపుతో ఒక కప్పు చల్లటి పాలలో సగం నిమ్మకాయను పిండి తాగాలి.

త్రిఫల పొడి: పైల్స్ సమస్య నుండి బయటపడటానికి, 100 గ్రాముల త్రిఫల పొడిని 100 గ్రాముల బకాయన్, 100 గ్రాముల వేప నిబోలితో కలిపి పొడిని తయారు చేయండి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మీరు ప్రయోజనం ఉంటుంది

తదుపరి వ్యాసం